తొలిసారి భద్రాద్రి వెలుపల సీతారాముల కళ్యాణం
సాక్షి, హైదరాబాద్: తొలిసారిగా భద్రాచల సీతారాముల కళ్యాణోత్సవం, పట్టాభిషేక మహోత్సవం భద్రాద్రి వెలుపల కర్ణాటకలోని కోలార్ జిల్లా శ్రీనివాసపురంలో ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కళ్యాణోత్సవానికి వేలాది మంది భక్తజనం కదలివచ్చారు. చారిత్రక భద్రాచల దేవస్థాన సీతారామ కళ్యాణం ఇంతవరకు భద్రాద్రి వెలుపల జరగలేదు. పరుచూరి గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ పరుచూరి సురేంద్రకుమార్ ఈ కళ్యాణ నిర్వహణకు సారథ్యం వహించారు.