ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం.
Published Wed, Aug 28 2013 3:26 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM
మంచిర్యాల టౌన్ న్యూన్‌లైన్ : హైదరాబాద్ హమారా, పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని సోమవారం ఓయూలో నిర్వహించి న శాంతి ర్యాలీపై పోలీసుల నిర్బం ధాన్ని నిరసిస్తూ టీఆర్‌ఎస్వీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం స్థానిక ఐబీ చౌరస్తాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం తూర్పు జిల్లా అధ్యక్షుడు సోహెల్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్వీ నాయకుల అరెస్టును తీవ్రం గా ఖండించారు.
సీమాంధ్రలో ఆందోళనకారులపై కేసులు నమోదు చేయకుం డా డీజీపీ పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారని, తెలంగాణవాదులపై పదుల సంఖ్యలో కేసులు పెడుతున్నారని తెలి పారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే వరకూ ఉద్యమం కొనసాగిస్తామని అన్నారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని కేంద్ర ప్రభుత్వం బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సురేందర్, ఉపాధ్యక్షుడు కిరణ్, నాయకులు శ్రీని వాస్, కృష్ణకాంత్‌గౌడ్, సాగర్‌యాదవ్, పవన్, శేఖర్, కళ్యాణ్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement