Desai Thippa Reddy
-
నిరంకుశ పాలనకు త్వరలో చరమ గీతం’
మదనపల్లె అర్బన్: శాసన వ్యవస్థలను నిర్వీర్యం చేసి నిరంకుశ పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో త్వరలో చరమగీతం పాడతామని ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ తన స్వప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం వద్ద హోదాను తాకట్టు పెట్టారని ఆరోపించారు. ప్రత్యేక ప్యాకేజీకి బీజేపీతో లాలూచీ పడిన చంద్రబాబు నాలుగేళ్ల తర్వాత మేల్కోవడం విడ్డూరమన్నారు. హోదా పేరెత్తితే కేసులు పెడతామని సీఎం హెచ్చరించడమే దీనికి నిదర్శనమన్నారు. ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ రాజీలేని పోరాటం చేస్తోందన్నారు. వైఎస్సార్ సీపీకి చెందిన ఎంపీలు ప్రత్యేక హోదా సాధనలో భాగంగా ఏప్రిల్ ఆరో తేదీన తమ పదవులకు రాజీనామా చేస్తారని పేర్కొన్నారు. రేపు నియోజకవర్గంలో ఎంపీ.. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఆదివారం మదనపల్లె నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా తురకపల్లెలో అంగన్వాడీ కేంద్రం, పుంగనూరువాండ్లపల్లెలో సీసీరోడ్డు, అమ్మచెరువుమిట్టలో కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. శ్మశానవాటిక, టిప్పుసుల్తాన్ జామీయా మసీద్ ప్రహరీ గోడల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం బసినికొండలో ముస్లింలతో సమావేశమవుతారని చెప్పారు. అనంతరం రామసముద్రం మండలం గొల్లపల్లెలో పార్టీ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. సాయంత్రం దిన్నెపల్లె, రామసముద్రంలో బసెషెల్టర్‌లను ప్రారంభిస్తారని తెలిపారు. సమావేశంలో నాయకులు జింకా వెంకటాచలపతి, అంకిశెట్టిపల్లె సర్పంచ్ శరత్‌రెడ్డి, జన్నే రాజేంద్రనాయుడు, రఫీ, కార్మిక విభాగం షరీఫ్, క్రిష్ణమూర్తి, రూరల్ కన్వీనర్ మహేష్, చంద్ర తదితరులు పాల్గొన్నారు. -
'చంద్రబాబే ముద్దాయి' :దేశాయి తిప్పారెడ్డి
-
'చంద్రబాబే ముద్దాయి'
అమరావతి: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణానికి ప్రత్యక్షంగా సీఎం చంద్రబాబే కారకుడని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి ఆరోపించారు. ఈ విషయంలో చంద్రబాబే ముద్దాయని వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. మూడు రోజుల్లో మంత్రి పదవి ఇస్తానని ప్రలోభపెట్టి నాగిరెడ్డిని చంద్రబాబు టీడీపీలో చేర్చుకున్నారని, ఏడాది గడిచినా పదవి ఇవ్వకపోవడంతో ఆయన ఒత్తిడి గురయ్యారని చెప్పారు. నాగిరెడ్డి చనిపోవడానికి 24 గంటల ముందు చంద్రబాబుతో తీవ్ర వాగ్వాదం జరిగిందని వెల్లడించారు. దీంతో మనస్తాపం చెంది నాగిరెడ్డి ఆస్పత్రి పాలయ్యారని ఆరోపించారు. అసెంబ్లీలో సంతాపం పేరుతో టీడీపీ సభ్యులు ఏవేవొ మాట్లాడి రాజకీయ సభ చేశారని తిప్పారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభను చంద్రబాబు అపవిత్రం చేశారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేశ్ ధ్వజమెత్తారు. ఫిరాయింపులు ప్రోత్సహించి రాజ్యాంగాన్ని అవమానించారని, ఇప్పుడు నీతులు చెబుతున్నారని దుయ్యబట్టారు. -
నూతన వధూవరులకు వైఎస్ జగన్ అభినందనలు
-
నేడు మదనపల్లికి వైఎస్ జగన్
► మదనపల్లిలో ఎమ్మెల్యే కుమార్తె వివాహం ► పులివెందుల నుంచి కదిరి మీదుగా రాక మదనపల్లి (చిత్తూరు జిల్లా) : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, విపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం సాయంత్రం మదనపల్లి రానున్నారు. మదనపల్లి శాసనసభ్యులు డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి కుమార్తె కరిష్మా దేశాయ్, వరుడు లక్ష్మీకాంతరెడ్డిలను ఆశీర్వదించనున్నారు. ప్రస్తుతం వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఉన్న వైఎస్ జగన్ సాయంత్రం 3 గంటలకు అనంతపురం జిల్లా కదిరి, నల్లచెరువు, తనపల్లి, ములకలచెరువు మీదగా మదనపల్లి చేరుకుంటారని వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా సరిహద్దుల్లో భారీ స్వాగతానికి తంబళ్లపల్లి ఇన్చార్జి పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు జిల్లా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులు, పార్టీ ప్రముఖులు మదనపల్లి బయలుదేరుతున్నారు. -
జిల్లాలో కరువు కన్పించలేదా.. బాబూ!
►నేడు మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రంలలో ధర్నాలు ► ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి మదనపల్లె సిటీ: జిల్లాలో కరువుతో రైతులు అల్లాడిపోతుంటే వారి కష్టాలు కన్పించడం లేదని, ప్రతిపక్షపార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నావని మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. మదనపల్లెలో ఆదివారం వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. రుణమాఫీని పక్కనపెట్టి ప్రజాధనం తో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం సిగ్గులేదా అని తెలిపారు. కరువుతో రైతులు అల్లాడిపోతున్నారని కనీసం పశువుల కోసం గడ్డికేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం శోచనీయమన్నారు. రాయలసీమ ప్రాజెక్టులనీళ్లు తెలంగాణ దోచుకుంటే చంద్రబాబు ఏమీ పట్టనట్లు వ్యవహరించడం బాధాకరమన్నారు. ప్రత్యేకహోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురాకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆరోపించారు. కరువు పరిస్థితులపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా సోమవారం వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉదయం 10 గంటలకు ధర్నా చేస్తామన్నారు. నిమ్మనపల్లె, రామసముద్రంలలో కూడా ఆందోళన చేస్తామన్నారు. వైఎస్ఆర్ సీపీ నాయకులు జన్నే రాజేంద్రనాయుడు, మల్లికార్జుననాయుడు, వెంకటరమణ పాల్గొన్నారు. -
‘ఎమ్మెల్యేకు అవమానం’లో తప్పెవరిది?
ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి వినతిపత్రంపై విచారణ.. సీఎం ఆదేశం మదనపల్లె: ముఖ్యమంత్రి పర్యటనలో మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి ఇచ్చిన వినతి పత్రం హెలిప్యాడ్ వద్దే పడి ఉండటంపై విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబు జిల్లా అధికారులకు, టీడీపీ జిల్లా అధ్యక్షునికి ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 9న మదనపల్లె రూరల్ కాట్లాటపల్లి వద్ద హంద్రీ-నీవా సొరంగం పనులను పరిశీలించేందుకు వచ్చిన సీఎంకు స్థానిక ఎమ్మెల్యే తిప్పారెడ్డి నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 13 పేజీల వినతి పత్రాన్ని సమర్పించారు. ఆ పత్రం హెలిప్యాడ్ వద్దే పడేసి ఉండటాన్ని మర్నాడు గుర్తించారు. దీనిపై ‘సాక్షి’లో సోమవారం ‘ఎమ్మెల్యేకు అవమానం’ అన్న కథనం ప్రచురితమైంది. అధికారుల విచారణ: వినతి పత్రంపై ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కూడా విచారిస్తున్నారు. ఇందులో భాగంగా సాక్షి రిపోర్టర్‌ను కూడా ప్రశ్నించారు. హెలిప్యాడ్ వద్ద వినతి పత్రంలోని అన్ని పేజీలు పడిపోయాయా..? లేక కొన్ని పేజీలు మాత్రమే జారి పడ్డాయా..? అని ప్రశ్నించారు. మొత్తం 13 పేజీలు అక్కడే పడిపోయాయని తెలియడంతో వారు ఆ సమాచారం జిల్లా పోలీసు అధికారులకు అందజేశారు. దీనిపై మదనపల్లె సబ్‌కలెక్టర్ కృతికా భాత్రా కూడా విచారించారు. సాక్షి రిపోర్టర్‌కు కూడా ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. -
పతిపక్ష ఎమ్మెల్యేలపై బాబు సవతి ప్రేమ
► నిధులు ఇవ్వకుండా వివక్షచూపుతున్నాడు ► ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి మదనపల్లె రూరల్: ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సవతి ప్రేమ చూపుతున్నారని, నిధులు ఇవ్వకుండా వివక్ష చూపుతున్నాడని ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి ధ్వజమెత్తారు. స్థానిక వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మదనపల్లె నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో గళం విప్పానన్నారు. ముఖ్యంగా మున్సిపాలిటీలో అవకతవకలు, శానిటేషన్‌పై కాగ్ నివేదిక బహిర్గతం చేసిన అంశాలను నివేదించానన్నారు. వైద్య, ఆరోగ్య, తాగునీటి సమస్యలపై చర్చించానని తెలిపారు. బీటీ కళాశాలను యూనివర్సిటీ చేయాలన్న అంశంపై, ప్రభుత్వ మహిళ డిగ్రీ, జూనియర్ కళాశాలలో ఆదనపు భవనాల కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాన్నారు. హంద్రీ-నీవా, కాలువ పనులు త్వరితగతిన పూర్తి చేసి సమ్మర్‌స్టోరేజ్ పనులను కూడా వేగవంతం చేయాలని మాట్లాడినట్టు తెలిపారు. విరామ సమయంలో పూర్తి నివేదికలతో మంత్రుల వద్దకు వెళ్లి వ్యవసాయ మార్కెట్, మోడలైజేషన్, ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్, 200 పడకల ఆసుపత్రిగా మార్చాలనే అంశాలపై చర్చించానన్నారు. ముఖ్యంగా మదనపల్లె మున్సిపాలిటీలో జనాభా ప్రాతిపదికన తాగునీరు సరఫరా చేయడంలో అధికారుల విఫలమైన విషయాన్ని కాగ్ బహిర్గతం చేసిందన్నారు. అండర్‌డ్రైనేజీ వ్యవస్థను తీసుకు రావాలని మంత్రులతో మాట్లాడానన్నారు. ఈ సమావేశంలో నాయకులు దేశాయ్ జయదేవరెడ్డి, సర్పంచ్ శరత్‌రెడ్డి, హైదర్‌ఖాన్, అంబేడ్కర్ చంద్రశేఖర్, బీసీ నాయకులు పాల్ బాలాజా, బాలక్రిష్ణారెడ్డి ఉన్నారు. -
మున్సిపాలిటీ అక్రమాలపై ఎమ్మెల్యే ఫిర్యాదు
మదనపల్లి రూరల్ : చిత్తూరు జిల్లా మదనపల్లి మునిసిపాలిటీ అక్రమాలపై ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి సబ్ కలెక్టర్ కృతికా బాత్రాకు సోమవారం ఫిర్యాదు చేశారు. 200 మంది కాంట్రాక్టు పారిశుద్ధ్య సిబ్బందికి గాను కేవలం 60 మంది కార్మికులతోనే పనులు చేయిస్తున్నారని.. ఈ రూపేణా కోటి రూపాయల మేర అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరారు. -
హంద్రీ-నీవా కాలువ అనుసంధానానికి పోరాటం
-ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి నిమ్మనపల్లె: బాహుదాలోకి హంద్రీ-నీవా అనుసంధానం చేసేందుకు తనవంతు పోరాటం చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్‌తిప్పారెడ్డి తెలిపారు. గురువారం ఆయన మండలంలోని ముష్ఠూరు వద్దగల బాహుదా ప్రాజెక్టును సందర్శించి మాట్లాడారు. ఎక్కడ చూసినా వాగులు, వంకలు ప్రవహిస్తూ వరదలు ముంచెత్తుతుతంటే బాహుదా ప్రాజెక్టులోకి నీరు చేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వాల్మీకిపురం, మదనపల్లెను పాలించిన పాలకుల పాపమే బాహుదాకు నీరు చేరడం లేదని తెలి పారు. దాదాపు 3200 మంది నిమ్మనపల్లె, వాల్మీకిపురం మండలాల రైతులు ఈ ప్రాజెక్టు వలన ఫలితం పొందేవారన్నారు. 370 ఎకరాలలో విస్తరించి ఉన్న బాహుదా 385 ఎంసీఎఫ్‌టీలు నీటి సామర్థ్యం కలిగి ఉందన్నారు. 2,883 ఎకరాలకు నీరందించాల్సి ఉందని, అయితే ప్రాజెక్టులోకి కేవలం 50 ఎంసీఎఫ్‌టీ నీరు చేరడం బాధాకరమన్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో చర్చించి బాహుదాకు హంద్రీ-నీవా అనుసంధానం చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. బాహుదాలోకి 15ఏళ్లుగా నీరుచేరకపోవడంతో వ్యవసాయానికి స్వస్తి పలికి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు కూలి పనులకు వెళ్లడం బాధాకరమన్నారు. ఇరిగేషన్ ఏఈ మన్నన్, బాహుదా ఏఈ స్వర్ణలతతో బాహుదాకు సంబంధించి పలు విషయాలపై ఆరా తీశారు. మండలంలో ఆగిన మోడల్ స్కూల్ నిర్మాణానికి కృషి చేసి పనులు ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో మల్లప్ప, మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ సదాశివారెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షులు రెడ్డిశేఖర్‌రెడ్డి, నాయకులు విజయ్‌కుమార్‌రెడ్డి, ఎర్రయ్య, ఈశ్వర, వెంకటరమణారెడ్డి, నవాజ్, రైతులు పాల్గొన్నారు. -
సీఎం హామీలు నెరవేర్చాలని వైఎస్ఆర్సీపీ ధర్నా
- మదనపల్లెలో సీఎం దిష్టిబొమ్మ దగ్ధం - అడ్డుకునేందుకు పోలీసుల విఫలయత్నం మదనపల్లె: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ మదనపల్లెలో శుక్రవారం ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. టీడీపీ ఏడాది పాలనను నిరసిస్తూ వైఎస్సార్సీపీ నాయకులు స్థానిక టౌన్‌బ్యాంకు సర్కిల్లో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు 300లకు పైగా హామీలు గుప్పించిన చంద్రబాబు ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేదని అన్నారు. తెలంగాణా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అడ్డంగా దొరికిపోయిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ర్ట మంత్రి పీతల సుజాత ఇంట్లో రూ.10 లక్షల డబ్బు దొరికిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. అధికారుల బదిలీల్లో మంత్రులు అవినీతికి పాల్పడినట్లు ఆరోపించారు. రాజధాని, పట్టిసీమ పేరుతో చంద్రబాబు వేల కోట్ల రూపాయలు దండుకుని ఆ డబ్బుతో ఎమ్మెల్యేలను కొనే పని లో ఉన్నారని ఎద్దేవాచేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ర్ట సంయుక్త కార్యదర్శులు బాబ్జాన్, ఉదయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. అడ్డుకునేందుకు పోలీసుల విఫలయత్నం మదనపల్లెలో సీఎం దిష్టిబొమ్మను వైఎస్సార్ సీపీ నాయకులు దహనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలుసుకున్న పోలీసులు అడ్డుకునేందు కు విఫలయత్నం చేశారు. పోలీసులు అడ్డుకుంటారని ముందే ఊహిం చిన నాయకులు మూడు దిష్టిబొమ్మలను సిద్ధంగా ఉంచుకున్నారు. రెం డింటిని అడ్డుకోగా మరో దిష్టిబొమ్మను నాయకులు దహనం చేశారు. -
పట్టి సీమ..ఒట్టి సీమే
రైతు, ప్రజా సమ్యలపై తహశీల్దార్‌కు వినతి స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయాలి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలం కరువు రైతును ఆదుకోవాలని ఎమ్మెల్యే దేశాయ్ డిమాండ్ మదనపల్లె: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించిన ‘పట్టిసీమ’ కేవలం ఒట్టిసీమేనని మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి అన్నారు. పార్టీ పిలుపు మేరకు స్థానిక తహశీల్దార్ శివరామిరెడ్డికి పలు సమస్యలపై సోమవారం వినతి పత్రం అందజేశారు. ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయకుండా కొత్త ప్రాజెక్టులను నిర్మించాలనుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. పట్టిసీమ కోసం విడుదల చేసిన జీవోలో రాయలసీమకు నీళ్ల ప్రస్తావనే లేదన్నారు. పట్టిసీమ నుంచి తరలించే నీరు ఎక్కడ నిల్వ ఉంచుతారో చెప్పమంటే ప్రభుత్వం నీళ్లు నములుతోందని దుయ్యబట్టారు. జిల్లాలో మంచినీటి ఎద్దడి నివారించాలని, రైతు, రైతు కూలీల వలసలు నివారించాలని, కరువు, అకాల వర్షాలకు నష్టపోయిన పంటలకు తక్షణం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన వాగ్ధానాల ప్రకారం... స్వామి నాథన్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా పంట ఉత్పత్తి వ్యయానికి అదనంగా 50 శాతం కలిపి కనీస మద్దతు ధరను ప్రకటించాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు ధర లేనప్పుడు రైతుకు మద్దతుగా నిలబడేందుకు రూ:5000 కోట్లతో మార్కెట్ ఇంటర్ వెర్షన్ ఫండ్ ఏర్పాటు చేయాలని కోరారు. పంటలకు బీమా అమలు చేయాలని, వ్యవసాయ, డ్వాక్రా, చేనేత రుణాలన్నీ తక్షణం మాఫీ చేయాలన్నారు. రాయలసీమకు తాగు, సాగునీరు అందించాలంటే హంద్రీ-నీవాను పూర్తి చేయాలన్నారు. ఈ ప్రాజక్టుపై నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు. హంద్రీ-నీవాకు రూ:2000 కోట్లు అవసరముంటే, బడ్జెట్లో కేవలం రూ:200 కోట్లు మాత్రమే మంజూరు చేయడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుజనాబాలకృష్ణారెడ్డి, కౌన్సిలర్లు బాలగంగాధర్‌రెడ్డి, జింకా వెంకటచలపతి, ఖాజా, సర్పంచ్ శరత్‌రెడ్డి, జిల్లా టెలికాం సభ్యులు దండాల రవిచంద్రారెడ్డి, ఎంటీటీసి శ్రీకాంత్, నాయకులు బాలకృష్ణారెడ్డి, రఫీఖ్ అహ్మద్,మల్లికార్జున, తట్టి నాగరాజురెడ్డి, బుల్లెట్ షఫీ, సూరి, రాజు, దేవ, నూర్, అంబేడ్కర్ చంద్రశేఖర్, కొండయ్య, కోటూరి ఈశ్వర్, అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఆ ఐదు సంతకాలకు దిక్కేదీ ?
స్థాపించి రెండేళ్లు తిరగకనే రాష్ర్టస్థాయి ర్యాంకులు వార్షికోత్సవంలో ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి ప్రశంస మదనపల్లె రూరల్: శ్రీమేధావి సీఏ కళాశాల మదనపల్లెకు పేరు ప్రఖ్యాతులు తీసుకువస్తోందని ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి ప్రశంసించారు. స్థానిక కదిరి రోడ్లో శుక్రవారం శ్రీమేధావి సీఏ కళాశా రెండో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకులు చల్లపల్లె నరసింహారెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మదనపల్లెలో శ్రీమేధావి సీఏ కళాశాల స్థాపించి రెండు సంవత్సరాలు కూడా తిరగకనే రాష్ట్రంలో ర్యాంకుల పంట పండిస్తోందన్నారు. ఇప్పటికే ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయిలో నాల్గవ ర్యాంకులు తేవడం గర్వకారణమన్నారు. సీఏ చదివే విద్యార్థుల భవిత బంగారం అవుతుందని ఎమ్మెల్యే అన్నారు. సీఏ చదివిన విద్యార్థులకు ప్రభత్వు ఉద్యోగాలతో పాటు, దేశ విదేశాల్లో కూడా మంచి అవకాశాలు ఉంటాయన్నారు. గతంలో సీఏ చదవాలంటే తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదన్నారు. ప్రస్తుతం మన ఊర్లోనే సీఏ చదువుకునే భాగ్యం కల్పించిన శ్రీమేధావి కళాశాల యాజమాని కె.షరీఫ్, అస్రఫ్లకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రుణపడాల్సి ఉందన్నారు. ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి తరువాత మదనపల్లెలో సీఏ కళాశాలను నెలకొల్పడం అదృష్టంగా భావించాలని తెలిపారు. చల్లపల్లె నరసింహా రెడ్డి మాట్లాడుతూ..జాతి గర్వపడే లాంటి కళాశాల శ్రీమేధావి అన్నారు. కళాశాల యాజమాన్యం పట్టుదల, సిబ్బంది కృషి, విద్యార్థుల చొరవే పేరు ప్రఖ్యాతులకు కారణమన్నారు. ఇండియాలోనే శ్రీ మేధావి సీఏ కళాశాల నెంబర్‌వన్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. సమావేశ అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చివరగా రాష్ట్ర ర్యాంకులు సాధించిన విద్యార్థులు సాయి మౌనిక, ఇస్మాయిల్ జబీవుల్లాలను ఎమ్మెల్యే సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, అతిథులు చలపతి నాయుడు, అషఫ్,్ర విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
మోదీకి సామాన్యుడి చెంపపెట్టు
- రాష్ట్రంలో బీజేపీ, టీడీపీలకు అదేగతి - ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి మదనపల్లె రూరల్: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు ప్రధాని నరేంద్రమోదీకి సామాన్యుడి చెంపపెట్టు లాంటిదని చిత్తూరు జిల్లా మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి విమర్శించారు. స్వచ్ఛ భారత్ పేరుతో మోదీ చీపురుపట్టి పోజులిచ్చారని, అదే చీపురుతో కేజ్రీవాల్ అతన్ని ఊడ్చిపారేశారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీలకు అదే గతి పడుతుందని అన్నారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి కేంద్రం ముష్టి వేసినట్లు రూ.50 కోట్లు ఇవ్వడం దారుణమన్నారు. బ్లాక్ మనీని బయటకు తీసుకొచ్చి జీరో అకౌం ట్లో వేస్తామని నమ్మించిన ప్రధాని మోది నేటికీ నెరవేర్చలేకపోయారని విమర్శించారు. ఉత్తుత్తి మాటలతో విదేశాలు తిరుగుతున్న ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు దీన్ని గుణపాఠంగా తీసుకోవాలని సూచించారు. నయవంచన పాలన సాగించే నాయకులకు ఇదే గతి పడుతుందని చెప్పారు. రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు రైతు, డ్వాక్రా రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి మాట నిలబెట్టుకోలేకపోయారన్నారు. ఈ సమావేశంలో రైతు సంఘం మండల క న్వీనర్ కొండూరు కృష్ణారెడ్డి, రెడ్డెప్పరెడ్డి, మోహననాయుడు, రమణ, విజయ, చంద్రప్ప పాల్గొన్నారు. -
సరుకులు సరే...నీళ్లు ఎలా..?
ప్రతినెలా సంక్రాంతి కానుక ఇస్తేనే నిరుపేదలకు న్యాయం సరుకుల పంపిణీని ప్రారంభించిన ఎమ్మెల్యే, చైర్మన్ మదనపల్లె: కరువుసీమలోని ప్రజలకు ప్రతినెలా సంక్రాంతి కానుక రూపంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తేనే నిరుపేదలకు న్యాయం జరుగుతుందని మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక 8వ చౌకదుకాణంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సంక్రాంతి కానుక రూపంలో తెల్లరేషన్‌కార్డు ఉన్నవారికి ఆరు రకాల నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం హర్షణీయమన్నారు. సంక్రాంతి కానుక అంటూ నిత్యావసర వస్తువులు ఇస్తున్నారు కానీ వాటిని వండుకుని తినడానికి తాగునీటిని కూడా ఇవ్వాలన్నారు. ప్రభుత్వం నీటి సమస్య కూడా పరిష్కరిస్తేనే ప్రజలకు నిజమైన పండుగన్నారు. గామాల్లో రైతులు రుణాలు మాఫీ జరగకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయి పండుగ జరుపుకునే ఉత్సాహంలో లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఎన్నో ఆశలతో రుణమాఫీ జరుగుతుందని కలలుగన్న రైత్యాంగానికి ఈ సంక్రాంతి నిరాశే మిగిల్చిందన్నారు. పేద ప్రజలకు, రైతులకు ప్రభుత్వం బాసటగా నిలబడి వారి సమస్యలను పరిష్కరించినప్పుడే వారందరికీ నిజమైన సంక్రాంతని అభిప్రాయపడ్డారు. మున్సిపల్ చైర్మన్ కొడవలి శివప్రసాద్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగను ప్రజలు సుఖసంతోషాలతో జరుపుకోవాలని సీఎం చంద్రబాబునాయుడు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. నీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ప్రజలకు సంక్రాంతి కానుక సరుకులను ఎమ్మెల్యే, చైర్మన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ భవానీప్రసాద్, కమిషనర్ రాంబాబు, తహశీల్దార్ శివరామిరెడ్డి, సీఎస్‌డీటీ అమరనాథ్, కౌన్సిలర్లు బాబునాయుడు, మస్తాన్‌రెడ్డి, బండి ఆంజినేయులు, బండి నాగరాజు, నాయకులు కోటూరి ఈశ్వర్, ఆంజి, నూర్, పూజారి రమేష్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.