హైదరాబాద్ మినహా తెలంగాణ బంద్‌కు బీజేపీ మద్దతు | BJP supports telangana bundh except in hyderabad, says kishan reddy | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ మినహా తెలంగాణ బంద్‌కు బీజేపీ మద్దతు

Published Fri, Sep 6 2013 8:44 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

BJP supports telangana bundh except in hyderabad, says kishan reddy

హైదరాబాద్ మినహా తెలంగాణ బంద్‌కు మద్దతు ప్రకటిస్తున్నట్లు బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు జి. కిషన్రెడ్డి తెలిపారు. శుక్రవారం వరంగల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌లో గొడవలు సృష్టించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని  కిషన్‌రెడ్డి ఆరోపించారు. అందువల్ల శాంతిభద్రతలను కాపాడాలన్న ఉద్దేశంతోనే తాము హైదరాబాద్‌లో బంద్కు మద్దతు ఇవ్వడం లేదని వివరించారు.

ఇక, ఊసరవెల్లే చంద్రబాబు నాయుడిని చూస్తే భయపడుతుందని ఆ పార్టీ మాజీ నేత, ప్రస్తుత టీఆర్ఎస్ నాయకుడు కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు. నైతిక విలువలు పక్కనపెట్టి ఇరు ప్రాంతాల్లో చంద్ర బాబు విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement