నీటి సంఘాలపై ‘పచ్చ’ముద్ర | Cancel election management in a simple manner | Sakshi
Sakshi News home page

నీటి సంఘాలపై ‘పచ్చ’ముద్ర

Published Fri, Jun 2 2017 1:24 AM | Last Updated on Sat, Jul 28 2018 3:39 PM

Cancel election management in a simple manner

- సాధారణ పద్ధతిలో ఎన్నికల నిర్వహణ రద్దు
- రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయం
 
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సాగునీటి సంఘాలను తమ చెప్పుచేతల్లో ఉంచుకునేందుకు ప్రభుత్వం చట్టాన్నే మార్చే యాలని నిర్ణయించింది. నీటి సంఘాల పాలకవర్గాల కు సాధారణ పద్ధతిలో నిర్వహించే ఎన్ని కలను రద్దు చేసింది. ఇకపై తమ పార్టీకి చెందినవారే అధ్యక్షులు, సభ్యులుగా ఉండేం దుకు వీలుగా చేతులెత్తే విధానానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ఫార్మర్స్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ ఇరిగేషన్‌ సిస్టమ్స్‌ చట్టం–1997 (ఏపీఎఫ్‌ఎంఐఎస్‌)లో మార్పులు చేయాలని నిర్ణయించింది. వెలగపూడి సచివాలయంలో సీఎం అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఈ మార్పులకు ఆమోదం తెలిపింది.

ఆ వివరాలను చంద్రబాబు  మీడియాకు వివరించారు. ► ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న టీచింగ్‌ మెడికల్‌ ఫ్యాకల్టీ పదవీ విరమణ వయసును 60 నుంచి 63 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం.   నవ నిర్మాణ దీక్ష సందర్భంగా 13 లక్షల 21 వేల మంది రైతులకు రూ.1680.2 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చేందుకు అనుమతి. ఈ నెల 4వ తేదీన రైతులందరికీ ఈ సొమ్ము వారి అకౌంట్లలో జమ చేయాలని నిర్ణయం. కనీసం రూ.15 వేలు రైతులకు ఇవ్వాలని, అందులో బీమా కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖకు ఆదేశం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement