వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ నిబంధనలు సడలిస్తూ సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పుపై జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు మిన్నంటాయి.
ఒంగోలు, న్యూస్‌లైన్: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ నిబంధనలు సడలిస్తూ సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పుపై జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు మిన్నంటాయి. పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఆ పార్టీ నేతలు స్వీట్లు పంచుకుని ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. జగన్ రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా పర్యటించేందుకు, ఢిల్లీ వెళ్లేందుకు నిబంధనలు సడలించడంపై హర్షం వెలిబుచ్చారు. ఇటీవల భారీ వర్షాలకు నష్టపోయిన ప్రాంతాల్లో పరిశీలించేందుకు, రాష్ట్ర వ్యాప్తంగా సమైక్యాంధ్ర ఉద్యమానికి ఊపు తెచ్చేందుకు ఇది దోహదపడుతుందని పార్టీ నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్ అన్నారు.
అనంతరం మహబూబ్‌నగర్ వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో జిల్లా అధికారప్రతినిధులు కఠారి రామచంద్రరావు, నరాల రమణారెడ్డి, వివిధ విభాగాల కన్వీనర్లు కేవీ ప్రసాద్, కఠారి శంకర్, వేమూరి సూర్యనారాయణ, కంచర్ల సుధాకర్, బొగ్గుల శ్రీనివాసరెడ్డి, నగర అధికారప్రతినిధి రొండా అంజిరెడ్డి, వివిధ విభాగాల నగర కన్వీనర్లు నెరుసుల రాము, ముదివర్తి బాబూరావు, బొప్పరాజు కొండలు, యరజర్ల రమేష్, కావూరి సుశీల, వైఎస్సార్‌సీపీ నాయకులు డీఎస్ క్రాంతికుమార్, దుగ్గిరెడ్డి ఆంజనేయరెడ్డి, వల్లెపు మురళి, రాజేశ్వరి, ఇందిర, రమాదేవి, ప్రమీల, విజయలక్ష్మి, రాధ తదితరులు పాల్గొన్నారు.