ఆ రెండు పార్టీల వల్లే విభజన | bifurcation is due to congress and tdp : ysrcongress | Sakshi
Sakshi News home page

ఆ రెండు పార్టీల వల్లే విభజన

Published Fri, Dec 20 2013 6:52 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

bifurcation is due to congress and tdp : ysrcongress

 రాష్ట్ర విభజనకు కాంగ్రెస్, టీడీపీలే కారణమని వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త ఆర్ వీ సుజయ్‌కృష్ణ రంగారావు అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే ఆ రెండు పార్టీలకు బుద్ధి చెబుతారన్నారు. గురువారం ఆ పార్టీ గజపతినగరం నియోజకవర్గం సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు ఇంటి వద్ద జరిగిన నియోజకవర్గ విసృ్తతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.
 
 గజపతినగరం, న్యూస్‌లైన్ :
  రాష్ట్ర విభజనకు కాంగ్రెస్, టీడీపీలే కారణమని వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త ఆర్ వీ సుజయ్‌కృష్ణ రంగారావు అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే ఆ రెండు పార్టీలకు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. గురు వారం ఆ పార్టీ గజపతినగరం నియోజకవర్గం సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు ఇంటి వద్ద జరిగిన నియోజకవర్గ విసృ్తతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ 150 అసెంబ్లీ స్థానాలు, 20 పార్లమెంట్ స్థానాలు పొందడం ఖాయమన్నారు. వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమని చెప్పారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా నడుచుకుంటున్న కాంగ్రెస్, టీడీపీలకు డిపాజిట్లు కూడా దక్కవని తెలిపారు.
 
 సీఎం కిరణ్, చం ద్రబాబు విభజనకు సహకరిస్తూ.. సీమాంధ్ర ప్రజలను మో సం చేస్తున్నారన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ సమైక్యాంధ్ర ద్రోహి అని, ఆయన వల్ల జిల్లాకు చెడ్డ పేరు వస్తుం దన్నారు. నియోజకవర్గ సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమకారులు, విద్యార్థులపై అక్రమ కేసులు బనాయించిన బొత్స కుటుంబాన్ని వచ్చే ఎన్నికల్లో తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సాలూరు, చీపురుపల్లి, విజయనగరం నియోజకవర్గాల సమన్వయకర్తలు రాయల  సుందరరావు, ప్రశాంత్ కుమార్, మీసాల వరహాలనాయుడు, గుర్రాన అయ్యలు, జెడ్పీ మాజీ చైర్మన్ గులిపిల్లి సుదర్శనరావు, జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ ఆదాడ మోహనరావు, గజపతినగరం, బొండపల్లి , దత్తిరాజేరు మండలాల పార్టీ కన్వీనర్లు ఈదుబిల్లి కృష్ణ, గెద్ద రమేష్, బోడసింగి సత్తిబాబు, గిడిజాల కామునాయుడు, కో డి బాబ్జి, ఉప్పలీశ్వరరావు, తాడ్డి చిరంజీవులు, టోకుల అప్ప  లనాయుడు, తదితరులు పాల్గొన్నారు.
 
 బొత్స ఆస్తుల పరిరక్షణకే చట్టాలు :
 విజయనగరం టౌన్ : విభజనకు కారణమైన బొత్స అండ్ కో ఆస్తుల పరిరక్షణకే విజయనగరం పట్టణంలో పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు అన్నారు. గురువారం ఇందిరానగర్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలి త్రినాథ్, బాలి యో గేంద్రతో పాటు 200 మంది కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్య రా ష్ట్ర సాధన కోసం కృషి చేస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజ ల కష్టాలు తీర్చే నిజమైన నాయకుడు అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్, టీడీపీ నాయకుల తీరుతో ప్రజలు విసిగిపోయూరన్నారు. మహానేత వైఎస్సార్ అమలు చేసిన సంక్షేమ పథకాలు సక్రమంగా కొనసాగాలంటే జగన్‌మోహన్‌రెడ్డిని ము ఖ్యమంత్రి చేయూలని పిలుపునిచ్చారు. పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త సుజయ్ కృష్ణ రంగారావు మాట్లాడుతూ విభజనకు నిరసనగా పట్టణవాసులు తమ ఆవేదన తెలపకుండా ఉండేందుకు బొత్స కుటుంబీకులు తమ రాజ కీయ చతురతను ప్రదర్శించడం దారుణమన్నారు. విభజన కు మంత్రి బొత్సే కారణమని ఆరోపించారు. ఈ కార్యక్రమం లో విజయనగరం నియోజకవర్గ సమన్వయకర్తలు అవనాపు విజయ్,పార్టీ ప్రచార కమిటీ కార్యదర్శి గొర్లె వెంకటర మణ, పార్టీ రైతు విభాగం కన్వీనర్ సింగుబాబు, మక్కువ శ్రీధర్, డాక్టర్ సురేష్‌బాబు, రమేష్ (చినబాబు), నరసింగరావు, మజ్జి త్రినాథ్, ఇప్పిలి రామారావు, రాంబార్కి సత్యం, తది తరులు పాల్గొన్నారు.
 
 టీడీపీ నుంచి 300 కుటుంబాలు చేరిక
 గజపతినగరం : పాత బగ్గాం, బంగారమ్మపేట, అట్టాడ గ్రామాలకు చెందిన 300 కుంటుబాలు టీడీపీ నుంచి వైఎ స్సార్ సీపీలో చేరారుు. వారికి పార్టీ నాయకులు సుజయ్, కడుబండి కండువాలు వేసి, పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో పాత బగ్గాం గ్రామానికి చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యుడు కర్రి బంగారునాయుడు, కర్రి లక్ష్మణ, పప్పల గౌరునాయుడుతో పాటు 150 కుటుం బాలు, అలాగే బంగారమ్మపేట గ్రామానికి చెందిన బుగత సత్యనారాయణరాజుతో పాటు 100 కుటుంబాలు, జామి మండలం అట్టాడ గ్రామానికి చెందిన గోపిశెట్టి అప్పన్నబాబు, మట్టా రాము, గంటా వెంకటరావుతో పాటు 50 కుటుంబాలు పార్టీలో చేరారుు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement