Boomana Karunakar Reddy
-
దాసరికి సినీ,రాజకీయ ప్రముఖుల పరామర్శ
-
నీచ రాజకీయాలు మానుకో..
- చంద్రబాబుకు భూమన హితవు నెల్లూరురూరల్, న్యూస్‌లైన్ :నీచ రాజకీయాలు చేయడం మానుకోవాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు వైఎస్సార్సీపీ నాయకుడు భూమన కరుణాకర్‌రెడ్డి హితవు పలికారు. వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ సభ్యులతో పార్టీ సీజీసీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో కనుపర్తిపాడులోని వీపీఆర్ కన్వెన్షన్‌లో మంగళవారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ పార్టీ తరఫున ఎన్నికల్లో గెలుపొందిన వారిని టీడీపీ నాయకులు ప్రలోభాలకు గురిచేయడం సిగ్గుచేటన్నారు. కోడిపిల్లలను రాబంధులు ఎత్తుకెళ్లినట్లు వైఎస్సార్సీపీ అభ్యర్థులను ఎత్తుకెళ్లేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని ధ్వజమెత్తారు. ఆయన ఎత్తుగడలు ఫలించబోవన్నారు. కడప తర్వాత నెల్లూరు జిల్లాలోనే వైఎస్సార్సీపీకి ప్రజాదరణ ఎక్కువగా ఉందని ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయన్నారు. తమ పార్టీ తరపున ఎన్నికల్లో గెలుపొందిన వారు జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోనే ముందుకు సాగుతున్నారని స్పష్టం చేశారు. పార్టీ అధికారంలోకి రాలేదని ఎవరూ బాధపడవద్దన్నారు. వైఎస్సార్సీపీకి మంచి రోజులు రానున్నాయన్నారు. నెల్లూరు జెడ్పీ చైర్మన్‌గా బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిని ఎన్నుకోవాలని ఆయన పార్టీ జెడ్పీటీసీ సభ్యులకు పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్ మాట్లాడుతూ జిల్లాలో వైఎస్సార్సీపీ బలంగా ఉందన్నారు. ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతో పాటు, ఎక్కువ సంఖ్యలో కార్పొరేటర్, కౌన్సిలర్ స్థానాలు వైఎస్సార్సీపీకి దక్కాయన్నారు. టీడీపీ నేతల ప్రలోభాలకు తలొగ్గరాదని జెడ్పీటీసీ సభ్యులకు సూచించారు. రాఘవేంద్ర రెడ్డిని జెడ్పీ చైర్మన్‌గా ఎన్నుకోవాలని కోరారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ నాయకులు కొందరు టీడీపీలో చేరుతున్నారని వదంతులు రావడం బాధాకరమన్నారు. జెడ్పీటీసీ సభ్యులు టీడీపీ నేతల ప్రలోభాలు, ఒత్తిళ్లకు లొంగకుండా వైఎస్సార్సీపీకి అండగా నిలవాలన్నారు. జెడ్పీ చైర్మన్ అభ్యర్థి బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో వైఎస్సార్సీపీ 31 జెడ్పీటీసీలను కైవసం చేసుకుందని, సభ్యులెవరూ పార్టీని వీడే ప్రసక్తే లేదన్నారు. తమ పార్టీ జెడ్పీటీసీ సభ్యులను ప్రలోభపెట్టేందుకు టీడీపీ కుట్ర చేయడం సిగ్గుచేటన్నారు. తాను చైర్మన్‌గా ఎన్నికైన వెంటనే జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తానని, సభ్యులందరూ సహకరించాలని కోరారు. సమావేశంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, పార్టీ వెంకటగిరి సమన్వయకర్త కొమ్మి లక్ష్మయ్యనాయుడు, కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, సీజీసీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వీపీఆర్లో కోలాహలం వైఎస్సార్సీపీ నేతలు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు, కార్పొరేటర్లతో రెండు రోజులుగా కనుపర్తిపాడులోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్ కోలాహలంగా మారింది. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు, పార్టీ చర్చల్లో నిమగ్నమయ్యారు. నాయకులు భూమన కరుణాకర్‌రెడ్డి, ఆయా ప్రాంతాల రాజకీయ పరిస్థితులపై నాయకుల ద్వారా తెలుసుకున్నారు. మంగళవారం ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించిన జెడ్పీటీసీలు, నాయకులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. -
జగనన్నతోనే సంక్షేమం
అధికారంలోకి రాగానే చరిత్రలో నిలిచిపోయేటన్ని సంక్షేమ పథకాలు వైఎస్ఆర్ సీపీ రోడ్‌షోలో భూమన కరుణాకరరెడ్డి అడుగడుగునా హారతులు, పూలవర్షంతో మహిళల స్వాగతం తిరుపతి(మంగళం), న్యూస్‌లైన్ : మాట తప్పని.. మడమ తిప్పని వంశం నుంచి వచ్చిన వైఎస్. జగనమోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తేనే సంక్షేమం సాధ్యమని వైఎస్ఆర్ సీపీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి పరిధిలోని వైకుంఠపు రం, ఎంఆర్‌పల్లె సర్కిల్, వెస్ట్‌చర్చి రోడ్డు, పద్మావతినగర్, ఎస్వీనగర్తో పాటు సాయంత్రం కాటన్‌మిల్లు, కృష్ణారెడ్డినగర్, పూలవానిగుంట, ఆటోనగర్, అంబేద్కర్‌కాలనీ ప్రాంతాల్లో కరుణాకరరెడ్డి వేలాదిమందితో రోడ్‌షో నిర్వహిం చారు. వీరికి మహిళలు అడుగడుగునా హారతు లు, పూలవర్షంతో నీరాజనం పలికారు. ఈ సందర్భంగా కరుణాకరరెడ్డి మాట్లాడుతూ మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ఎన్నికల్లో గెలుపొందిన వెంటనే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఉచిత విద్యుత్ ఫైల్‌పై మొదటి సం తకం చేశాడన్నారు. ఆయన తనయుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి మాట కోసం పదవులు, ప్రా ణాలను సైతం అర్పించే దమ్మున్న వ్యక్తి అన్నా రు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓట్లు వేసి జగనన్నను గెలిపిస్తే ప్రపంచ చరిత్రలో నిలిచిపోయేటన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెడతారని తెలిపారు. చంద్రబాబునాయుడు తొ మ్మిదేళ్ల పాలనలో ప్రజలు పడరాని కష్టాలు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదమ్ము ల్లా కలసికట్టుగా ఉన్న తెలుగుజాతి ముక్కలు కావడానికి కిరణ్, చంద్రబాబు ముఖ్య కారకులన్నారు. ఇలాంటి దుర్మార్గులు ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడిగేందుకు సిగ్గుపడాలన్నారు. ప్రజలు వీరికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నా రు. రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా ఫ్యాను గుర్తుకు ఓట్లు వేసి జగనన్నను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, ఎస్కే.బాబు, పోతిరెడ్డి వెంకట రెడ్డి, ఎంవీఎస్.మణి, వెంకటమునిరెడ్డి, తిరుమలయ్య, మబ్బు నాదమునిరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, ముని సుబ్రమణ్యం, జీవరత్నం, డిష్ చం ద్ర, ఆదం రాధాకృష్ణారెడ్డి, ఆదం సుధాకరరెడ్డి, చల్లా, కుప్పయ్య, కిట్టు, వీరయ్య, రాము, శ్రీరాములు, లతారెడ్డి, విజయలక్ష్మి పాల్గొన్నారు. -
వీహెచ్ వ్యాఖ్యలు సరికావు: ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి
సమైక్యాంధ్ర ఉద్యమం కోసం ఉద్యమిస్తున్న సీమాంధ్రులను రెచ్చగొట్టేలా కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు వ్యాఖ్యలు చేయడం సరికాదు అని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన అంశం ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందనే విషయాన్ని వీహెచ్ గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తిరుపతిలో వీహెచ్ వ్యాఖ్యలు సమైక్యాంధ్ర ఉద్యమకారుల ఆగ్రహానికి కారణమైందని ఆయన అన్నారు. వీహెచ్ వ్యాఖ్యలకు శాంతియుతంగా నిరసన తెలిపిన నేతలపై పోలీసులు దారుణంగా వ్యవహరించారు ఆయన ఆరోపించారు. ఉద్యమకారులను అరెస్ట్ చేయడం వెనుక సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హస్తముంది భూమన విమర్శించారు. రాష్ట్ర విభజనపై రాజకీయాలు చేసినా.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా.. ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని భూమన హెచ్చరించారు.