Kuppam Prasad
-
ఆర్య వైశ్యులకు టీడీపీ చేసిందేమీ లేదు: మంత్రులు
సాక్షి, విజయవాడ: రాష్ట్ర ఆర్య వైశ్య వేల్ఫేర్, డవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా కుప్పం ప్రసాద్ ప్రమాణం చేశారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో కుప్పం ప్రసాద్‌తో మంత్రులు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్, శంకర్ నారాయణ, వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రులు ప్రసంగించారు. వైశ్యులకు గత ప్రభుత్వం చేసిందేమీ లేదు.. గత టీడీపీ ప్రభుత్వం ఆర్య వైశ్యులకు చేసిందేమీ లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. రాష్ట్రంలో 10 శాతం జనాభా ఆర్యవైశ్యులు ఉన్నారని.. వేల కోట్లతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలపరుస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశ్వసనీయత, నిబద్ధతకు నిదర్శనం అయితే.. చంద్రబాబు మోసం, దోపిడీకి నిదర్శనమని పేర్కొన్నారు. చంద్రబాబు.. ఎన్నికలకు ఐదు నెలల ముందు కార్పొరేషన్ ఏర్పాటు చేసి తూతూ మంత్రంగా నిధులు కేటాయించారని విమర్శించారు. గత టీడీపీ ప్రభుత్వం కుల రాజకీయాలకు చేసిందని ధ్వజమెత్తారు. కుల, మత, పార్టీలకతీతంగా సీఎం జగన్ సంక్షేమ పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేద వైశ్యులకు కార్పొరేషన్ అండగా నిలవాలని కోరారు. ఆర్య వైశ్యులకు అండగా నిలవాలి.. ఆర్థికంగా వెనుకబడిన వైశ్యులకు అండగా ఉండాలని మంత్రి బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన కుప్పం ప్రసాద్‌కు ఆయన అభినందనలు తెలిపారు. ప్రాంతాలకు అతీతంగా పనిచేసి.. పేదలకు చేయూత నివ్వాలని ఈ సందర్భంగా కోరారు. ప్రభుత్వానికి, వైశ్యులకు సంధాన కర్తగా ప్రసాద్ పనిచేయాలన్నారు. సీఎం వైఎస్ జగన్ తనపై ఉంచిన బాధ్యతను నెరవేర్చాలన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.. వైశ్యులకు ఇచ్చిన మాటను సీఎం వైఎస్ జగన్ నిలబెట్టుకున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవం జరపకుండా పొట్టి శ్రీరాములు త్యాగాన్ని అవమానించారని ధ్వజమెత్తారు. నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరిపి సీఎం జగన్ గౌరవించారని పేర్కొన్నారు. ఆయనకు వైశ్యులంతా అండగా ఉండాలని కోరారు. వైశ్యుల ఆరాధ్య దైవం పెనుగొండ వాసవిమాత ఆలయ అభివృద్ధి సీఎం వైఎస్ జగన్ కోటిన్నర నిధులు మంజూరు చేశారని వెల్లడించారు. ఆర్య వైశ్యులకు ఆర్థిక ప్రోత్సాహం ఇచ్చేందుకే కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రంలో పేదలైన ఆర్యవైశ్యులకు కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సాయం అందజేస్తామని వెల్లడించారు. ఆ ఆరోపణలు అవాస్తవం.. ఆర్య వైశ్యుల్లో అధిక శాతం పేదలున్నారని.. కార్పొరేషన్ ద్వారా వారికి ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రోశయ్య సీఎం గా ఉన్నప్పుడు ఆయనను వైఎస్ జగన్ చిన్నచూపు చూశారనే ఆరోపణలు అవాస్తమన్నారు. రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు జగన్ గౌరవించారని పేర్కొన్నారు. వైఎస్ జగన్ తన పోరాటం సోనియాగాంధీపై చేశారే తప్ప రోశయ్యపై కాదని వివరించారు. రోశయ్యను జగన్ ఎన్నడూ ఒక మాట కూడా అనలేదని.. రోశయ్య సీఎం గా ఉన్నంత కాలం జగన్ కాంగ్రెస్‌లోనే ఉన్నారని పేర్కొన్నారు. కిరణ్‌కుమార్ రెడ్డి సీఎం అయిన తర్వాతే జగన్ వైఎస్సార్సీపీ పార్టీని స్థాపించారని తెలిపారు. కార్పొరేషన్‌కు సీఎం జగన్ వచ్చే బడ్జెట్లో తగిన నిధులను కేటాయిస్తారని వెల్లడించారు. రాష్ట్రంలో ఆర్య వైశ్యులందరికీ కార్పొరేషన్ ద్వారా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వైశ్యులంతా వైఎస్సార్సీపీ వెంటే.. ఆర్య వైశ్య సమాజం అంతా వైఎస్సార్సీపీ వెంట నడుస్తోందని మంత్రి శంకర్ నారాయణ అన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాలనా కృషి ఫలితంగానే ఆర్య వైశ్యులంతా వైఎస్సార్సీపీకి అండగా నిలిచారని పేర్కొన్నారు. పేద వైశ్యులకు కార్పొరేషన్ ద్వారా ఆర్థికంగా పరిపుష్టి కల్పించాలని కోరారు. బీసీ సంక్షేమ శాఖ నుంచి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. చంద్రబాబు మోసం చేశారు.. వైశ్యులంటే సేవ, నిజాయితీకి నిదర్శనమని మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు అన్నారు. గత టీడీపీ పాలనలో అనేక కులాలకు కార్పొరేషన్లు ఇస్తామని చంద్రబాబు మోసం చేశారని దుయ్యబట్టారు. అడిగితే వరాలు ఇచ్చేది దేవుడయితే... పేదల కళ్లలో కష్టాలు చూసి వరాలు ఇచ్చే దేవుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని పేర్కొన్నారు. గాంధీజీ, పొట్టి శ్రీరాములు ఆశయ సాధనలో పాలన సాగిస్తున్న వైఎస్ జగన్‌కు అందరూ అండగా నిలవాలని కోరారు. -
వైశ్యులందరూ మోసానికి గురైయ్యారు
సాక్షి, కడప: రాష్ట్రంలో ఉన్న వైశ్యులందరినీ సీఎం చంద్రబాబునాయుడు మోసం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ అన్నారు. నంద్యాల ఉప ఎన్నికలప్పుడు ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ వైశ్యులకు కార్పొరేషన్‌ను ఎర్పాటు చేస్తానని ప్రకటించినప్పుడు ఓట్ల కోసం చంద్రబాబునాయుడు వైశ్యులకు ఎన్నో హామీలను ఇచ్చారని కానీ ఎన్నికలు పూర్తియ్యాక వాటిని మర్చిపోయారని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న వైశ్యులందరిని ఎన్ని రకాలుగా మోసం చేయాలో అన్ని రకాలుగా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రన్న మాల్స్ పేరుతో చిన్న వ్యాపారుల పొట్టకొడుతున్నారని మండిపడ్డారు. దివంగతనేత వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమే వైశ్యులకు మేలు చేశారని అన్నారు. దివంగత నేత హాయాంలోనే నెల్లూరు జిల్లాకు అమరజీవి పొట్టిశ్రీరాములు పేరు పెట్టారని గుర్తు చేశారు. వైశ్యులకు మంచి జరగాలంటే వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి రావాలని కుప్పం ప్రసాద్ ఆకాంక్షించారు. -
వైఎస్సార్ సీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా కుప్పం ప్రసాద్
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా ప్రకాశం జిల్లాకు చెందిన కుప్పం ప్రసాద్ నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు కేంద్ర కార్యాలయం నుంచి బుధవారం రాత్రి విడుదలైన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన వాసవీ సేవాదళ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కూడా సమర్థంగా గతంలో సేవలందించారు. రాష్ట్రంలోని వాణిజ్య వర్గాల్లో పార్టీ పటిష్టతకోసం కృషి చేస్తానని, 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపే ఏకైక లక్ష్యంగా పాటుపడతానని ఆయన పేర్కొన్నారు. -
ఉద్యమాన్ని ఏ శక్తీ ఆపలేదు!
-
త్యాగమూర్తుల ఆశయాలను కొనసాగిద్దాం
వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దిన వేడుకలు ఒంగోలు అర్బన్: వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ జెండా ఆవిష్కరించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ఎందరో త్యాగమూర్తులు తమ ప్రాణాలిచ్చి స్వాతంత్య్రాన్ని తెచ్చిపెట్టారని, వీరి ఆశయాలతో ముందుకుపోదామని అన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు రాజధాని విషయంలో కూడా స్వార్థంతో వ్యవహరిస్తున్నారు. నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ మాట్లాడుతూ త్యాగమూర్తుల ప్రాణత్యాగానికి అర్థం లేకుండా నేటి రాజకీయ నాయకులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ బీసీ సెల్ జిల్లా కన్వీనర్ కఠారి శంకర్, జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ వేమూరి సూర్యనారాయణ, మహిళా నాయకులు బడుగు ఇందిరా, గంగాడ సుజాత, స్టీరింగ్ కమిటీ సభ్యులు తోటపల్లి సోమశేఖర్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్లో... నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ విజయకుమార్ హాజరై జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజినీరు శ్రీనివాస్, రెవెన్యూ అధికారి పందిళ్ళకుమారి, మేనేజర్ శ్రీహరి, కార్యక్రమ సూపర్వైజర్ మోహనరావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ కార్యాలయంలో సెమీక్రిస్మస్ వేడుకలు
ఒంగోలు అర్బన్ : ప్రజలు ప్రేమతో ప్రార్థించే దేవుడు ఏసుక్రీస్తు..ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి అని వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం సెమీక్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుప్పం ప్రసాద్ మాట్లాడుతూ క్రీస్తు ప్రజల కోసం జన్మించి వారికి మేలు చేశారన్నారు. పాస్టర్ శామ్యూల్ సెమీక్రిస్మస్ ప్రార్థనలు చేశారు. సెమీ క్రిస్మస్ కేక్‌ను కట్ చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులకు పంచారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ వేమూరి సూర్యనారాయణ, నాయకులు గంగాడ సుజాత, శింగరాజు వెంకట్రావు, బడుగు ఇందిర, దుగ్గిరెడ్డి అంజిరెడ్డి, జాజుల కృష్ణ, పి.కొండలు, పి.జేమ్స్, శామ్యూల్, అంజిరెడ్డి పాల్గొన్నారు. పోలీస్ క్వార్టర్స్‌లో -విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేసిన ఎస్పీ శ్రీకాంత్ ఒంగోలు క్రైం: ఒంగోలులోని పోలీస్ క్వార్టర్స్‌లో సోమవారం రాత్రి సెమీక్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ క్రిస్మస్ కేక్‌ను చిన్నారుల చేత కట్ చేయించారు. అనంతరం ఎస్పీ శ్రీకాంత్ మాట్లాడుతూ క్రీస్తు బోధనలు ప్రతిఒక్కరూ అనుసరిస్తే సమాజంలో అంతా మంచే జరుగుతుందని అన్నారు. ప్రజలకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మదర్ థెరిస్సా అంధుల పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అంధ విద్యార్థి ఎస్కే సుల్తాన్‌బీ పాడిన పాట అందరినీ ఆకట్టుకుంది. వేడుకల్లో అదనపు ఎస్పీ బి.రామానాయక్, ఏఆర్ డీఎస్పీ జల్దారెడ్డి, రిజర్వు ఇన్స్పెక్టర్లు చంద్రమోహన్, మురళీ, పాస్టర్లు ఎస్కే సుదర్శనరావు, ఎం.ప్రసాద్‌బాబుతో పాటు పోలీస్ క్వార్టర్స్ కమిటీ సభ్యులు, పోలీస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
అమరజీవి త్యాగం మరువలేనిది
వెఎస్ఆర్ సీపీ నగర పార్టీ అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్: అమరజీవి పొట్టిశ్రీరాములు త్యాగం మరువలేనిదని వైఎస్ఆర్ సీపీ నగర పార్టీ అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ అన్నారు. అమరజీవి పొట్టిశ్రీరాములు జయంతిని పురస్కరించుకుని వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కుప్పం ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత స్థానిక తాతా బిల్డింగ్స్ సమీపంలోని పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం క్లబ్ కార్యదర్శి పవన్‌కుమార్‌తో కలిసి మాతా శిశు వైద్యశాలలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి దేసు వెంకటసుబ్బారావు, వేములు శ్రీమనారాయణ తదితరులు పాల్గొన్నారు. బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ ఆధ్వర్యంలో.. పొట్టిశ్రీరాములు జయంతిని పురస్కరించుకుని బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కాంప్లెక్స్‌లోని పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు తాతా వెంకట చెంచయ్య గుప్తా, కార్యదర్శి ఇస్కాల వేణుగోపాల్, మాజీ కార్యదర్శి కూరపాటి సత్యనారాయణ, క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తూను గుంట రామమోహనరావు తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో.. జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పొట్టిశ్రీరాములుజయంతి వేడుకలను స్థానిక వైశ్యాభవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు పెరుమాళ్ల కాశీరావు మాట్లాడుతూ అమరజీవి త్యాగాన్ని కొనియాడారు. కార్యక్రమంలో సంఘం మాజీ అధ్యక్షుడు తాతా సుబ్బారావు, కోశాధికారి గ్రంధె వెంకటరామభద్రారావు, ఉపాధ్యక్షుడు బాబు, పెరుమాళ్ల గిరి, కార్యదర్శి నరసింహారావు, మండల అధ్యక్షుడు మోదుకూరి శ్రీనివాసరావు, పబ్బిశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
నేడు వైఎస్సార్సీపీ బంద్
ఒంగోలు, న్యూస్‌లైన్ : పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం జిల్లా బంద్‌కు పిలుపునిచ్చినట్లు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ గురువారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. టీ బిల్లు ప్రవేశపెట్టడం వల్ల పార్లమెంట్లో యుద్ధ వాతావరణం నెలకొందన్నారు. శాసనమండలి, శాసనసభలో ఆమోదం పొందని టీ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడం ద్వారా ప్రజాస్వామ్య విలువలకు కాంగ్రెస్ ప్రభుత్వం తిలోదకాలిచ్చినట్లయిందన్నారు. తెలంగాణ బిల్లును వ్యతిరేకించిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని, సీమాంధ్ర పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమన్నారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ వైఖరికి నిరసనగా.. సమైక్యాంధ్రకు సంఘీభావంగా.. పార్లమెంట్లో టీ బిల్లును ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ జిల్లా బంద్‌కు పిలుపు ఇచ్చినట్లు బాలాజీ పేర్కొన్నారు. నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ అధికార ప్రతినిధులు, వివిధ విభాగాల కన్వీనర్లు, రాష్ట్ర నాయకులు, నగర, మండల కన్వీనర్లు, జిల్లా, నగర స్టీరింగ్ కమిటీ సభ్యులు, సమైక్యవాదులు విరివిగా పాల్గొని బంద్‌ను జయప్రదం చేయాలని నూకసాని కోరారు. వైఎస్సార్సీపీ ఇచ్చిన బంద్‌కు జిల్లాలోని అన్ని వర్గాల ప్రజానీకం సంపూర్ణ మద్దతు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. బంద్‌కు సహకరించడండి శుక్రవారం ఉదయం 5 గంటలకు స్థానిక ఆర్టీసీ బస్టాండులో జరిగే ఆందోళనలో నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ కోరారు. ఆర్టీసీ బస్టాండులో బస్సులను అడ్డుకుంటామని చెప్పారు. పదిగంటలకు పార్టీ కార్యాలయం నుంచి నగరంలో అన్ని వాణిజ్యసంస్థలు, ఫ్రభుత్వ కార్యాలయాల మూసివేత కార్యక్రమం ఉంటుందని, వైఎస్సార్సీపీ శ్రేణులంతా కదిలిరావాలని కుప్పం పిలుపునిచ్చారు. సమాచారం లేకుండా బిల్లు ఎలా పెడతారు? గిద్దలూరు, న్యూస్‌లైన్ : సభ్యులకు ఎలాంటి సమాచారం లేకుండానే రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంట్లో ఎలా ప్రవేశ పెడతారని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ ప్రశ్నించారు. గురువారం గిద్దలూరు వచ్చిన ఆయన.. పార్టీ మండల కన్వీనర్ కాకునూరి హిమశేఖర్‌రెడ్డి గృహంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర అసెంబ్లీలో ఓడిన విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. టీ బిల్లు పెడుతున్నట్లు సభ్యులకు సమాచారం ఇవ్వకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. 2008లో రాష్ట్ర విభజన డిమాండ్రాగా మూడు ప్రాంతాల ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని ముందుకెళ్లాలని కాంగ్రెస్ అధిష్టానానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తేల్చి చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష ధోరణిలో నిర్ణయం తీసుకుని రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తోందని ఆరోపించారు. సోనియా తన కుమారుడిని ప్రధాని చేయాలనే దురాశతో రాష్ట్రాన్ని విభజించేందుకు కుట్రపన్నిందని మండిపడ్డారు. బిల్లులో సవరణలు చేయాలని బీజేపీ సూచిస్తున్నా పట్టించుకోకుండా సభ్యులను సస్పెండ్ చేయడం దుర్మార్గమన్నారు. పార్లమెంటులోనే సీమాంధ్ర ఎంపీలు, మంత్రులపై తెలంగాణ ప్రాంత ఎంపీలు దాడులు చేశారంటే రాష్ట్రం విడిపోతే హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్ర ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి సమైక్యాంధ్ర కోసం పోరాడుతోందని, అధికార, ప్రతిపక్ష పార్టీల వైఫల్యం కారణంగానే నేడు రాష్ట్రం ఇలాంటి దుస్థితికి దిగజారిందని బాలాజీ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు జంగీటి శ్రీనివాసులు, ఉద్యోగుల సంఘ రాష్ట్ర నాయకుడు కోటేశ్వరరావు, బీసీ సంఘాల నాయకులు వెంగళరావుయాదవ్, బేస్తవారిపేట సొసైటీ మాజీ అధ్యక్షుడు పురుషోత్తమరెడ్డి, గడికోట మాజీ సర్పంచ్ రంగస్వామి, కె.రవీంద్రారెడ్డి, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
ఊరుకోం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా ఏపీ ఎన్జీవోలు గురువారం జిల్లా వ్యాప్తంగా చేపట్టిన బంద్ విజయవంతమైంది. ఉద్యోగుల ఆందోళనకు వైఎస్సార్ సీపీ అండగా నిలవడంతో విభజన నిరసనలు మిన్నంటాయి. ఎన్జీవోల బంద్‌కు వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు త మ సంఘీభావాన్ని ప్రకటించాయి. జిల్లాలో తెలుగుదేశం పార్టీ నిరసనలు కొన్ని ప్రాంతాలకే పరిమితంకాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రాంతాల్లో ఆందోళనలకు దిగింది. జిల్లా కేంద్రం ఒంగోలు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎన్జీవోలు బస్టాండ్‌కు వెళ్లి బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. అనంతరం వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ ర్యాలీకి ఆ పార్టీ నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ నాయకత్వం వహించారు. ఎన్జీవోలకు సంఘీభావంగా మునిసిపల్ కార్మికులు కూడా ర్యాలీ చేపట్టారు. నగరంలో మధ్యాహ్నం వరకు దుకాణాలు మూతబడ్డాయి. పాఠశాలలు, కార్యాలయాలు పూర్తిగా తెరుచుకోలేదు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు యోగయ్యయాదవ్ నాయకత్వంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. చర్చి సెంటర్ వద్ద ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ దిష్టిబొమ్మను రెవెన్యూ సిబ్బంది దహనం చేశారు. అద్దంకి నియోజకవర్గంలో విద్యార్థులతో కలిసి ఎన్జీవోలు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం మానవహారంగా ఏర్పడి విభజన నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు. బంగ్లా రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ నాయకులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. చీరాలలో వైఎస్ఆర్ సీపీ నాయకులు బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో పదిమంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వైఎస్ఆర్ సీపీ, టీడీపీ నాయకులు కలిసి బస్టాండ్ వద్ద ధర్నా చేపట్టారు. ఆ తర్వాత యూపీఏ దిష్టిబొమ్మను దహనం చేశారు. దర్శిలో బస్సులు ఆపి.. ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు. గిద్దలూరులో వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి స్వామి రంగారెడ్డి నాయకత్వంలో నంద్యాల-ఒంగోలు రోడ్డుపై ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షడు డాక్టర్ నూకసాని బాలాజీ పాల్గొన్నారు. అనంతరం అన్ని ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. కందుకూరులో బంద్ ప్రభావం పాక్షికంగా కనిపించింది. న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. తెలంగాణ బిల్లు ప్రతులను తగులబెట్టారు. విద్యార్థులతో కలిసి ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. కొండపి నియోజకవర్గం పరిధిలోని టంగుటూరులో పార్టీ మండల కన్వీనర్ బొట్ల రామారావు నాయకత్వంలో ర్యాలీ నిర్వహించి యూపీఏ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కనిగిరిలో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ముక్కు కాశిరెడ్డి నాయకత్వంలో రాస్తారోకో నిర్వహించారు. ఉదయం నుంచి బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలను మూ యించారు. ఎన్జీవోలతో కలిసి రోడ్డుపై ధర్నా చేపట్టారు. పర్చూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో జేఏసీ నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కార్యాలయాలు, దుకాణాలు మూయించి.. ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. సంతనూతలపాడు నియోజకవర్గం నాగులప్పాడులో వైఎస్సార్ సీపీ సమన్వయకర్త అమృతపాణి నాయకత్వంలో ధర్నా, ర్యాలీలు నిర్వహించారు. యర్రగొండపాలెంలోనూ నిరసనలు మిన్నంటాయి. -
విభజనపై భగ్గుమన్న యువజనం
ఒంగోలు, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనను నిరసిస్తూ మంగళవారం జిల్లావ్యాప్తంగా యువత భగ్గుమంది. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలో యువజనులు, విద్యార్థులతో కలిసి పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర విభజన బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించడాన్ని ప్రశ్నిస్తూ యువత గళం విప్పారు. ఒంగోలులో ఉదయం పార్టీ కార్యాలయం నుంచి యువకులు, విద్యార్థులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మంగమూరు రోడ్డు జంక్షన్లో రాస్తారోకో చేపట్టారు. జిల్లాస్థాయి నేతల సహా అందరూ రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ డాక్టర్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ రాష్ట్ర విభజన నిర్ణయం అశాస్త్రీయమైనదన్నారు. కేవలం తన రాజకీయ స్వార్థం కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు యత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఖరిని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన నిలవాల్సిందిపోయి ప్యాకేజీలు కోరడం దారుణమని విమర్శించారు. రాష్ట్ర విభజనకు పాల్పడుతున్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా కంకణబద్ధులు కావాలని నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్ పిలుపునిచ్చారు. జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని చీల్చే హక్కు జైరాం రమేష్కుగాని, దిగ్విజయ్‌సింగ్‌కు గానీ ఎక్కడిదో స్పష్టంచేయాలని డిమాండ్ చేశారు. తమ సొంత రాష్ట్రాల్లో ప్రజల చేత ఛీకొట్టించుకునేవారా తెలుగువారిని విభజించేది అంటూ మండిపడ్డారు. యువజన విభాగం జిల్లా కన్వీనర్ కేవీ రమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజిస్తే నష్టపోయేది ఎక్కువగా విద్యార్థులే అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ స్వర్ణ రవీంద్రబాబు, గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకటేశ్వరరావు, గ్రామీణ పరిశ్రమలు, ఉపాధి విభాగం జిల్లా కన్వీనర్ బొగ్గుల శ్రీనివాసరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ కంచర్ల సుధాకర్, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ కఠారి శంకర్, మహిళా విభాగం జిల్లా కన్వీనర్ పోకల అనూరాధ, నగర అధికార ప్రతినిధి రొండా అంజిరెడ్డి, యువజన విభాగం జిల్లా అధికారప్రతినిధి చిన్నపురెడ్డి అశోక్‌రెడ్డి, వివిధ విభాగాల నగర కన్వీనర్లు నెరుసుల రాము, ముదివర్తి బాబూరావు, స్టీరింగ్ కమిటీ సభ్యులు నత్తల భీమేష్, జాజుల కృష్ణ, యువజన విభాగం రాష్ట్ర నాయకులు మారెడ్డి రామకృష్ణారెడ్డి, సింగరాజు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. దర్శిలో తాజా మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి విద్యార్థులు, యువకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. డీఎస్పీ కార్యాలయం సమీపం నుంచి పట్టణం మొత్తం ర్యాలీ చేపట్టారు. అనంతరం దర్శిలోని గడియారస్తంభం సెంటర్లో మానవహారం చేపట్టడంతోపాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీమాంధ్రకు ఒక పక్క అన్యాయం జరుగుతుందని తెలిసినా సీమాంధ్ర మంత్రులు కానీ, ఎంపీలు కానీ ఏమాత్రం స్పందించకపోవడం దారుణమన్నారు. తమపై విశ్వాసముంచి గెలిపించిన నాయకులకు వెన్నుపోటు పొడిచిన వారికి బుద్ధి చెప్పేందుకు జనం మొత్తం సమాయత్తం కావాలన్నారు. కనిగిరిలో యువకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున చేపట్టిన నిరసన ర్యాలీలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ముక్కు కాశిరెడ్డి పాల్గొన్నారు. మానవహారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురైన పరాభవం కేవలం ఆ రాష్ట్రాల్లోని వ్యతిరేకత మాత్రమే కాదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ వైఖరి మార్చుకోవాలన్నారు. సంతనూతలపాడులో నియోజకవర్గ సమన్వయకర్తలు అంగలకుర్తి రవి, డాక్టర్ వరికూటి అమృతపాణి, సంతనూతలపాడు, చీమకుర్తి మండలాల కన్వీనర్లు దుంపా చెంచిరెడ్డి, పమిడి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో భారీగా మోటారు బైకు ర్యాలీ జరిగింది. ర్యాలీ అనంతరం పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి మాత్రమే తొలినుంచి సమైక్యాంధ్ర కోసం కృషి చేస్తున్నారన్నారు. అటువంటి వ్యక్తికి సంఘీభావం పలికేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మార్కాపురంలో జరిగిన యువజనుల ర్యాలీలో నియోజకవర్గ సమన్వయకర్త జంకె వెంకటరెడ్డి పాల్గొన్నారు. కోర్టుసెంటర్‌లో రాస్తారోకో చేశారు. కేంద్రమంత్రులు, ఎంపీలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వారి చేతగానితనం వల్లే రాష్ర్టం విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు చోటుచేసుకున్నాయని విమర్శించారు. గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త ముత్తుమల అశోక్‌రెడ్డి మాట్లాడుతూ సమైక్యాంధ్రను సాధించుకుంటేనే సీమాంధ్రలో సంతోషం ఉంటుందన్నారు. ముందుగా గిద్దలూరు పట్టణంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. యర్రగొండపాలెంలో యువకులు, విద్యార్థులతో కలిసి నియోజకవర్గ సమన్వయకర్త పాలపర్తి డేవిడ్‌రాజు మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. పలు పాఠశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొని మానవహారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిపోయిందని, రాబోయే ఎన్నికల్లో భూస్థాపితం కాకతప్పదని ఆయన అన్నారు. -
జగన్ బెయిల్ నిబంధనల సడలింపుపై హర్షం
ఒంగోలు, న్యూస్‌లైన్: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బెయిల్ నిబంధనలు సడలిస్తూ సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పుపై జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు మిన్నంటాయి. పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఆ పార్టీ నేతలు స్వీట్లు పంచుకుని ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. జగన్ రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా పర్యటించేందుకు, ఢిల్లీ వెళ్లేందుకు నిబంధనలు సడలించడంపై హర్షం వెలిబుచ్చారు. ఇటీవల భారీ వర్షాలకు నష్టపోయిన ప్రాంతాల్లో పరిశీలించేందుకు, రాష్ట్ర వ్యాప్తంగా సమైక్యాంధ్ర ఉద్యమానికి ఊపు తెచ్చేందుకు ఇది దోహదపడుతుందని పార్టీ నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్ అన్నారు. అనంతరం మహబూబ్‌నగర్ వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో జిల్లా అధికారప్రతినిధులు కఠారి రామచంద్రరావు, నరాల రమణారెడ్డి, వివిధ విభాగాల కన్వీనర్లు కేవీ ప్రసాద్, కఠారి శంకర్, వేమూరి సూర్యనారాయణ, కంచర్ల సుధాకర్, బొగ్గుల శ్రీనివాసరెడ్డి, నగర అధికారప్రతినిధి రొండా అంజిరెడ్డి, వివిధ విభాగాల నగర కన్వీనర్లు నెరుసుల రాము, ముదివర్తి బాబూరావు, బొప్పరాజు కొండలు, యరజర్ల రమేష్, కావూరి సుశీల, వైఎస్సార్సీపీ నాయకులు డీఎస్ క్రాంతికుమార్, దుగ్గిరెడ్డి ఆంజనేయరెడ్డి, వల్లెపు మురళి, రాజేశ్వరి, ఇందిర, రమాదేవి, ప్రమీల, విజయలక్ష్మి, రాధ తదితరులు పాల్గొన్నారు.