మహానాడు తర్వాత పార్టీలో స్తబ్దత
నామినేటెడ్ పదవులు లేవని అసంతృప్తి
{Vూపు రాజకీయాలతో ఎవరి దారి వారిదే
మున్సిపల్ ఎన్నికలంటే ముచ్చెమటలు
పార్టీలో సీనియర్ల సహకారం లేదంటున్న ఎమ్మెల్యే
నగర టీడీపీలో నైరాశ్యం అలముకుంది. పార్టీ కేడర్‌లో ఉన్నట్టుండి తీవ్ర అసంతృప్తి నెలకొంది. రెండేళ్లుగా పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, మొదటినుంచీ పార్టీ జెండా మోసిన నాయకులకు న్యాయం జరగడం లేదనే వాదన గట్టిగా వినిపిస్తోంది. గ్రూపు రాజకీయాలు, ఆధిపత్య పోరాటాలతో నగర పార్టీ నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్న చందాన మెలుగుతున్నారు. మున్సిపల్ ఎన్నికలు ముంచుకొస్తున్నా పార్టీలో ప్రణాళికాబద్ధమైన కదలికలు కరువయ్యాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తిరుపతి: మహానాడు ముగిశాక తిరుపతి నగర టీడీపీలో స్తబ్దత నెలకొంది. నాయకులెవ్వరూ పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదు. దీనికో ప్రత్యేక కార ణం ఉంది. ఎప్పటి నుంచో వివిధ రకాల నామినేటెడ్ పదవులపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న పలువురు నగర నాయకులు ఈ మధ్య కాలంలో తీవ్ర నిరాశకు గురయ్యారు. తిరుపతి నగర కమిటీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని, కష్టపడ్డ నాయకులందరికీ సరైన న్యాయం జరుగుతుందని ఒకటికి నాలుగుసార్లు చెప్పిన పార్టీ పెద్దలు మహానాడు తర్వాత పట్టించుకోకపోవడంతో నాయకులందరూ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ మధ్య కాలంలో పార్టీ అధిష్టానం ఎంతోమందికి రాష్ట్రస్థాయిలో నామినేటెడ్ పదవులను కట్టబెట్టింది.
ఇందులో ఒక్క పదవి కూడా నగరానికి దక్కలేదు. దీనికితోడు అధికారులెవ్వరూ పనులు చేయడంలేదని, పోలీస్, రెవెన్యూ కార్యాలయాల్లో తమ మాటకు విలువ లేకుండా పోయిందన్న ఆక్రోశం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. కార్పొరేషన్ ఎన్నికలు దగ్గరపడుతున్నా ఇప్పటివరకూ డివి జన్ స్థాయి అభ్యర్థులను ఖరారు చేయడం గాని, అభివృద్ధి పనులను వేగవంతం చేయడంగాని జరగలేదన్న అభిప్రాయం ఉంది. అటు కార్పొరేషన్ కార్యాలయంలో చిన్నపాటి పనులు కూడా చేయించుకోలేకపోతున్నామన్న అసంతృప్తి పార్టీ శ్రేణుల్లో పెరిగింది. రేషన్ షాపులు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలను కూడా ఇప్పించుకోలేకపోతున్నపుడు పార్టీలో ఉండి ఏం ప్రయోజనమన్న భావన నాయకుల్లో వ్యక్తమవుతోంది. సోమవారం జరిగిన నగర కమిటీ సమావేశంలో పార్టీ నాయకులు ఈ విషయాలనే ప్రస్తావించి తమలోని అసంతృప్తిని వెళ్లగక్కారు. ఎమ్మెల్యే కూడా తనకు సీనియర్లు సహకరించడం లేదని, తనను నమ్ముకున్న వారికి ఏమీ చేయలేకపోతున్నానని ఆవేదన వెలిబుచ్చారు. ఒక దశలో ఉద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు కూడా. దీన్నిబట్టి పార్టీలో అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.
తిరుపతి: మహానాడు ముగిశాక తిరుపతి నగర టీడీపీలో స్తబ్దత నెలకొంది. నాయకులెవ్వరూ పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదు. దీనికో ప్రత్యేక కార ణం ఉంది. ఎప్పటి నుంచో వివిధ రకాల నామినేటెడ్ పదవులపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న పలువురు నగర నాయకులు ఈ మధ్య కాలంలో తీవ్ర నిరాశకు గురయ్యారు. తిరుపతి నగర కమిటీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని, కష్టపడ్డ నాయకులందరికీ సరైన న్యాయం జరుగుతుందని ఒకటికి నాలుగుసార్లు చెప్పిన పార్టీ పెద్దలు మహానాడు తర్వాత పట్టించుకోకపోవడంతో నాయకులందరూ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ మధ్య కాలంలో పార్టీ అధిష్టానం ఎంతోమందికి రాష్ట్రస్థాయిలో నామినేటెడ్ పదవులను కట్టబెట్టింది. ఇందులో ఒక్క పదవి కూడా నగరానికి దక్కలేదు. దీనికితోడు అధికారులెవ్వరూ పనులు చేయడంలేదని, పోలీస్, రెవెన్యూ కార్యాలయాల్లో తమ మాటకు విలువ లేకుండా పోయిందన్న ఆక్రోశం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. కార్పొరేషన్ ఎన్నికలు దగ్గరపడుతున్నా ఇప్పటివరకూ డివి జన్ స్థాయి అభ్యర్థులను ఖరారు చేయడం గాని, అభివృద్ధి పనులను వేగవంతం చేయడంగాని జరగలేదన్న అభిప్రాయం ఉంది. అటు కార్పొరేషన్ కార్యాలయంలో చిన్నపాటి పనులు కూడా చేయించుకోలేకపోతున్నామన్న అసంతృప్తి పార్టీ శ్రేణుల్లో పెరిగింది. రేషన్ షాపులు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలను కూడా ఇప్పించుకోలేకపోతున్నపుడు పార్టీలో ఉండి ఏం ప్రయోజనమన్న భావన నాయకుల్లో వ్యక్తమవుతోంది. సోమవారం జరిగిన నగర కమిటీ సమావేశంలో పార్టీ నాయకులు ఈ విషయాలనే ప్రస్తావించి తమలోని అసంతృప్తిని వెళ్లగక్కారు. ఎమ్మెల్యే కూడా తనకు సీనియర్లు సహకరించడం లేదని, తనను నమ్ముకున్న వారికి ఏమీ చేయలేకపోతున్నానని ఆవేదన వెలిబుచ్చారు. ఒక దశలో ఉద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు కూడా. దీన్నిబట్టి పార్టీలో అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.
తిరుపతి టీడీపీలో నైరాశ్యం
Published Thu, Jul 14 2016 1:41 AM | Last Updated on Wed, Oct 17 2018 6:27 PM
Advertisement