బాలుడి ఖరీదు లక్ష రూపాయలు! | boy to sale for one lakh | Sakshi
Sakshi News home page

బాలుడి ఖరీదు లక్ష రూపాయలు!

Published Mon, Feb 16 2015 9:36 PM | Last Updated on Tue, Aug 28 2018 7:09 PM

బాలుడి ఖరీదు లక్ష రూపాయలు! - Sakshi

బాలుడి ఖరీదు లక్ష రూపాయలు!

ఏలూరు: ఏ తల్లి కన్నబిడ్డో తెలీదుకానీ.. ముక్కుపచ్చలారని మూడు సంవత్సరాల బాలుడు వారం రోజులుగా అంగట్లో లక్షరూపాయల ఖరీదుకు అమ్మకానికి సిధ్దంగా ఉన్నాడు. వివరాలు.. ఏలూరు చిరంజీవి బస్ షెల్డర్ వద్ద ఉన్న వడ్డెరలకాలనీలో సుబ్బలక్ష్మీ అనే మహిళ ఇంట్లో వారం రోజులుగా ఈ బాలుడు దర్శనమిస్తున్నాడు. బాలుడు అమ్మకం, కిడ్నాప్ అంటూ వచ్చిన పుకార్లతో కాలనీకి చేరుకున్న పోలీసులు, ఛైల్డ్‌ ప్రొటెక్షన్ అధికారులు.. బాలుడి గురించి ఆరాతీశారు. ఈమె బంధువు నాగరాజుకు, విజయవాడ బస్టాండ్‌లో ఓ బాలుడు దొరికాడంటూ తీసుకువచ్చి తమ వద్ద వదిలేశాడని చెబుతున్నారు. బాలుడు తన పేరు కార్తీక్, అమ్మపేరు దుర్గ, తండ్రిపేరు సుభానీ ఊరు గుంటూరు దగ్గర కంకరగుట్ట అని చెబుతున్నాడని అంటున్నారు. బాలుడిని వంగాయగూడెం మథర్ థెరిస్సా హోంకు తరలించామని ఛైల్డ్‌ప్రొటక్షన్ అధికారిణి సీహెచ్ సూర్యచక్రవేణి తెలిపారు. మిగిలిన విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సిఉందని అన్నారు. ఇదిలా ఉంటే బాలుడు వారం రోజులుగా ఇక్కడే ఉంటున్నా దొరికినట్లయితే పోలీసులకో, ఛైల్డ్ వెల్ఫేర్ అధికారులకో సమాచారం ఇవ్వకుండా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు బాలుడిని ఇక్కడ వదిలిన నాగరాజును పట్టుకుని తమదైన శైలిలో విచారిస్తే తప్ప అసలు విషయం బయటకు వచ్చే అవకాశాలు కనబడటం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement