బెటాలియన్ కానిస్టేబుల్ ఆత్మహత్య
రేణిగుంట : రైల్లో వివాహితతో ఏర్పడ్డ పరిచయం కాస్తా ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు దారితీసింది. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున రేణిగుంట ఎర్రచందనం నిల్వల గోడౌన్ వద్ద చోటుచేసుకుంది. రేణిగుంట డీఎస్పీ నంజుండప్ప కథనం మేరకు.. 9వ ఏపీఎస్పీ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ సంతోష్‌కుమార్ (26) రేణిగుంట ఎర్రచందనం గోడౌన్ వద్ద శుక్రవారం వేకువజామున విధుల్లో ఉన్నాడు. తనవద్ద ఉన్న రైఫిల్‌తో గొంతుకింద పేల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన సిబ్బంది వెంటనే తిరుపతి రుయా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెం దాడు. మృతదేహాన్ని రుయా మార్చురీకి తరలించారు.
వివాహేతర సంబంధమే కారణమా...
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన సంతోష్‌కుమార్‌కు త ండ్రి మరణించగా తల్లి, ఓ చెల్లెలు ఉంది. ఇతనికి విజయవాడకు చెందిన ఓ వివాహితతో రైల్లో ఏర్పడ్డ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే అతను ఆమెకు కొంతకాలంగా దూరంగా ఉంటుండంతో తన ను మోసం చేశాడని విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో 3 నెలల క్రితం సంతోష్ మనస్థాపం చెంది విషం తిని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ కే సు విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో మానసిక క్షోభకు గురైన సంతోష్ ఆత్మహత్యకు పాల్పడి ఉండచ్చని డీఎస్పీ తెలిపారు.
అన్ని కోణాల్లో దర్యాప్తు
కానిస్టేబుల్ ఆత్మహత్య ఘటనపై సీఐ సాయినాథ్, ఎస్‌ఐ నాగార్జునరెడ్డి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఇప్పటికే క్లూస్ టీం సంఘటనా స్థలాన్ని పరి శీలించిందన్నారు. ఆ తుపాకీలో 20 బుల్లెట్లు ఉంటాయని, ఎన్ని బుల్లెట్లు పేల్చుకున్నారు, ఎన్ని మిగిలి ఉన్నాయన్న విషయాలను పరిశీలించామన్నారు.
ఆగిన పోస్టుమార్టం
ఉదయమే మార్చురీకి మృతదేహాన్ని తరలించినా ఎఫ్‌ఐఆర్ ఆలస్యంగా నమోదు కావడం, శ్రీకాకుళం నుంచి ఇంకా కుటుంబసభ్యులు రాకపోవడంతో పోస్టుమార్టం నిలిపేశారు. కాగా డీఐజీ సత్యనారాయణ, అర్బన్ ఎస్పీ గోపీనాథ్‌జెట్టి, సీసీఎఫ్ చలపతి రావు, 9వ బెటాలియన్ కమాండెంట్లు మోహన్, ఆరీఫుల్లా, అసిస్టెంట్ కమాండెంట్ శ్రీనివాస్, చిత్తూరు ఈస్ట్ డీఎఫ్‌వో వెంకటస్వామి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం సంతోష్ మృతదేహాన్ని సందర్శించారు.