శ్రీమేధావి సీఏ కళాశాల మదనపల్లెకు పేరు ప్రఖ్యాతులు తీసుకువస్తోందని ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి ....
స్థాపించి రెండేళ్లు తిరగకనే రాష్ర్టస్థాయి ర్యాంకులు
వార్షికోత్సవంలో ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి ప్రశంస
మదనపల్లె రూరల్: శ్రీమేధావి సీఏ కళాశాల మదనపల్లెకు పేరు ప్రఖ్యాతులు తీసుకువస్తోందని ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి ప్రశంసించారు. స్థానిక కదిరి రోడ్‌లో శుక్రవారం శ్రీమేధావి సీఏ కళాశా రెండో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకులు చల్లపల్లె నరసింహారెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మదనపల్లెలో శ్రీమేధావి సీఏ కళాశాల స్థాపించి రెండు సంవత్సరాలు కూడా తిరగకనే రాష్ట్రంలో ర్యాంకుల పంట పండిస్తోందన్నారు. ఇప్పటికే ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయిలో నాల్గవ ర్యాంకులు తేవడం గర్వకారణమన్నారు. సీఏ చదివే విద్యార్థుల భవిత బంగారం అవుతుందని ఎమ్మెల్యే అన్నారు. సీఏ చదివిన విద్యార్థులకు ప్రభత్వు ఉద్యోగాలతో పాటు, దేశ విదేశాల్లో కూడా మంచి అవకాశాలు ఉంటాయన్నారు. గతంలో సీఏ చదవాలంటే తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదన్నారు.
ప్రస్తుతం మన ఊర్లోనే సీఏ చదువుకునే భాగ్యం కల్పించిన శ్రీమేధావి కళాశాల యాజమాని కె.షరీఫ్, అస్రఫ్‌లకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రుణపడాల్సి ఉందన్నారు. ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి తరువాత మదనపల్లెలో సీఏ కళాశాలను నెలకొల్పడం అదృష్టంగా భావించాలని తెలిపారు. చల్లపల్లె నరసింహా రెడ్డి మాట్లాడుతూ..జాతి గర్వపడే లాంటి కళాశాల శ్రీమేధావి అన్నారు. కళాశాల యాజమాన్యం పట్టుదల, సిబ్బంది కృషి, విద్యార్థుల చొరవే పేరు ప్రఖ్యాతులకు కారణమన్నారు. ఇండియాలోనే శ్రీ మేధావి సీఏ కళాశాల నెంబర్‌వన్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. సమావేశ అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చివరగా రాష్ట్ర ర్యాంకులు సాధించిన విద్యార్థులు సాయి మౌనిక, ఇస్మాయిల్ జబీవుల్లాలను ఎమ్మెల్యే సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, అతిథులు చలపతి నాయుడు, అషఫ్,్ర విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.