విద్యాసంవత్సరం{పారంభమైనా తెరుచుకోని ఈ పాస్ఫీజులు.. ఉపకార వేతనాలపైఎడతెగని జాప్యం ఎటూ తేల్చని
రాష్ట్ర ప్రభుత్వం ఆందోళనలో విద్యార్థులు.. తల్లితండ్రులు
విశాఖపట్నం రాష్ర్ట విభజన పాపం విద్యార్థులను శాపంలా వెన్నాడుతోంది. విద్యా సంవత్సరం ఆరంభమై నాలుగునెలలు గడుస్తున్నా నేటికీ ట్యూషన్ ఫీజులు, మెస్‌చార్జీల కోసం దర ఖాస్తుచేయలేని పరిస్థితి నెలకొంది. తెలంగాణలోని ఆంధ్ర విద్యార్థుల విషయంలో సర్కారు నాన్చుడు ధోరణి ఇక్కడి వారిని కలవరపెడుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగ, మైనార్టీలతో పాటు ఈబీసీ వర్గానికి చెందిన ఇంటర్మీడియట్, ఆపైన కోర్సుల విద్యార్థులు ఏటా ట్యూషన్ ఫీజులు, ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేస్తుంటారు. అడ్మిషన్ సమయంలోనే అర్హుల నుంచి విద్యాసంస్థలు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
ఆధార్‌కార్డులు, అకౌంట్ నెంబర్లను కూడా తీసుకుంటారు. విద్యాసంవత్సరం ఆరంభ మైన నెలలోగా తొలుత విద్యాసంస్థల వారీగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. తర్వాత అర్హుల జాబితాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. వాటిని అధికారులు పరిశీలించి సిఫార్సు చేస్తారు. వాటికనుగుణంగానాలుగునెలలకొకసారి నిధులు విడుదల చేస్తుంటారు. ఇదంతా రెగ్యులర్‌గా జరిగే ప్రక్రియ. కానీ ఈ ఏడాది ఇప్పటివరకూ విద్యాసంస్థల రిజిస్ట్రేషన్ కూడా పూర్తికాలేదు. మరొక పక్క ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఉద్దేశించిన వెబ్‌సైట్ కూడా తెరుచుకోలేదు. దీంతో విద్యార్థులు ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేక ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో 2014-15లో కళాశాల స్థాయిలో కొత్తగా 6.82 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, మరో 7.39 లక్షల మంది మంది రెన్యువల్ చేయించుకున్నారు. వీరికి సంబంధించి బకాయిలు మరో రూ.150కోట్ల వరకు ఉన్నాయి.
ఈ ఏడాది ఇప్పటి వరకు ఏ స్థాయిలో ఎంతమంది చేరారు?ఎంత మంది అర్హులో కూడా తెలియని పరిస్థితి. ఇంటర్మీడియట్ ఆపైబడి ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరే విద్యార్థుల విషయంలో సందిగ్దత కొనసాగుతోంది. ఇక్కడ పుట్టి తెలంగాణాలో చదువుకుంటున్న వారు.. తెలంగాణాలో పుట్టి ఇక్కడ చదువుకుంటున్న వారి విషయంలో ఇరు రాష్ట్రాలు ఒక నిర్ణయానికి రానందునే జాప్యం జరుగుతోందని భోగట్టా. తమ రాష్ర్టంలో చదువుతున్న ఇతర రాష్ట్రాల విద్యార్థుల విషయాన్ని పెండింగ్‌లో పెట్టిన తెలంగాణా సర్కార్ తమ రాష్ర్ట విద్యార్థులకు మాత్రం ఇప్పటికే ఉపకార వేతనాలు, మెస్‌చార్జీలు, ఫీజురింయబర్సుమెంట్ విషయంలో దరఖాస్తుల స్వీకరిస్తోంది. మన ప్రభుత్వంమాత్రం కావాలనే జాప్యం చేస్తుందనే వాదన విన్పిస్తోంది.
ఇదా ఉపకారం
Published Thu, Sep 24 2015 11:54 PM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
Advertisement
Advertisement