BTEC student
-
రోడ్డు ప్రమాదంలో.. బీటెక్ విద్యార్థి విషాదం!
కరీంనగర్: హైదరాబాద్ శివారు ఘట్కేసర్ వద్ద మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని సంగెం గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి పొతుకూరి హర్షవర్దన్ రెడ్డి దుర్మరణం పాలయ్యాడు. హర్షవర్ధన్‌రెడ్డి(19) హైదరాబాద్‌లో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం కాలేజికి వెళ్లి వచ్చి సాయంత్రం తన స్నేహితుడు, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మనీష్‌తో బైక్‌పై బయటకు వెళ్లారు.తిరిగి వస్తుండగా ఘట్కేసర్ వద్ద బైక్ అదుపు తప్పి డివైడర్‌కు ఢీ కొట్టి ఇద్దరూ కింద పడ్డారు. హర్షవర్దన్‌కు ఛాతి, ముఖానికి తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. స్థానికులు వెంటనే అంబులెన్స్‌లో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే హర్షవర్దన్ రెడ్డి మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మనీష్‌కు కాళ్లకు గాయాలై చికిత్స పొందుతున్నాడు.సంగెంలో విషాదం..సంగెం గ్రామానికి చెందిన పొతుకూరి రవికుమార్ రెడ్డి, స్వప్న దంపతులకు కూతురు మేఘనా, కుమారుడు హర్షవర్దన్ రెడ్డి ఉన్నారు. వ్యవసాయంతోపాటు ఎల్ఐసీ ఏజెంట్‌గా పనిచేస్తున్న రవికుమార్ ఇద్దరు పిల్లలను హైదరాబాద్‌లోని ప్రైవేట్ కళాశాలలో చదివిస్తున్నాడు. వారంక్రితమే బర్త్‌డే చేసుకుని హైదరాబాద్ వెళ్లిన కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంతో తల్లిదండ్రులు బోరున విలపించిన తీరు పలువురిని కలిచి వేసింది. సంగెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
బీటెక్ విద్యార్థులు సరదా కోసం వెళ్లి.. ఒక్కసారిగా అనంతలోకాలకు..
సాక్షి, సంగారెడ్డి: సరదాగా థార్ వాహనం తీసుకొని వెళ్లగా లారీ ఢీకొని ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన సదాశివపేట మండల పరిధిలో సోమవారం వేకువజాము చోటుచేసుకుంది. ఈ ప్రమాదం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఎస్ఐ అసిఫ్ అలీ కథనం ప్రకారం.. చందానగర్ వాసి షేక్ యాహియా అలియాస్ అంఫాల్ (20), బోడపాటి ప్రణీత్ (23), సామెల్, సంధ్యాయల సాయికార్తీక్ కలిసి వాహనంలో అటువైపు నుంచి కంకోల్కు వస్తున్నారు. వీరు ప్రయాణిస్తున్న వెహికల్ మద్దికుంట శివారు ఎంఆర్ఎఫ్ పరిశ్రమ సమీపంలోకి రాగానే ముందున్న లారీ ఎడమ నుంచి ఒక్కసారిగా కుడి వైపునకు దూసుకు వచ్చి ఢీకొంది. కాగా వారి వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యాహియా, ప్రణీత్‌కు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. మిగతా ఇద్దరికి సైతం తీవ్రగాయాలు కాగా హైదరాబాద్‌లో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఇద్దరు మృతులు, సామెల్.. బీబీఏ, సంధ్యాయల సాయి కార్తీక్ బీటెక్ చదువుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తులో ఉంది. ఇవి చదవండి: తాను వేసిన వలే.. కాళ్లకు చిక్కుకొని.. ఆపై మృత్యుపాశమై.. -
ISSF Junior World Cup 2023 : గురి తప్పలేదు!
చిన్నప్పుడు విల్లు ఎక్కుపెట్టింది... లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పుడు పిస్టల్ గురిపెట్టింది... వరుసగా పతకాలు సాధిస్తోంది. ఆ మధ్యలో రైఫిల్‌తో కూడా సాధన చేసింది... మేఘన సాదుల. ‘నాన్న దగ్గర వెపన్ చూస్తూ పెరిగాను మరి’... అంటూ... షూటింగ్ ప్రాక్టీస్... సాధించిన పతకాల గురించి చెప్పింది. హైదరాబాద్‌లో బీటెక్ చేస్తున్న మేఘన సాదుల... అంతర్జాతీయ క్రీడాకారిణి. లక్ష్యానికి గురి పెట్టిందంటే పతకం తోనే వెనుదిరుగుతుంది. గడచిన జూన్‌లో సూల్ (జర్మనీ)లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ షూటింగ్ పోటీల్లో 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ విభాగంలో స్వర్ణం సాధించింది. అంతకంటే ముందు ఢిల్లీలో జరిగిన ఆల్ ఇండియా యూనివర్సిటీ షూటింగ్ చాంపియన్‌షిప్, భోపాల్‌లో జరిగిన నేషనల్ షూటింగ్ చాంపియన్‌షిప్ కాంపిటీషన్స్‌లోనూ పతకాలు సాధించింది, ఖేలో ఇండియా స్కీమ్‌కి కూడా ఎంపికైంది. ఈ నెలలో సౌత్‌కొరియాలో జరిగే పోటీల్లో పాల్గొననుంది. షూటింగ్లో బుల్లెట్లా దూసుకుపోతున్న మేఘన షూటింగ్ విషయాలతోపాటు తన ఇష్టాలు, అభిరుచులను సాక్షితో పంచుకుంది. నాన్నే నాకు ఆదర్శం మా నాన్న సారంగపాణి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నతస్థాయి అధికారి. నాన్నే నా రోల్‌మోడల్. నాకు నాన్న వెపన్ మీద క్రేజ్ ఉండేది. కానీ యూనిఫామ్ సర్వీస్‌లోకి రావాలనే ఆసక్తి పెద్దగా కలగలేదు. బుల్లెట్ ఎలా లోడ్ చేస్తారు, ఎలా ఎయిమ్ చేస్తారనే ఆసక్తి పిల్లలకు సహజంగానే ఉంటుంది. అయితే నాకు సిక్స్త్ క్లాస్‌లో ఆర్చరీ (విలువిద్య) ప్రాక్టీస్ చేసే అవకాశం వచ్చింది. ఖమ్మం ఆర్చరీ అసోసియేషన్‌లో పుట్టా శంకరయ్య నా మెంటార్. టెన్త్‌క్లాస్ వరకు కంటిన్యూ చేశాను. జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నాను. ట్వెల్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు స్కూల్లో ఉన్న షూటింగ్ రేంజ్లో రైఫిల్ ప్రాక్టీస్ చేశాను. కానీ అదంత సీరియస్ ప్రాక్టీస్ కాదు. రోజూ పది నిమిషాలకంటే అవకాశం ఉండేది కాదు. సీరియస్‌గా ప్రాక్టీస్ మీద దృష్టి పెట్టింది మాత్రం కరోనా టైమ్‌లోనే. కలా... నిజమా! కరోనా టైమ్‌లో క్లాసులు ఆన్లైన్లో జరిగేవి. ఖాళీ సమయం ఎక్కువగా ఉండేది. అప్పుడు మా కోచ్ ప్రసన్న కుమార్ సూచనతో 25 మీటర్ల పిస్టల్ షూటింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టాను. నేను పూర్తిస్థాయిలో పిస్టల్ షూటింగ్ ప్రారంభించిన నాటికి మూడు వారాల్లో రాష్ట్రస్థాయి పోటీలున్నాయి. ఆ పోటీల్లో పాల్గొనడం, గోల్డ్ మెడల్ తెచ్చుకోవడం అంతా కలలా జరిగిపోయింది. అదే ఏడాది రాష్ట్ర స్థాయి పోటీల్లో నాలుగు పతకాలు రావడంతో నా మీద నాకు నమ్మకం కలిగింది, ఆత్మవిశ్వాసం పెరిగింది. జాతీయస్థాయిలో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించాను. ఉస్మానియా తరఫున ఆల్ ఇండియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాను. మనదేశం తరఫున ఆడటం గర్వంగా ఉంది. సాంత్వన అమ్మ ఫోన్‌తోనే! ఖేలో ఇండియా క్యాంప్‌లో మాకు సౌకర్యాలు చాలా బాగుంటాయి. నిపుణులు సూచించిన ఆహారం, ప్రాక్టీస్‌కు అనువైన వాతావరణం ఉంటుంది. నేను ఏమాత్రం షూటింగ్లో సరిగ్గా రాణించనట్లు అనిపించినా, మొదట చేసే పని అమ్మకు ఫోన్ చేయడమే. అమ్మ ఇచ్చే కౌన్సెలింగ్ నన్ను తిరిగి నా లక్ష్యం మీద దృష్టి పెట్టేలా ప్రోత్సహిస్తుంది. నా ప్రతి మూమెంట్లో మా అమ్మానాన్న, అన్నయ్య ఉంటారు. అన్నయ్య స్పెయిన్‌లో చదువుకుంటున్నాడు. పోటీల్లో పాల్గొనడం ఒకవైపు... ఇంజినీరింగ్‌లో క్లాసులు మరోవైపు... ఈ రెండింటినీ బాలెన్స్ చేయడం కష్టమవుతోంది. అందుకే బీటెక్‌లో ఓ ఏడాది విరామం తీసుకుని ప్రాక్టీస్ మీదనే దృష్టి పెట్టాను. షూటింగ్ లో అత్యున్నత స్థాయికి చేరాలనేది నా ఆకాంక్ష. ఆ తర్వాత బీటెక్ మైనింగ్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసి, సివిల్ లేదా మైనింగ్ ఫీల్డ్‌లో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలనేది నా ఆశయం. ఇప్పటికైతే ఇదే, ఆ తర్వాత అభిప్రాయం మారవచ్చేమో’’ అని నవ్వేసింది మేఘన. సంగీతంతో స్నేహం ఇంట్లోనే షూటింగ్ రేంజ్ ఉంది. రోజూ ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రాక్టీస్ చేస్తాను. మధ్యాహ్న భోజనం తర్వాత రెండు–మూడు గంటల విరామం. సాయంత్రం ఫిట్నెస్ ప్రాక్టీస్ ఉంటుంది. ఏకాగ్రత సాధన కోసం మెడిటేషన్ చేస్తాను. ఉదయం షూటింగ్ తగ్గినప్పుడు సాయంత్రం ఓ గంట– రెండు గంటలు ప్రాక్టీస్ చేస్తాను. ప్రాక్టీస్‌లో బాగా రాణించినప్పటికీ ఒక్కోసారి పోటీల్లో రాణించలేకపోవచ్చు. నాకూ కొన్ని అనుభవాలున్నాయి. అందుకు నాకు నేనుగా ఆలోచించుకుని ఒక రొటీన్‌ని డిజైన్ చేసుకున్నాను. ఇంట్లో ఎలాగైతే షూటింగ్ తర్వాత మ్యూజిక్ వింటూ రిలాక్స్ అవుతానో, కాంపిటీషన్లకు వెళ్లినప్పుడు కూడా అదే రొటీన్‌ని కొనసాగించాలనుకున్నాను. ఈ గేమ్‌లో లక్ష్యాన్ని ఛేదించడానికి మెదడును చాలా కండిషన్ చేసుకుంటాం. మైండ్ అదే కండిషన్లో కొనసాగకూడదు, తప్పనిసరిగా రిలాక్స్ కావాలి. అలా నాకు మ్యూజిక్ ఒత్తిడిని తగ్గించే బెస్ట్ ఫ్రెండ్. సినిమాలు బాగా చూస్తాను. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : మోహనాచారి -
రమ్య సోదరికి ఉద్యోగం.. ఇంటి స్థలం, ఐదెకరాల పంట భూమి
-
దీపావళికి పండగకు ఇంటికొచ్చేస్తానమ్మా..
నాయుడుపేటటౌన్: దీపావళి సెలవులకు ఇంటికి వచ్చేస్తున్నానమ్మా అని చెప్పిన కుమారుడు నిర్జీవంగా అతని మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడంతో ఆ తల్లి పడిన వేదన అంతా ఇంతా కాదు. చెన్నై మెరీనా బీచ్‌లో విహారానికి వెళ్లి మృత్యువాత పడ్డ బీటెక్ విద్యార్థి గిండి శ్రావణ్‌కుమార్(18) మృతదేహాన్ని సోమవారం మధ్యాహ్నం నాయుడుపేటలోని నివా సానికి తీసుకువచ్చారు. దీంతో ఇంటి వద్ద కుటుంబసభ్యులతోపాటు బంధువులు, స్నేహితుల రోదనలు మిన్నంటాయి. తమ్ముడు మృతిచెందినట్లు తెలుసుకున్న అమెరికాలో ఎంబీబీఎస్ చదువుతున్న గిండి సాయికుమార్ హుటాహుటాన బయలుదేరి నాయుడుపేటకు సోమవారం రాత్రి చేరుకుంటున్నట్లు అతని స్నేహితులు తెలిపారు. కళాశాల నిర్వాహకుల తీరుపై కుటుంబ సభ్యుల ఆవేదన చెన్నైలోని జయ ఇంజినీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం బీటెక్ చదువుతున్న శ్రావణ్‌కుమార్ ఆదివారం కళాశాలలోని హాస్టల్ నుంచి దీపావళి టపాసులు కొనుగోలు చేసేందుకు వెళుతున్నామని చెప్పి ఐదు మంది విద్యార్థులతో కలిసి బయటకు వచ్చాడు. అనంతరం బీచ్‌లో సరదాగా గడిపేందుకు వెళ్లారు. అక్కడ పెద్ద ఎత్తున వచ్చిన అలల తాకిడికి శ్రావణ్‌కుమార్ ఊపిరాడక మృతిచెందాడు. శ్రావణ్‌కుమార్ మృతిపై కనీసం కుటుంబసభ్యులకు కళాశాల యాజమాన్యం ప్రతినిధులు సమాచారం ఇవ్వకపోవడంపై కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రావణ్‌కుమార్ స్నేహితుడు సమాచారం ఇవ్వడంతోనే తెలుసుకోగలిగామని వాపోయారు. -
అతివేగమే ప్రాణం తీసింది
జిన్నారం, న్యూస్‌లైన్ : అతివేగంగా నడుపుతూ ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి అదుపు తప్పి కిందపడిన సంఘటనలో బీటెక్ విద్యార్థిని అక్షితరెడ్డి(18) దుర్మరణం చెందగా మరో విద్యార్థి ప్రణ య్ గాయపడ్డాడు. ఈ సంఘటన బుధవారం మండల పరిధిలోని నల్లవల్లి గ్రామ శివారులో గల నర్సాపూర్-హైదరాబాద్ ప్రధాన రహదారిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రాంబాబు, స్థానికుల కథనం మేరకు.. భానూర్ గ్రామానికి చెందిన ప్రణయ్ చెన్నైలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ మూ డో సంవత్సరం చదువుతున్నాడు. హత్నూర మండలం గుండ్లమాచునూర్ గ్రామానికి చెందిన రాగన్లగారి అక్షితరెడ్డి సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్ క ళాశాలలో బీటెక్ మొద టి సంవత్సరం చదువుతోంది. వీరిరువురూ స్నేహితులు. ఇదిలా ఉండగా.. ప్రణయ్‌కి సెలవులు కావడం తో స్వగ్రామానికి వచ్చాడు. అనంతరం స్నేహితురాలైన అక్షితరెడ్డితో కలిసి బుధవారం హైదరాబాద్‌లోని మరో స్నేహితురాలిని కలిసేందుకు సంగారెడ్డి నుంచి పల్సర్ బైక్‌పై బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం నల్లవల్లి శివారులోని మూల మలుపు వద్దకు చేరుకుంది. ఆ సమయంలో ప్రణయ్ బైక్‌ను అతివేగంగా నడుపుతుండడంతో ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి అడవిలోకి దూసుకుపోయాడు. ఈ క్రమంలో బైక్‌పై కూర్చున్న అక్షిత ఎగిరి పక్కనే ఉన్న సిమెంట్ పైప్‌లపై పడటంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృ తి చెందింది. ప్రణయ్ తలకు, కాలికి కూడా గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు.. తాము సం ఘటనా స్థలాన్ని చేరుకుని అక్షిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించాం. మృతురాలి తండ్రి వెంకట్‌రెడ్డి ఫిర్యాదు మేరకు ప్రణయ్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని ఎస్ఐ రాంబాబు తెలిపారు. గ్రామంలో విషాదఛాయలు హత్నూర: బీటెక్ విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో దుర్మరణం కావడంతో మండలం గుండ్లమాచునూర్ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. గ్రామానికి చెందిన రాజన్నగారి వెంకరెడ్డి ఏకైక కుమార్తె అక్షితరెడ్డి. బుధవారం కళాశాలకు వెళ్లిన అక్షిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబీకులతో పాటు గ్రామస్తులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఉన్నత చదువులు చదివి మంచి ప్రయోజకురాలు అవుతుందనుకుంటే ఇలా విగతజీవిలా వచ్చావా తల్లీ అంటూ తల్లిదండ్రుల రోదనలు ఆపడం ఎవరి తరం కాలేదు. విద్యార్థి మృత దేహాన్ని కన్నీటితో అంతిమ సంస్కరణలు చేశారు.