వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సెమీక్రిస్మస్ వేడుకలు | Semi-Christmas celebrations | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సెమీక్రిస్మస్ వేడుకలు

Published Tue, Dec 23 2014 3:11 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM

Semi-Christmas celebrations

ఒంగోలు అర్బన్ : ప్రజలు ప్రేమతో ప్రార్థించే దేవుడు ఏసుక్రీస్తు..ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి అని వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం సెమీక్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుప్పం ప్రసాద్ మాట్లాడుతూ క్రీస్తు ప్రజల కోసం జన్మించి   వారికి మేలు చేశారన్నారు. పాస్టర్ శామ్యూల్ సెమీక్రిస్మస్ ప్రార్థనలు చేశారు.  

సెమీ క్రిస్మస్ కేక్‌ను కట్ చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులకు పంచారు. కార్యక్రమంలో  వైఎస్సార్ సీపీ జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ వేమూరి సూర్యనారాయణ,  నాయకులు గంగాడ సుజాత, శింగరాజు వెంకట్రావు, బడుగు ఇందిర, దుగ్గిరెడ్డి అంజిరెడ్డి, జాజుల కృష్ణ, పి.కొండలు, పి.జేమ్స్, శామ్యూల్, అంజిరెడ్డి పాల్గొన్నారు.
 
పోలీస్ క్వార్టర్స్‌లో
-విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేసిన ఎస్పీ శ్రీకాంత్
 
ఒంగోలు క్రైం: ఒంగోలులోని పోలీస్ క్వార్టర్స్‌లో సోమవారం రాత్రి సెమీక్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో  ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ క్రిస్మస్ కేక్‌ను చిన్నారుల చేత కట్ చేయించారు. అనంతరం ఎస్పీ శ్రీకాంత్ మాట్లాడుతూ క్రీస్తు బోధనలు ప్రతిఒక్కరూ అనుసరిస్తే సమాజంలో అంతా మంచే జరుగుతుందని అన్నారు. ప్రజలకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

మదర్ థెరిస్సా అంధుల పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అంధ విద్యార్థి ఎస్‌కే సుల్తాన్‌బీ పాడిన పాట అందరినీ ఆకట్టుకుంది. వేడుకల్లో అదనపు ఎస్పీ బి.రామానాయక్, ఏఆర్ డీఎస్పీ జల్దారెడ్డి, రిజర్వు ఇన్‌స్పెక్టర్లు చంద్రమోహన్, మురళీ, పాస్టర్లు ఎస్‌కే సుదర్శనరావు, ఎం.ప్రసాద్‌బాబుతో పాటు పోలీస్ క్వార్టర్స్ కమిటీ సభ్యులు, పోలీస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement