వీహెచ్ వ్యాఖ్యలు సరికావు: ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి | Boomana Karunakar Reddy angry over V Hanumantha Rao Statement | Sakshi
Sakshi News home page

వీహెచ్ వ్యాఖ్యలు సరికావు: ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి

Published Sun, Aug 18 2013 2:08 PM | Last Updated on Thu, Sep 19 2019 8:28 PM

Boomana Karunakar Reddy angry over V Hanumantha Rao Statement

సమైక్యాంధ్ర ఉద్యమం కోసం ఉద్యమిస్తున్న సీమాంధ్రులను రెచ్చగొట్టేలా కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు వ్యాఖ్యలు చేయడం సరికాదు అని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన అంశం ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందనే విషయాన్ని వీహెచ్ గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తిరుపతిలో వీహెచ్ వ్యాఖ్యలు సమైక్యాంధ్ర ఉద్యమకారుల ఆగ్రహానికి కారణమైందని ఆయన అన్నారు.
 
వీహెచ్ వ్యాఖ్యలకు శాంతియుతంగా నిరసన తెలిపిన నేతలపై పోలీసులు దారుణంగా వ్యవహరించారు ఆయన ఆరోపించారు. ఉద్యమకారులను అరెస్ట్‌ చేయడం వెనుక సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హస్తముంది భూమన విమర్శించారు. రాష్ట్ర విభజనపై రాజకీయాలు చేసినా.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా.. ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని భూమన హెచ్చరించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement