
సాక్షి, విజయవాడ : ఆంధ్రాబ్యాంక్ ఉద్యోగుల ధర్నాతో విజయవాడ వన్‌టౌన్ దద్దరిల్లుతోంది. బ్యాంకుల విలీనాన్ని నిరసిస్తూ ఆంధ్రబ్యాంక్ స్థానిక ఉద్యోగుల యూనియన్ విజయవాడలోని వన్ టౌన్ ఎదుట ఆందోళన చేపట్టారు. బ్యాంక్ విలీన ప్రక్రియను వెనక్కి తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేశారు. కేంద్రం మొండి వైఖరిని వీడకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆంధ్రాబ్యాంక్‌ను కాపాడి ప్రాంతీయత నిలబెట్టేందుకు ప్రాణాలైనా ఇస్తామంటూ వారు నినాదాలు చేశారు.
అదేవిధంగా బడాబాబుల నుంచి మొండి బకాయిలను వసూలు చేసి బ్యాంకును నిలబెట్టాలనేది ప్రతి ఆంధ్రుడి గుండెచప్పుడంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శలైన మధు, రామకృష్ణలు బ్యాంకు ఉద్యోగుల ధర్నాకు మద్దతుగా గళం విప్పి వారికి అండగా నిలిచారు. అదే విధంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి నరహరిశెట్టి నరసింహారావు కూడా శిబిరం వద్దకు వచ్చి ధర్నాకు సంఘీభావం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment