
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, విజయవాడ : ట్రాయ్ అసంబద్ధ విధానాలు ఆపరేటర్ల ఉనికే ప్రశ్నర్థకం చేసేలా ఉన్నాయని, తమ ఆవేదనను ప్రభుత్వానికి తెలపాలనే నిరసన దీక్ష చేపట్టినట్లు కేబుల్ ఆపరేటర్లు, మల్టీ సర్వీసెస్ సంఘం తెలుగు రాష్ట్రాల కన్వీనర్ సురేష్ తెలిపారు. బుధవారం కేబుల్ రంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. ధర్నాచౌక్‌లో చేపట్టిన నిరసన దీక్షలో 13 జిల్లాల కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల కేబుల్ ఆపరేటర్లు ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పే ఛానల్ యాజమాన్యంపై అవలంభిస్తున్న వైఖరి దారుణమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment