
‘బంగారంపై ఆంక్షలు దారుణం’
తిరుపతి: బంగారంపై ఆంక్షలు విధించడం దారుణమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోదీకి మహిళల ఉసురు కచ్చితంగా తగులుతుందని పేర్కొన్నారు.
అనాలోచితంగా పాత పెద్ద నోట్లను రద్దు చేసిందని విమర్శించారు. నోట్ల రద్దు పేరుతో కేంద్ర ప్రభుత్వం.. సామాన్యుల ప్రాణాలు తీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నోట్ల కష్టాలు తొలగించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.