హరీశ్‌రావుపై కేసు నమోదు | case against harish rao complaint lodged in Rayadurgam police station | Sakshi
Sakshi News home page

హరీశ్‌రావుపై కేసు నమోదు

Published Sat, Jan 11 2014 4:41 AM | Last Updated on Tue, Mar 19 2019 9:03 PM

case against harish rao complaint lodged in Rayadurgam police station

హైదరాబాద్, న్యూస్‌లైన్: కానిస్టేబుల్‌ను దూషించిన కేసుకు సంబంధించి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావుపై శుక్రవారమిక్కడ రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నెల 8వ తేదీన రాయదుర్గంలో గేమింగ్ యానిమేషన్ పార్క్‌కు సీఎం శంకుస్థాపన కార్యక్రమాన్ని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. పోలీసులు వారిని అరెస్టు చేసి నార్సింగి పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తుండగా వాహనం ఎక్కించే  సమయంలో తోపులాట జరిగింది. విధి నిర్వహణలో ఉన్న ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఎన్.రమేష్‌ను టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు దుర్భాషలాడినట్లు కేసు నమోదైంది. కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 353 కింద కేసు నమోదు చేశామని సీఐ బాలకోటి విలేకరులకు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement