సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: పాత మిత్రుల మధ్య మళ్లీ స్నేహం చిగురిస్తుంది. కమలంతో దోస్తీ కట్టేందుకు సైకిల్ సై అంటోంది. జాతీయస్థాయిలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లతో కలిసి నడిచేందుకు కమలం దండు సన్నద్ధమవుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు కుదుర్చుకోవాలని ఇరుపార్టీలూ ఇప్పటికే ఒక అభిప్రాయానికొచ్చిన ప్పటికీ... ఊహించని విధంగా ముందొచ్చిన స్థానిక సంస్థల సమరంలోనే పొత్తు పొడిచింది. పురపాలక సంఘాల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుకు ఇరుపక్షాలు సంప్రదింపులు జరుపుతున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలో ఓ వె లుగు వెలిగిన టీడీపీ ప్రభ కాస్తా మసకబారింది.
విభజనను అడ్డుకుంటోందనే అపవాదును మూటగట్టుకున్న ఆ పార్టీ ప్రజల్లోకి వెళ్లేందుకు జంకుతోంది. ఈ క్రమంలోనే పలువురు ముఖ్యనేతలు ‘దేశం’కు గుడ్‌బై చెప్పారు.దీంతో బల హీనపడ్డ ఆ పార్టీ బీజేపీ పొత్తు కోసం తహతహలాడుతున్న సంగతి తెలిసిం దే. బీజేపీ సహకారంతోనే తెలంగాణ సాధ్యమైందని ప్రజలు విశ్వసిస్తున్నం దున.. ఆ పార్టీకి పెరిగిన ఆదరణను తమకు అనుకూలంగా మలుచుకోవాలని ‘దేశం’ నిర్ణయించింది. సార్వత్రిక సమరంలో అవగాహన కుదుర్చుకోవాలనే అంశంపై ఇరు పార్టీలు ప్రాథమికంగా చర్చలు జరుపుతున్న తరుణంలోనే మంగళవారం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కూడా బీజేపీతో పొత్తు ఖాయమనే సంకేతాలను పార్టీ నేతలకు ఇచ్చారు. స్నేహపూర్వక వాతావరణంలో సీట్ల సర్దుబాటు చేసుకోవాలని సూచించారు. దీంతో మున్సిపాలిటీల్లో సీట్లు పంచుకునే పనిని గుట్టుగా చేసిన ఇరుపార్టీల నేతలు.. ఇప్పుడు బాహాటంగానే సీట్ల కేటాయింపుపై సంప్రదింపులకు తెరలేపారు.
వికారాబాద్ పురపాలక సంఘం పరిధిలో 8 సీట్లపై కమలం కన్నేసినప్పటికీ, నాలు గు వార్డులు ఇచ్చేందుకు తెలుగుదేశం మొగ్గు చూపుతోంది. అలాగే తాండూరు మున్సిపాలిటీలో బీజేపీ బలంగాా ఉన్నందున.. ఆ పార్టీకి 12-14 డివిజన్ల ను విడిచిపెట్టేందుకు ఆసక్తి కనబరుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే రాజీనామాతో కొంత గందరగోళంలో ఉన్న టీడీపీ నాయకత్వం... బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ రాష్ట్ర పర్యటన బిజీలో ఉన్న ఆ పార్టీ బుధవారం సీట్ల సర్దుబాటుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం క నిపిస్తోంది. ఇబ్రహీంపట్నంలో నాలుగు వార్డులను బీజేపీకి వదిలేసేందుకు ‘దేశం’ సూత్రప్రాయంగా అంగీకరించింది. పెద్ద అంబర్‌పేటలో ఐదు స్థానాలు వారికి కేటాయించేందుకు ముందుకొచ్చింది. ఇక బడంగ్‌పేటలో ఒక వార్డును బీజేపీకి వదిలేసినట్లు.. మహేశ్వరం నియోజకవర్గం ఇన్‌చార్జి తీగల కృష్ణారెడ్డి ‘సాక్షి’కి వివరించారు. కాగా పొత్తుల విషయంలో పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇచ్చే స్పష్టతకు అనుగుణంగా స్థానికంగా టీడీపీతో మైత్రి ఆధారపడి ఉంటుందని బీజేపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు.
దోస్త్ మేరా దోస్త్!
Published Tue, Mar 11 2014 11:25 PM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement
Advertisement