- రాష్ట్రంలో బీజేపీ, టీడీపీలకు అదేగతి
- ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి
మదనపల్లె రూరల్: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు ప్రధాని నరేంద్రమోదీకి సామాన్యుడి చెంపపెట్టు లాంటిదని చిత్తూరు జిల్లా మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి విమర్శించారు. స్వచ్ఛ భారత్ పేరుతో మోదీ చీపురుపట్టి పోజులిచ్చారని, అదే చీపురుతో కేజ్రీవాల్ అతన్ని ఊడ్చిపారేశారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీలకు అదే గతి పడుతుందని అన్నారు.
మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి కేంద్రం ముష్టి వేసినట్లు రూ.50 కోట్లు ఇవ్వడం దారుణమన్నారు. బ్లాక్ మనీని బయటకు తీసుకొచ్చి జీరో అకౌం ట్లో వేస్తామని నమ్మించిన ప్రధాని మోది నేటికీ నెరవేర్చలేకపోయారని విమర్శించారు. ఉత్తుత్తి మాటలతో విదేశాలు తిరుగుతున్న ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు దీన్ని గుణపాఠంగా తీసుకోవాలని సూచించారు. నయవంచన పాలన సాగించే నాయకులకు ఇదే గతి పడుతుందని చెప్పారు. రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు రైతు, డ్వాక్రా రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి మాట నిలబెట్టుకోలేకపోయారన్నారు. ఈ సమావేశంలో రైతు సంఘం మండల క న్వీనర్ కొండూరు కృష్ణారెడ్డి, రెడ్డెప్పరెడ్డి, మోహననాయుడు, రమణ, విజయ, చంద్రప్ప పాల్గొన్నారు.
మోదీకి సామాన్యుడి చెంపపెట్టు
Published Wed, Feb 11 2015 12:52 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement