జిన్నారం, న్యూస్‌లైన్ : అతివేగంగా నడుపుతూ ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి అదుపు తప్పి కిందపడిన సంఘటనలో బీటెక్ విద్యార్థిని అక్షితరెడ్డి(18) దుర్మరణం చెందగా మరో విద్యార్థి ప్రణ య్ గాయపడ్డాడు. ఈ సంఘటన బుధవారం మండల పరిధిలోని నల్లవల్లి గ్రామ శివారులో గల నర్సాపూర్-హైదరాబాద్ ప్రధాన రహదారిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాంబాబు, స్థానికుల కథనం మేరకు.. భానూర్ గ్రామానికి చెందిన ప్రణయ్ చెన్నైలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ మూ డో సంవత్సరం చదువుతున్నాడు.
హత్నూర మండలం గుండ్లమాచునూర్ గ్రామానికి చెందిన రాగన్లగారి అక్షితరెడ్డి సంగారెడ్డిలోని ఎంఎన్‌ఆర్ క ళాశాలలో బీటెక్ మొద టి సంవత్సరం చదువుతోంది. వీరిరువురూ స్నేహితులు. ఇదిలా ఉండగా.. ప్రణయ్‌కి సెలవులు కావడం తో స్వగ్రామానికి వచ్చాడు. అనంతరం స్నేహితురాలైన అక్షితరెడ్డితో కలిసి బుధవారం హైదరాబాద్‌లోని మరో స్నేహితురాలిని కలిసేందుకు సంగారెడ్డి నుంచి పల్సర్ బైక్‌పై బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం నల్లవల్లి శివారులోని మూల మలుపు వద్దకు చేరుకుంది. ఆ సమయంలో ప్రణయ్ బైక్‌ను అతివేగంగా నడుపుతుండడంతో ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి అడవిలోకి దూసుకుపోయాడు. ఈ క్రమంలో బైక్‌పై కూర్చున్న అక్షిత ఎగిరి పక్కనే ఉన్న సిమెంట్ పైప్‌లపై పడటంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృ తి చెందింది. ప్రణయ్ తలకు, కాలికి కూడా గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు.. తాము సం ఘటనా స్థలాన్ని చేరుకుని అక్షిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించాం. మృతురాలి తండ్రి వెంకట్‌రెడ్డి ఫిర్యాదు మేరకు ప్రణయ్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని ఎస్‌ఐ రాంబాబు తెలిపారు.
గ్రామంలో విషాదఛాయలు
హత్నూర: బీటెక్ విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో దుర్మరణం కావడంతో మండలం గుండ్లమాచునూర్ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. గ్రామానికి చెందిన రాజన్నగారి వెంకరెడ్డి ఏకైక కుమార్తె అక్షితరెడ్డి. బుధవారం కళాశాలకు వెళ్లిన అక్షిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబీకులతో పాటు గ్రామస్తులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఉన్నత చదువులు చదివి మంచి ప్రయోజకురాలు అవుతుందనుకుంటే ఇలా విగతజీవిలా వచ్చావా తల్లీ అంటూ తల్లిదండ్రుల రోదనలు ఆపడం ఎవరి తరం కాలేదు. విద్యార్థి మృత దేహాన్ని కన్నీటితో అంతిమ సంస్కరణలు చేశారు.
అతివేగమే ప్రాణం తీసింది
Published Thu, Nov 7 2013 12:44 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement