ఆసక్తికర విషయాలు వెల్లడించిన సెక్స్ వర్కర్ | Bangalore Sex Worker Reveal Interesting points | Sakshi
Sakshi News home page

ఆసక్తికర విషయాలు వెల్లడించిన సెక్స్ వర్కర్

Published Wed, Jan 8 2014 7:22 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

ఆసక్తికర విషయాలు వెల్లడించిన సెక్స్ వర్కర్ - Sakshi

ఆసక్తికర విషయాలు వెల్లడించిన సెక్స్ వర్కర్

హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ‘ఖరీదైన’ వ్యభిచారం గుట్టును పోలీసులు రట్టు చేశారు. బెంగళూరుకు చెందిన ఓ సెక్క్‌వర్కర్‌తో పాటు ఆమెను ఇక్కడికి తీసుకొచ్చి ఈ ‘వ్యవహారం’ నడిపిస్తున్న ఇద్దరిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

బంజారాహిల్స్ రోడ్డు నెం.12లోని ఓ హోటల్‌లో వ్యభిచారం జరుగుతోందని స్థానిక పోలీసులకు సమాచారం అందింది.  ఎస్‌ఐ అన్వేష్‌రెడ్డి నేతృత్వంలోని బృందం వ్యభిచారం జరుగుతున్న హోటల్‌గదిపై దాడి చేశారు.  బెంగళూర్‌కు చెందిన ఓ సెక్స్ వర్కర్ (25)ను పట్టుకొని రెస్క్యూ హోమ్‌కు తరలించారు. ఈమెతో వ్యభిచారం చేయిస్తున్న రమణారెడ్డి, శివారెడ్డి అనే ఇద్దరిని అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు.

పోలీసుల విచారణలో ఆ యువతి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తాను బెంగళూరు నుంచి విమానంలో చెన్నై, ముంబై, ఢిల్లీ వంటి నగరాలకు వెళ్లి వ్యభిచారం చేస్తానని చెప్పింది. తనతో గంట గడపాలంటే రూ. 15 వేలు చెల్లించాల్సి ఉంటుందని, రోజులో ఆరు గంటలు మాత్రమే ‘పని’ చేస్తానని చెప్పింది. అయితే, వ్యభిచార కేంద్రం నిర్వాహకులు మాత్రం తనకు రోజుకు రూ.15 వేలు చెల్లించి, మిగతా డబ్బు వారే తీసుకుంటారని తెలిపింది. తాను ఐదు రోజుల క్రితం ఈ హోటల్‌కు వచ్చానని ఆ యువతి పేర్కొంది.  బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement