సీసీ కెమెరాల ఏర్పాటు కలేనా?
విజయనగరం క్రైం, న్యూస్‌లైన్ : జిల్లా కేంద్రంలో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్న పాలకులు, అధికారుల హామీ కాగితా లకే పరిమితమైంది. పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆరు నెలల క్రితం జిల్లా పోలీసు శాఖ నిర్ణరుుంచింది. అందుకు తగ్గ పరిశీలన, ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ముందుగా ట్రైయల్ రన్ గా ఆర్‌టీసీ కాంప్లెక్స్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశా రు. కాంప్లెక్స్‌లో ఎనిమిది సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడమే కాకుండా హెల్ప్ డెస్క్‌లో సర్వర్ ఏర్పాటు చేవారు. దీన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా హెడ్ కానిస్టేబుల్ స్థాయి అధికారిని కూడా నియమించారు.
కంప్యూటర్‌లో సీసీ కెమెరాలను పరిశీలించి కాంప్లెక్స్‌లోకి వెళ్లే ప్రతి ఒక్కరిని గమనించేవారు. దీంతో కొంతవరకూ నేరాలు తగ్గుముఖం పట్టడంతో పట్టణంలోని ప్రధాన కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసు శాఖ భావించింది. ఈ మేరకు 20 ప్రాం తాల్లో సుమారు 100 వైర్‌లెస్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణరుుంచారు. ముఖ్యంగా నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలైన కోట, మూడు లాంతర్లు, గంట స్తంభం, దాసన్నపేట, రింగ్ రోడ్డు, మయూరి జంక్షన్, ఎత్తుబ్రిడ్జి, ఆర్‌అండ్‌బీ, కలెక్టరేట్,బాలాజీ, సిటీస్టాండ్, రైల్వేస్టేషన్ రోడ్డు, కొత్తపేట, అంబటిసత్రం,ఐష్‌ఫ్యాక్టరీ జంక్షన్, తదితర ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలని ప్రణాళికలు తయారు చేశారు.
అరుుతే ఇది జరిగి ఐదు నెలలు కావస్తున్నా... ఇప్పటివరకూ ఎలాంటి పురోగతి లేదు. దీనికితోడు 20 ప్రాంతాల్లోనూ వైర్‌లెస్ సీసీ కెమెరాల ఏర్పాటుకు అప్పటి విజయనగరం ఎం పీ, మంత్రిని నిధులు కేటాయించాలని పోలీసు అధికారులు కోరారు. ప్రస్తుతం ప్రభుత్వం మారడం తో సీసీ కెమెరాలు ఏర్పాటుపై నీలినీడలు అలముకున్నాయి.