రాజధానిపై తొందరెందుకు
చైతన్య యాత్రలో బెరైడ్డి
కర్నూలు సిటీ: పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని ఉన్నా అమరాతి నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంత తొందరెందుకని రాయల సీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖర్ రెడ్డి విమర్శించారు. రాయల సీమ చైతన్య యాత్రలో భాగంగా ఆదివారం స్థానిక బీక్యాంపులోని ఆరోరనగర్, జోహరాపురంలో నిర్వహించిన యాత్రలో బెరైడ్డి ప్రసంగించారు. ఉమ్మడి రాష్ట్రంలో నుంచి కరువు సీమకు అన్యాయం జరుగుతునే ఉందన్నారు. 1953 సంవత్సరం నుంచి కేవలం మూడేళ్లు మాత్రమే కర్నూలును రాజధానిగా చేశారని అన్నారు. రాజధాని తరలిపోవడం వల్ల తీవ్రంగా నష్టపోయామని అన్నారు.
రాష్ట్ర విభజన సమయంలో మూడు రాష్ట్రాలుగా విభజించాలని, కోస్తా నేతల పెత్తనంతో సీమ ప్రజలు బతకలేరని చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదన్నారు. ఉద్యోగ నియమాకాల్లో, పదోన్నతుల్లో సీమ వాసులకు అన్యాయం జరుతుందన్నారు. ఇటీవలే 120 జీఓ ఇచ్చి కోస్తా ప్రాంతానికి చెందిన వారికి మెడికల్ సీట్లు ఇవ్వాలని చంద్రబాబు చూస్తే ఆందోళనలు చేసి కోర్టుల్లో కేసులు వేశాక వెనక్కి తగ్గారన్నారు. దోపీడి సొమ్ముతోనే ముఖ్యమంత్రి ప్రతిపక్ష ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు.