బ్యాంక్‌కు ‘దేశం’ నేత బురిడీ | Banks 'country' leader buridi | Sakshi
Sakshi News home page

బ్యాంక్‌కు ‘దేశం’ నేత బురిడీ

Published Sat, Apr 26 2014 12:24 AM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM

బ్యాంక్‌కు ‘దేశం’ నేత బురిడీ - Sakshi

బ్యాంక్‌కు ‘దేశం’ నేత బురిడీ

  •  బినామీ పేర్లతో రుణాలు
  •  రూ. 1.34 కోట్లు కొట్టేసిన ఘనుడు
  •  విచారణ చేపట్టిన అధికారులు
  •  కోటవురట్ల, న్యూస్‌లైన్ : బినామీ పేర్లతో ఓ వ్యక్తి బ్యాంకును బురిడీ కొట్టించాడు. రూ.1.34 కోట్లు రుణాలు తీసుకున్నాడు. అప్పు తీర్చాలని సదరు బ్యాంకువారు నోటీసులు పంపడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మైనర్లు, చనిపోయినవారి పేర్ల మీద కూడా ఆ బ్యాంకు అధికారులు రుణాలివ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై జోనల్ స్థాయి అధికారులు విచారణ చేపడుతున్నారు. మండలంలోని రాజుపేటకు చెందిన టీడీపీ నేత ఒకరు నర్సీపట్నంలోని ఆంధ్రాబ్యాం కు నుంచి 2007లో 253 మంది పేరున రూ.1,34,58,499లను రుణంగా పొందాడు.

    గ్రామంలోని పలువురికి ఈ నెల 4న ఆంధ్రాబ్యాంకు నుంచి నోటీసులు అందాయి. రుణంతో సంబంధం లేని వారంతా షాక్‌కు గురయ్యారు. అయోమయంలో పడ్డవారు. సమాచారహక్కు చట్టం కింద వివరాలు సేకరించారు. ఇదేమిటని సదరు వ్యక్తిని నిలదీస్తే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, రుణాలు మాఫీ అవుతాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్టు తెలిసింది.

    తమకు తెలియకుండానే తమ పేరుమీద రుణం పొందారని రాజుపేట శివారు రామన్నపాలెం గ్రామానికి చెందిన దంపతులు బొట్టా నూకరత్నం, బొట్టా కృష్ణలు ఆరోపించారు. అలాగే మరణించిన మళ్ల గంగమ్మ, యల్లపు మహాలక్ష్మి, వేగి సూర్యమ్మ, బొడ్డేటి నూకన్న, వేగి సీతయమ్మ, గాగి వెంకయమ్మ, పల్లా సింహాచలం పేర్లుమీద కూడా రుణాలు పొందిన ట్టు తెలిసింది. ఈమేరకు కొందరు బ్యాంకు మేనేజరు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
     
    రుణం ఎలా పొందారంటే...

    బినామీ పేర్లతో సదరు రుణం పొందిన వ్యక్తి గ్రామంలో పలువురిని తిరుపతిలో దేవుడి సేవకు తీసుకు వెళ్లేవారని చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో సేవకు ముందుగా దరఖాస్తు చేయాలని అందుకు ఫొటో, రేషన్ కార్డు జెరాక్స్ కాపీలు కావాలని తీసుకున్నారు. వాటిని ఉపయోగించి బ్యాంకు నుంచి రుణం పొందినట్టు తెలిసింది. రూ.1.34 కోట్లు రుణాన్ని ఏ హామీతో ఇచ్చారన్నదే ప్రశ్నార్థకం. ఈ సంఘటనకు సంబంధించి ఆంధ్రాబ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ వినోద్ మాట్లాడుతూ 253 మంది ఫొటోలు, వేలిముద్రలు తమ వద్ద ఉన్నాయన్నారు. దీనిపై ఇప్పుడే మాకు ఫిర్యాదు అందింది. రుణం ఇచ్చినప్పటి బ్యాంకు సిబ్బంది ఇపుడు లేరు. తామంతా కొత్తవాళ్లం. దీనిపై జోనల్ ఆఫీసర్ విచారణ చేపడుతున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement