'బీజేపీలో చేరుతారన్న కథనాలు అవాస్తవం' | Botsa satyanarayana couple to join BJP?,condemns rudraraju padmaraju | Sakshi
Sakshi News home page

'బీజేపీలో చేరుతారన్న కథనాలు అవాస్తవం'

Published Tue, Mar 25 2014 2:16 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

'బీజేపీలో చేరుతారన్న కథనాలు అవాస్తవం' - Sakshi

'బీజేపీలో చేరుతారన్న కథనాలు అవాస్తవం'

హైదరాబాద్ : మాజీమంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బీజేపీలో చేరుతారన్న కథనాలు అవాస్తవమని సీమాంధ్ర పీసీసీ అధికార ప్రతినిధి ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు అన్నారు. బొత్స కరుడుకట్టిన కాంగ్రెస్ వాది అని ఆయన మంగళవారమిక్కడ వ్యాఖ్యానించారు. మొన్నటి వరకు పీసీసీ చీఫ్గా పనిచేసిన ఆయన కాంగ్రెస్ను వీడుతారనుకోవటం లేదన్నారు.

చంద్రబాబు చెప్పేదొకటి...చేసేదొకటి అని పద్మరాజు మండిపడ్డారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటం ఆయనకు తెలియదని ధ్వజమెత్తారు. రుణమాఫీ అంటూ ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను చంద్రబాబు మభ్యపెడుతున్నారన్నారు. అందుకే చంద్రబాబు ఆల్ఫ్రీ బాబు అని ప్రజలు వ్యంగ్యంగా చెప్పుకుంటున్నారని పద్మరాజు అన్నారు. సామాజిక న్యాయం అంటూ ఏళ్ల తరబడి బీసీలను టీడీపీ మోసం చేస్తోందని సీమాంధ్ర పీసీసీ అధికార ప్రతినిధి గౌతమ్ ఆరోపించారు. బీసీలపై చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే సీమాంధ్ర సీఎం పదవికి బీసీ పేరును ప్రతిపాదించాలని సవాల్ విసిరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement