జగనన్నతోనే సంక్షేమం
- అధికారంలోకి రాగానే చరిత్రలో నిలిచిపోయేటన్ని సంక్షేమ పథకాలు
- వైఎస్‌ఆర్ సీపీ రోడ్‌షోలో భూమన కరుణాకరరెడ్డి
- అడుగడుగునా హారతులు, పూలవర్షంతో మహిళల స్వాగతం
తిరుపతి(మంగళం), న్యూస్‌లైన్ : మాట తప్పని.. మడమ తిప్పని వంశం నుంచి వచ్చిన వైఎస్. జగనమోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తేనే సంక్షేమం సాధ్యమని వైఎస్‌ఆర్ సీపీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి పరిధిలోని వైకుంఠపు రం, ఎంఆర్‌పల్లె సర్కిల్, వెస్ట్‌చర్చి రోడ్డు, పద్మావతినగర్, ఎస్వీనగర్‌తో పాటు సాయంత్రం కాటన్‌మిల్లు, కృష్ణారెడ్డినగర్, పూలవానిగుంట, ఆటోనగర్, అంబేద్కర్‌కాలనీ ప్రాంతాల్లో కరుణాకరరెడ్డి వేలాదిమందితో రోడ్‌షో నిర్వహిం చారు.
వీరికి మహిళలు అడుగడుగునా హారతు లు, పూలవర్షంతో నీరాజనం పలికారు. ఈ సందర్భంగా కరుణాకరరెడ్డి మాట్లాడుతూ మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ఎన్నికల్లో గెలుపొందిన వెంటనే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఉచిత విద్యుత్ ఫైల్‌పై మొదటి సం తకం చేశాడన్నారు. ఆయన తనయుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మాట కోసం పదవులు, ప్రా ణాలను సైతం అర్పించే దమ్మున్న వ్యక్తి అన్నా రు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓట్లు వేసి జగనన్నను గెలిపిస్తే ప్రపంచ చరిత్రలో నిలిచిపోయేటన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెడతారని తెలిపారు. చంద్రబాబునాయుడు తొ మ్మిదేళ్ల పాలనలో ప్రజలు పడరాని కష్టాలు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదమ్ము ల్లా కలసికట్టుగా ఉన్న తెలుగుజాతి ముక్కలు కావడానికి కిరణ్, చంద్రబాబు ముఖ్య కారకులన్నారు. ఇలాంటి దుర్మార్గులు ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడిగేందుకు సిగ్గుపడాలన్నారు.
ప్రజలు వీరికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నా రు. రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా ఫ్యాను గుర్తుకు ఓట్లు వేసి జగనన్నను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, ఎస్‌కే.బాబు, పోతిరెడ్డి వెంకట రెడ్డి, ఎంవీఎస్.మణి, వెంకటమునిరెడ్డి, తిరుమలయ్య, మబ్బు నాదమునిరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, ముని సుబ్రమణ్యం, జీవరత్నం, డిష్ చం ద్ర, ఆదం రాధాకృష్ణారెడ్డి, ఆదం సుధాకరరెడ్డి, చల్లా, కుప్పయ్య, కిట్టు, వీరయ్య, రాము, శ్రీరాములు, లతారెడ్డి, విజయలక్ష్మి పాల్గొన్నారు.