గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం హరిశ్చంద్రపురం వద్ద కృష్ణానదిలో బుధవారం ఓ నాటు పడవ బోల్తా పడింది.
గుంటూరు : గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం హరిశ్చంద్రపురం వద్ద కృష్ణానదిలో బుధవారం ఓ నాటు పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు గల్లంతు కాగా, వారిలో ముగ్గుర్ని స్థానికులు రక్షించారు. గల్లంతు అయిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హరిశ్చంద్రపురంకు చెందిన నలుగురు గ్రామస్తులు తమ సొంత అవసరాల నిమిత్తం ఇసుక కోసం కృష్ణానదిలోకి వెళ్లారు.
ఇసుక లోడ్తో తిరిగి వస్తుండగా ఓవర్ లోడ్తో పడవ బోల్తా పడింది. దాంతో అందులో ప్రయాణిస్తున్నవారంతా నదిలో పడిపోయారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు.... చిన్నాబ్బాయి, బాబూరావు, మరొకరిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. కాగా గల్లంతు అయిన రామారావు కోసం గాలిస్తున్నారు. రెవెన్యూ సిబ్బందితో పాటు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.