కానిస్టేబుల్ చెంప చెళ్లుమనిపించిన ఎంపీ | MP bibi patil slaps conistable | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్ చెంప చెళ్లుమనిపించిన ఎంపీ

Published Sat, Apr 9 2016 11:34 PM | Last Updated on Tue, Mar 19 2019 9:03 PM

MP bibi patil slaps conistable

ఎల్లారెడ్డి: నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డిలో మంత్రి హరీశ్‌రావు పర్యటన సందర్భంగా జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అనుచిత ప్రవర్తన అందరినీ విస్మయానికి గురిచేసింది. శనివారం ఉదయం గిడ్డంగి ప్రారంభోత్సవ సమయంలో మంత్రి హరీశ్‌రావును కలిసేందుకు కార్యకర్తలు తోసుకురావడంతో చిన్న తోపులాట జరిగింది. ఇందులో భాగంగా సొసైటీ చైర్మన్ సాయిలు అనుకోకుండా ఎంపీ పాటిల్‌పైకి వచ్చారు. దీంతో ఆగ్రహించిన ఎంపీ పాటిల్, సాయిలును మూడుసార్లు తోసివేశారు.

అదేవిధంగా ఫంక్షన్‌హాల్‌లో మధ్యాహ్నం భోజనానికి వెళ్తున్న సమయంలో తనను అడ్డగించాడంటూ గాంధారి పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఓ కానిస్టేబుల్ చెంపను ఎంపీ చెళ్లుమనిపించారు. దీంతో బిత్తర పోయిన కానిస్టేబుల్ ఈ విషయాన్ని పై అధికారులకు తెలియజేయగా వారు అతడిని బుజ్జగించినట్లు సమాచారం. కానిస్టేబుల్ పట్ల ఎంపీ దురుసుగా ప్రవర్తించిన విషయం తెలియగానే మంత్రి హరీశ్‌రావు భోజనం కూడా చేయకుండానే డైనింగ్‌హాల్ నుంచి నిష్ర్కమించినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement