సాక్షి, అమరావతి: దిశ చట్టంలో లోపలు ఉన్నాయని టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు శాసనసభలో చేసిన వ్యాఖ్యలపై ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టం ఇంకా అమల్లోకి రాకముందే లోపాలున్నాయని ఆరోపించడం తగదని అన్నారు. సీనియర్ సభ్యులు కూడా మొదటిసారి ఎన్నికైన సభ్యుడిలా మాట్లాడం సరికాదన్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్పటంపై బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం మీద బురద చల్లాలని తప్ప వేరే ఏమైనా అర్థం ఉందా అని బుగ్గన నిలదీశారు. దిశ చట్టం ఇంకా అమల్లోకి రాలేదన్నారు. ఇవాళ చట్టం తయారు చేశాక మరుసటి రోజు పొద్దున్నే అమల్లోకి వస్తుందా అని బుగ్గన ప్రశ్నించారు.
ఈ అంశంలో స్పీకర్ తమ్మినేని సీతారం జోక్యం చేసుకుంటూ గతంలో కానీ ఇప్పుడు కానీ ప్రభుత్వాలు మంచి చట్టాలు ప్రజల కోసం తయారు చేస్తుందని అన్నారు. జరుగుతున్న సంఘటనలు అన్నీ చట్టాలు లేకుండా జరుగుతున్నాయా అని స్పీకర్ నిలదీశారు. దిశ చట్టం నిన్నగాక మొన్న చట్టం అయింది..ఎందుకు గాబరా పడుతున్నారని ప్రతిపక్షాలను స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. ప్రభుత్వాలు మంచి ఉద్దేశంతోనే చట్టాలు తయారు చేస్తాయన్నారు. అవి ప్రజలకు చేరువ కావాలన్నారు. ప్రతిపక్షాల సూచనలను హోంమంత్రి నోట్ చేసుకుని వాటిని పరిగణలోకి తీసుకోవాలని స్పీకర్ తమ్మినేని సీతారాం సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment