
గాయపడిన వారిని విచారిస్తున్న పోలీసులు, ప్రమాదానికి గురైన కారు (అంతర్ చిత్రం )
ఔటర్ రింగ్‌రోడ్డుపై శంషాబాద్ హుడాకాలనీ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం ఓ కారు పల్టీలు కొట్టింది. ఈ సంఘటనలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులకు తీవ్రగాయాలు కాగా నలుగురికి స్వల్పగాయూలయ్యూరుు. పటాన్‌చెరు రుద్రారం సమీపంలో ఉన్న ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఆరుగురు విద్యార్థులు కారులో బొంగుళూరు గేటు వద్ద ఓఆర్‌ఆర్‌పైకి ఎక్కి గచ్చిబౌలివైపు ప్రయాణిస్తున్నారు. శంషాబాద్ వద్దకు రాగానే వీరి కారు వేగంగా వెళ్లి డివైడర్‌ను ఢీకొని రెండు పల్టీలు కొట్టింది.
ఈ ప్రవూదంలో కారులో ఉన్న నమ్రత, చైతన్యలకు తీవ్రగాయాలు కాగా, ధనుశ్రీ, సాయిదీపిక, నిఖిల్, చంద్రకిరణ్‌లకు స్వల్పగాయాలయ్యూరుు. కాగా, టైర్ పేలడంతోనే కారు పల్టీ కొట్టిందని విద్యార్థులు చెబుతున్నారు. ఘటన జరిగిన సమయంలో చంద్రకిరణ్ కారు డ్రైవింగ్ చేస్తున్నాడు.
బెంగుళూరు వద్ద ఔటర్‌పైకి చేరుకున్న వీరు ఎక్కడికి వెళ్లి తిరిగి వస్తున్నారనేదానిపై పొంతనలేని సమాచారం ఇస్తున్నారు. చిలుకూరు బాలాజీ గుడికి అని ఒకసారి, బెంగుళూరు సమీపంలో ఆలయానికి వెళ్లి వస్తున్నామని మరోసారి విద్యార్థులు చెప్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పేలిన కారు టైర్...
సురక్షితంగా బయటపడ్డ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు
బంజారాహిల్స్ : సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను తీసుకొని వెళ్తున్న కారు వెనుక టైర్ పేలిపోవడంతో ప్రమా దం జరిగింది. అదృష్టవశాత్తు కారులో ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లందరూ సురక్షితంగా బయట పడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం ఉదయం పది గంటలకు మాదాపూర్‌లోని విప్రో సాఫ్ట్‌వేర్ సంస్థకు చెందిన 8 మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను గణేష్ అనే డ్రైవర్ వింగర్ కారులో తీసుకొని బంజారాహిల్స్ రోడ్డునెం.12 నుంచి వేగంగా వెళ్తుండగా కేబీఆర్ పార్కు పక్కన వెనుక టైర్ పేలిపోయింది.
కారు అదుపుతప్పి ఫుట్‌పాత్‌ను ఢీకొని ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో వెనుక వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. వింగర్ కారు పక్క నుంచి వెళ్తున్న స్కూటరిస్ట్‌కు తీవ్రగాయాలు కావడంతో వెంటనే కేర్ ఆసుపత్రికి తరలించారు. వింగర్‌లో ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఎలాంటి గాయాలు కాలేదు. కారు డ్రైవర్ గణేష్‌ను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.