కాంగ్రెస్ ఎంపీలకు సత్తిబాబు బుజ్జగింపు
Published Fri, Sep 27 2013 6:48 AM | Last Updated on Fri, Sep 1 2017 11:06 PM
సాక్షి ప్రతినిధి, విజయనగరం: తమకు ప్రజలకన్నా పదవులే ముఖ్య మని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మరోసారి రుజువు చేశారు. ప్రజల ఆకాంక్షలకన్నా తమ స్వార్థ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇస్తామని నిరూపించారు. విభజన ప్రక్రియను వ్యతిరేకిస్తున్న వారిని బుజ్జగించే బాధ్యతను తన భుజాన వేసుకున్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర జిల్లాలకు చెందిన పలువురు ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయాలని భావించి స్పీకర్ అపాయింట్‌మెంట్ సైతం తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించే ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులను నియంత్రించే బాధ్యతను సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, బొత్స సత్తిబాబులకు అధిష్టానం అప్పగిం చినట్లు తెలిసింది. అధిష్టానం నిర్ణయాన్ని వ్యతి రేకించిన వారితో బొత్స మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. ఈమేరకు ఎంపీలతో సమావేశమై వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. వీలైతే అంద రం ఒకేసారి రాజీనామాలు చేద్దామని, ఇలా ఎవరికి వారే నిర్ణయం తీసుకోవద్దని సలహా ఇచ్చినట్లు తెలిసింది. స్పీకర్ మీరాకుమార్ కూడా పాట్నా పర్యటనకు వెళ్లడంతో సదరు ఎంపీల ప్రయత్నం ఫలించలేదు. ప్రస్తుత పరి ణామాల నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దాదాపు కనుమరుగైనట్లేనని ప్రజలు భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో సత్తిబాబు రాజ కీయ భవిష్యత్ ప్రశ్నార్థకమైంది. దీంతో తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం, భవి ష్యత్‌లో అధిష్టానం ప్రాపకంతో పదవులు పొం దాలన్న ఆశతోనే ఆయన ఇలాంటి ప్రజాద్రోహా నికి పాల్పడుతున్నారని విజయనగరం జిల్లాలో ని ప్రజా, ఉద్యమ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ఝాన్సీ రాజీనామా చేయరా?
విభజన నేపథ్యంలో రాష్ట్రం అగ్ని గుండంలా మారింది. విద్యార్థుల దగ్గర్నుంచి అన్ని వర్గా లూ, అన్ని ఉద్యోగ సంఘాలూ ఉద్యమంలో భాగస్వాములవుతున్నాయి. అయితే దీనికి బొత్స కుటుంబ సభ్యులు మినహాయింపు. సత్తిబాబు, ఆయన సతీమణి ఎంపీ ఝాన్సీ, సోదరుడైన గజపతినగరం ఎమ్మెల్యే అప్పలనర్సయ్య, మరో బంధువు నెల్లిమర్ల ఎమ్మెల్యే అప్పలనాయుడు మాత్రం ఉద్యమానికి, ప్రజల ఆకాంక్షలకు దూరంగా ఉంటున్నారు. సీమాంధ్ర ఎంపీల రాజీనామాలు ఎలాగూ స్పీకర్ ఆమోదం పొందవు. దీనికి అధిష్టానం ఎలాగూ సమ్మతించదు. ఇలాంటపుడు అందరిమాదిరిగా ఉత్తుత్తి రాజీనామా చేసేందుకు సైతం ఝాన్సీ ముందుకు రాకపోవడం ఉద్యమకారులను కలచివేస్తోంది. పార్లమెంట్‌లో వాణి వినిపించేందుకే పదవిలో ఉంటున్నానని ఆమె గతంలో చెప్పినా ఆమె ఏనాడూ సమైక్యాంధ్ర కోసం సభలో గళం విప్పలేదు. అధిష్టానం కనుసన్నల్లో మెలుగుతూ మెప్పు పొందుతూ పబ్బం గడుపుకోవడం, అవకాశవాద రాజకీయాలు చేయడం బొత్స కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య అని జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు.
Advertisement
Advertisement