district police department
-
జాతీయ కమిషన్ ముందు హాజరైన జిల్లా పోలీసులు
సాక్షి, అమలాపురం(తూర్పుగోదావరి) : గతేడాది పట్టణంలో పెంపుడుకుక్క తరమడంతో కాలువలో పడి ఓ బాలుడు మృతి చెందిన కేసు విషయంలో డీఐజీ, డీఎస్పీ, సీఐలు ఈనెల 9,11 తేదీల్లో ఢిల్లీలోని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. గతేడాది సెప్టెంబర్‌లో అప్పటి హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సోదరుడు జగ్గయ్యనాయుడు పెంపుడు కుక్క తరమడంతో పంట కాలువలో పడి ఓ బాలుడు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ కేసుకు సంబంధించి జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ (ఢిల్లీ) అమలాపురం డీఎస్పీ, సీఐలకు నోటీసులు జారీ చేసింది. దాంతో అమలాపురం డీఎస్పీ ఆర్.రమణ, ఈ కేసు అప్పటి ఇన్విస్టిగేషన్ ఆఫీసర్ (ఐవో) పట్టణ సీఐ సీహెచ్ కోటేశ్వరరావు, ఇప్పటి ఐవో, ప్రస్తుత పట్టణ సీఐ సురేష్‌బాబు ఈనెల 9,11 తేదీల్లో ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్ ముందు హాజరయ్యారు. పెంపుడు కుక్క వల్ల బాలుడు మృతి చెందటానికి దారి తీసిన కారణాలను కమిషన్ అడుగుతూనే ఈ కేసు ఎంత వరకూ వచ్చింది? మీరు తీసుకున్న చర్యలేమిటి? అని వారిని ప్రశ్నించినట్టు తెలిసింది. అప్పట్లో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు కె.రాములు స్వయంగా అమలాపురం వచ్చి ఈ ఘటనను కమిషన్ దృష్టికి తీసుకుని వెళ్లి బాధ్యులపై చర్యలు చేపడతామని చెప్పారు. అంతే కాకుండా బాలుడి మరణానికి కారణమైన పెంపుడు కుక్క యజమానులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని రాములు అప్పట్లో పోలీసులకు సూచించారు. దీనికితోడు అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఆధ్వర్యంలో ఈ ఘటనపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బాలుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కమిషన్ ఈ కేసు విషయమై కొద్ది రోజుల కిందట జిల్లా కలెక్టర్‌కు కూడా నోటీసులు పంపించింది. డీఐజీని కూడా కమిషన్ స్వయంగా హాజరు కావాలని ఆదేశించడంతో డీఐజీతో పాటు డీఎస్పీ, సీఐలు ఢిల్లీ వెళ్లి హాజరయ్యారు. మాజీ ఎంపీ హర్షకుమార్కు కూడా కమిషన్ నోటీసు జారీ చేసింది. ఆయన కూడా ఢిల్లీ వెళ్లినప్పటికీ కమిషన్ సూచించిన రోజుకు వెళ్లకపోవడంతో ఆయనను విచారించలేదు. బాలుడి మృతి కేసుకు సంబంధించి పోస్టుమార్టం రిపోర్ట్‌లో 15వ కాలమ్‌లో మరణానికి కారణం (కాజ్ ఆఫ్ డెత్)లో కాలువలో నీళ్లు తాగడం వల్ల బాలుడు మృతి చెందాడని రాసిన వైనంపై అప్పట్లో దళిత సంఘాలు, నాయకులు అభ్యంతరం చెప్పి ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. పెంపుడు కుక్క తరవడం వల్లే బాలుడు భయపడి కాలువలోకి దూకి మృతి చెందాడని ఎందుకు రాయలేదని ప్రశ్నించిన విషయమూ విదితమే. కాగా పట్టణ సీఐ సురేష్‌బాబును ‘సాక్షి’ వివరాలు కోరగా ఆ కేసులో మానవహక్కుల కమిషన్ ముందు హాజరయ్యేందుకు వెళ్లామని, కమిషన్ ముందు హాజరై ఢిల్లీ నుంచి తిరిగి వచ్చామని చెప్పారు. -
పేదల గోడ..
► జిల్లా ఎస్పీ వినూత్న కార్యక్రమం ► వాల్ ఆఫ్ గాడ్‌తో పేదలకు వస్తువుల అందజేత ► పట్టణంలో మరిన్ని ప్రాంతాల్లో ఏర్పాటుకు చర్యలు ► ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ బలోపేతంపై దృష్టి ఆదిలాబాద్: జిల్లా పోలీసు శాఖ ఎస్పీ ఎం.శ్రీనివాస్ సారథ్యంలో వినూత్న కార్యక్రమాలతో దూసుకెళ్తోంది. ఇటు నేరాలు అదుపునకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూనే.. మరోవైపు ప్రజలకు చేరువయ్యేందుకు సేవా కార్యక్రమాలు చేపడుతోంది. సాధారణంగా 24 గంటలు కేసులు, కోర్టులు అంటూ తిరిగే పోలీసుల ఆలోచన విధానం ప్రజాసేవకు మారుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసు శాఖకు ప్రభుత్వం ప్రత్యేక స్థానం కల్పిస్తోంది. ఆ శాఖకు నిధులతోపాటు అన్ని ప్రభుత్వ పథకాల్లో భాగస్వామ్యులను చేస్తోంది. తమ విధులు నిర్వర్తించడమే కాకుండా ప్రజలకు ప్రభుత్వ పథకాలు చేరువచేసేలా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇలా ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు పోలీసులు మిషన్ కాకతీయ, హరితహారం, వంటి కార్యక్రమాలు నిర్వహించి ఆదర్శంగా నిలిచారు. ఇప్పుడు మరోసారి ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పేదలకు తమ వంతు సహాయంగా ఎస్పీ ఆధ్వర్యంలో వాల్ ఆఫ్ గాడ్ పేరుతో పాత వస్తువులను పేదలకు ఉపయోగపడేలా వెలుగులోకి తీసుకొచ్చారు. పాత వస్తువులు ఎంతో ఉపయోగం.. జిల్లాలో పేదలకు సహాయం చేయడానికి జిల్లా పోలీసులు మరో ముందడుగు వేశారు. స్థానిక టూటౌన్ ఎదుట జూన్ 25న ఎస్పీ ఎం.శ్రీనివాస్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పేదల కోసం ‘వాల్ ఆఫ్ గాడ్’ ప్రారంభించారు. ఇంట్లో అనవసరమైన అనేక వస్తువులు ఉంటాయి, వాటిని పేదలకు, అవసరమున్న వారికి అందించడానికి ఈ వాల్ ఆఫ్ గాడ్ ఉపయోగపడుతోంది. ఇంట్లో ఉన్న పాత వస్తువులు, బట్టలు, చెప్పులు, పుస్తకాలు, దుప్పట్లు, బ్యాగులు ఇతర ఏవైనా నిరుపయోగ వస్తువులు ఈ వాల్ ఆఫ్ గాడ్ వద్ద ఉంచితే ఎవరైన అవసరం ఉన్న వారు వారికి కావాల్సిన వస్తువులను తీసుకెళ్తున్నారు. మన ఇంట్లో ఉన్న పాత వస్తువులు ఉన్నా ఎవరికి ఇవ్వాలి, ఎవరు తీసుకుంటారనే.. ఆలోచన ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అలాంటి వారికి ఈ వాల్ ఆఫ్ గాడ్‌తో వారు అనుకున్నది చేయగలుగుతారు. ఈ ప్రక్రియ ప్రపంచంలో మొదటిసారిగా ఇరాన్ దేశంలో ప్రారంభమైంది. ఆ దేశంలో 1997లో కరువు వచ్చిన సమయంలో ఓ మహిళ ఆలోచనలో నుంచి ఈ కార్యక్రమం పుట్టుకొచ్చింది. తన వద్ద ఉన్న పాత వస్తువులను ఒక దగ్గర చేర్చి బహిరంగంగా ఏర్పాటు చేశారు. తద్వారా ఎవరికి అవసరమైన వస్తువులు వారు తీసుకెళ్లారు. ఇలా ఈ కార్యక్రమం ప్రపంచమంత పాకింది. మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌లో కొన్ని స్వచ్ఛంద సంస్థలు పోలీసుశాఖతో కలిసి ఇటీవలే ప్రారంభించారు. జిల్లాలో మొదటి సారిగా ఈ కార్యక్రయాన్ని ఎస్పీ ప్రారంభించడం గమనార్హం. రద్దీ ప్రాంతంలో ఏర్పాటుతో మరింత మెరుగు.. ప్రస్తుతం వాల్ఆఫ్ గాడ్‌ను టూటౌన్ ఎదుట ఏర్పాటు చేశారు. ఇలాంటివి పట్టణంలో మరికొన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఎస్పీ ఆలోచన చేశారు. రద్దీ ప్రాంతాల్లో దీన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా బస్టాండ్, పాత బస్టాండ్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం ఈ ప్రాంతాల్లో నిరాశ్రయులు, నిరుపేదలు చాలామంది ఉంటారు, ఇలాంటి వారు పోలీసు స్టేషన్ వెళ్లేందుకు బయపడుతారు. అదే బహిరంగంగా జనం ఉన్నచోట పెడితే వారికి అవసరమైన కచ్చితంగా తీసుకెళ్తారు. -
‘ఆర్డర్లీ’ వ్యవహారంలో కుట్ర : ఎస్పీ
ఎస్పీ నవీన్ కుమార్ తాండూరు: జిల్లా పోలీసు శాఖలో సంచలనం కలిగించిన హోంగార్డుల ఆర్డర్లీ వ్యవహారంపై ఎస్పీ డా.బీ.నవీన్ కుమార్ స్పందించారు. బుధవారం హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు తాండూరు విచ్చేసిన ఎస్పీ.. స్థానిక ఏఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ వ్యవహారంలో తనపై కుట్ర జరిగిందన్నారు. నవాబుపేట, తాండూరు, యాలాల, వికారాబాద్ డీటీసీకి చెందిన నలగురు హోంగార్డులు ఒక పథకం ప్రకారం జిల్లా ఎస్పీ కార్యాయానికి వచ్చి కార్యాలయం వెనుక భాగంలో ఫొటోలు, వీడియోలు తీసి మీడియాకు విడుదల చేసినట్టు ప్రాథమిక విచారణలో గుర్తించామన్నారు. ఈ నలుగురు హోంగార్డులకు జిల్లా ఎస్పీ కార్యాలయం, రెసిడెన్సీతో ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ వ్యవహారంలో డీఐజీ ఆధ్వర్యంలో ఉన్నతస్థారుు విచారణ జరుగుతోందని, అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. సదరు నలుగురు హోంగార్డులపై విచారణ అనంతరం తప్పక చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. సిన్సియర్‌గా పని చేసే పోలీసు అధికారులకు ఇబ్బందులు తప్పవన్నారు. పోలీసు శాఖలో పని చేయడం కత్తిమీద సాములాంటిదని అభిప్రాయపడ్డారు. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సవాలుగా తీసుకుంటూ ముందుకుసాగుతానని స్పష్టం చేశారు. ఎస్పీ జిల్లా పోలీసు కుటుంబానికి పెద్ద (హెడ్) అని అన్నారు. కుటుంబ పెద్ద తన పిల్లలను ఎలాచూసుకుంటారో పోలీసు కుటుంబాన్ని తాను అలా ముందుకు నడిపించడానికి పాటుపడుతున్నట్టు చెప్పారు. పోలీసులు సరిగా విధులు నిర్వర్తించేలావారికి మార్గనిర్దేశం చేయడమే తన లక్ష్యమన్నారు. ఏ కేటగిరి హోంగార్డులు రెగ్యులర్ పోలీసుల మాదిరిగానే పెట్రోలింగ్, గార్డు తదితర డ్యూటీలు, బీ కేటగిరిలో హోంగార్డులు కార్పెంటర్, బార్బర్, కుకింగ్, ఎలక్టిష్రీయన్ తదితర స్కిల్డు పనులు చేస్తారన్నారు. వీరు జిల్లాలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుందని ఆయన వివరించారు. వికారాబాద్ సమీపంలోని ధన్నారం వద్ద హౌసింగ్ సొసైటీలో కొందరి పోలీసుల ప్రమేయంపై విచారణ జరుపుతున్నట్టు ఆయన చెప్పారు. సమావేశంలో ఏఎస్పీ చందనదీప్తి పాల్గొన్నారు. -
ఖాకీలకు కొత్త వాహనాలు!
జిల్లా పోలీస్‌శాఖకు కొత్త వాహనాలు సమకూర్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎస్పీ వి.శివకుమార్ పలు వాహనాలను పరిశీలించినట్టు సమాచారం. పోలీస్స్టేషన్ల నిర్వహణకు సుమారు 70 వాహనాలను, పోలీస్ స్మార్ట్‌సిటీల కోసం ప్రత్యేకంగా మరికొన్ని వాహనాలను కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. సర్కారు నుంచి ఆమోదం లభించిన వెంటనే జిల్లా పోలీసులకు కొత్త వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. ⇒ 70 వాహనాలు, వంద బైక్‌లకు ప్రతిపాదనలు ⇒ పోలీసు స్మార్ట్‌సిటీలకు అదనంగా ఏర్పాటు ⇒ ప్రస్తుతమున్నవి.. 130 వాహనాలే.. ⇒ 36కి పైగా ఠాణాలకు కొరత కరీంనగర్ క్రైం: జిల్లా పోలీస్‌శాఖ కొన్నేళ్లగా వాహనాల కొరతతో ఇబ్బందులు పడుతోంది. పోలీసు సంస్కరణల్లో భాగంగా పలు మార్పులు చేసినా అందుకు అనుగుణంగా వాహనాల కేటాయింపు జరగడం లేదు. డయల్ 100 సేవలు, 24 గంటల పెట్రోలింగ్‌కు కూడా ప్రత్యేక వాహనాలు అందుబాటులో లేవు. కొన్నేళ్లుగా వాహనాల కోసం ప్రతిపాదనలు పంపుతున్నా మంజూరుకావడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో 68 పోలీస్స్టేషన్లు, 18 సర్కిళ్లు, ఆరు సబ్ డివిజన్లు ఉన్నాయి. వీటితోపాటు ఆర్మ్డ్, ఆక్టోపస్, ఎస్బీ, ఎన్ఐబీ తదితర విభాగాలు పని చేస్తున్నాయి. వీటిన్నంటికి వాహనాలు తప్పనిసరి. కానీ జిల్లావ్యాప్తంగా 32 పోలీస్స్టేషన్లకు మాత్రమే ప్రభుత్వ వాహనాలున్నాయి. నిఘా, ఇతర విభాగాలకు అసలు వాహనాలే లేవు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాహనాలనే అన్ని సివిల్, ఆర్ముడ్ విభాగాల అధికారులకు వినియోగిస్తున్నారు. ప్రభుత్వ వాహనాలు లేని పోలీస్స్టేషన్లలో ఎస్‌హెచ్‌వోలు సొంతంగా వాహనాలను సమకూర్చుకుంటున్నారు. ప్రభుత్వం కేటాయించిన వాహనాలకు మాత్రమే ప్రతి నెల 110 లీటర్ల డీజిల్ కేటాయిస్తుంది. ప్రైవేట్ వాహనాలు వినియోగించుకుంటున్న వారికి డీజిల్ కోటా ఉండదు. దీంతో వీటి నిర్వహణ, అద్దె రూపంలో అయా పోలీస్స్టేషన్లపై ప్రతి నెల సుమారు రూ.25 వేల భారం పడుతోంది. కాలం చెల్లిన వాహనాలే ఎక్కువ.. ప్రస్తుతం జిల్లా పోలీస్‌శాఖలో 130 వాహనాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రెండు మూడు నెలల్లో సుమారు 15 వాహనాలు జీవితకాలం ముగియనుంది. వీటితోపాటు మరో 50 వాహనాలు కొనుగోలు చేసి సుమారు 20 ఏళ్లు దాటింది. ఇవి కూడా తరచూ మరమ్మతులకు వస్తున్నాయి. గతేడాది జీవితకాలం కంటే ఎక్కువగా వినియోగించిన సుమారు 10 వాహనాలను తుక్కుకు పంపించారు. మరో రెండు మూడు నెలలు గడిస్తే మరికొన్ని వాహనాలు జీవితాకాలం ముగిసిపోతున్న నేపథ్యంలో పోలీస్ సేవలకు ఇబ్బందులు తప్పవు. ఉన్నవాటి నుంచి వీఐపీ సెక్యూరిటీ కోసం పలు వాహనాలు కేటాయించాల్సి వస్తోంది. బందోబస్తు సమయంలో ఎస్కార్టు చేసే సందర్భాల్లో రిపేర్లకు వస్తున్నాయి. వీటిని మరమ్మతులు చేయించడం భారమవుతోంది. ప్రభుత్వం కొత్త వాహనాలు కొనుగోలు చేస్తుండడంతో జిల్లాకు కొత్త వాహనాలు కేటాయించాలని పలుమార్లు జిల్లా పోలీస్ అధికారులు ఉన్నతాధికారులకు నివేదికలు పంపించారు. కానీ ఇప్పటివరకు వాహనాలను మంజూరు చేయకపోవడం గమనార్హం. డయల్ 100, పెట్రోలింగ్‌కు ఇబ్బందులు ప్రసుత్తం జిల్లాలో మూడు పెట్రోలింగ్ రక్షక్ వాహనాలు మాత్రమే ఉండగా ఇవి కూడా నగరంలో మాత్రమే పని చేస్తున్నాయి. వీటిలో రెండు వాహనాలు తరచూ రిపేర్లు వస్తున్నాయి. డయల్ 100 సేవలు అందించడానికి ప్రత్యేకంగా వాహనాలు అవసరం. ఈ సేవల ప్రారంభంలో ప్రతి స్టేషన్‌కు ఒక వాహనం కేటాయిస్తామని ఉన్నతాధికారులు ప్రకటించారు. కానీ ఇంతవరకు ఒక్క వాహనం కూడా కేటాయించలేదు. దీంతో సిబ్బంది తమ సొంత ద్విచక్రవాహనాలనే డయల్ 100 సేవలకు వినియోగిస్తున్నారు. వీటికి ఎలాంటి బడ్జెట్ లేకపోవడంతో సిబ్బందిపై అర్థికంగా భారంగా పడుతోంది. అలాగే పెట్రోలింగ్ విభాగాన్ని బలోపేతం చేసి అందుబాటులో ఉన్న వాహనాలకు జీపీఎస్ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేశారు. వీటిలో ప్రైవేట్ వాహనాలనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. జిల్లాలో పలు పోలీస్ స్మార్ట్ సిటీలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ప్రతి పోలీస్‌స్టేషన్‌కు కొత్త వాహనాలు తప్పనిసరి. 70 వాహనాలు, 100 బైక్‌లు.. జిల్లా పోలీస్ శాఖకు 70 వాహనాలు, వంద బైక్‌లు కేటాయించాలని ఎస్పీ శివకుమార్ ఉన్నతాధికారులకు నివేదికలు పంపించారు. జిల్లా రోడ్లకు అనుకూలంగా ఉన్న పలు వాహనాలు ఎస్పీ పరిశీలించినట్టు తెలిసింది. దీనికి ఉన్నతాధికారులు సైతం సానుకూలంగా స్పందించినప్పటికీ.. ఆనుమతుల కోసం ఎదురుచూస్తున్నట్టు సమాచారం. -
బీ అలర్ట్
- జిల్లాలో మావోల కదలికలు - వరుసగా వెలుస్తున్న పోస్టర్లు - నిశ్శబ్దం తర్వాత కలవరం - సానుభూతిపరుల పనేనన్న ఓఎస్డీ - సమాచార వ్యవస్థను బలపర్చుకోవాలని ఆదేశం చౌటుప్పల్: జిల్లాలో రోజుకోచోట మావోయిస్టు పార్టీ పేరు తో పోస్టర్లు వెలుస్తుండడంతో జిల్లా పోలీస్‌శాఖ అప్రమత్తమైంది. ఓఎస్డీ రాధాకిషన్‌రావు బీఅలర్ట్ అంటూ జిల్లా పోలీసులకు ఆదేశాలిచ్చారు. దశాబ్ద కాలం తర్వాత మావోయిస్టుల కదలికలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాచకొండ ఒకప్పటి పీపుల్స్‌వార్ నక్సలైట్లకు సేఫ్‌జోన్‌గా ఉండేది. కాలక్రమేణా జరిగిన ఎన్కౌంటర్లలో చాలా మంది చనిపోగా, మిగిలిన వారు సేఫ్‌జోన్‌గా ఉన్న ఛత్తీస్‌గఢ్ దండకారణ్యానికి వెళ్లిపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో, మళ్లీ ఈ ప్రాంతంలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. పోస్టర్ల ద్వారా దళంలో చేరమని పిలువునివ్వడం చూస్తుంటే, రిక్రూట్మెంట్ల ద్వారా బలపడాలనే ఆలోచనలో ఉన్నట్టు అవగతమవుతోంది. ఓఎస్డీ సందర్శన.. చౌటుప్పల్ మండలంలో రెండు రోజులుగా మావోయిస్టు పార్టీ పేరుతో పోస్టర్లు వెలువడడంతో శుక్రవారం ఓఎస్డీ రాధాకిషన్‌రావు పోస్టర్లు వెలిసిన గ్రామాలకు వెళ్లి పరిశీలించారు. పోస్టర్లపై ఆరా తీశారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి, పోస్టర్లను పరిశీలించారు. పోలీసు సిబ్బందితో సమావేశమయ్యారు. మావోయిస్టులు మొదట పోస్టర్లు వేసి బల పడతారని, ఆ తర్వాత కొందరినీ చితక్కొట్టి పాగా వేసి, అనంతరం తుపాకులు చేతపట్టి గ్రామాలలో తిరుగుతారని వివరించారు. మొదట పోలీసులంతా గత రికార్డులను తిరగేసి, ఎక్కడెక్కడ విధ్వంసాలకు పాల్పడ్డారు, ఎలా పాల్పడతారు, వారి పనితీరు ఎలా ఉంటుందో తెలుసుకోవాలని సూచించారు. గ్రామాల్లో నె ట్‌వర్క్ వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని, గతంలో మావోయిస్టుల నేపథ్యం ఉన్న వారి పేర్లు సేకరించాలని ఆదేశించారు. జిల్లాకు చెందిన మావోయిస్టులు ఆరుగురు.. జిల్లాకు చెందిన ఆరుగురు వ్యక్తులు వివిధ ప్రాంతాల లో మావోయిస్టులుగా పనిచేస్తున్నారని ఓఎస్డీ రాధాకిషన్‌రావు విలేకరులకు తెలిపారు. జిల్లాలో మాత్రం ప్రస్తుతం నక్సలైట్లు లేరని స్పష్టం చేశారు. ఇటీవలి ప్రాంతంలో వెలుస్తున్న పోస్టర్లు సానుభూతి పరుల పనిగా భావిస్తున్నామన్నారు. అలా అని మావోయిస్టుల కదలికలు లేవని కూడా చెప్పలేమన్నారు. పోస్టర్లు వేసిన వారు దొరికితే నే వాస్తవాలు తెలుస్తాయని పేర్కొన్నారు. ఆయన వెంట సీఐలు భూపతి గట్టుమల్లు, కె.శివరాంరెడ్డి, ఎస్ఐ హరిబాబు తదితరులు ఉన్నారు. -
ఎర్ర చందనం మనజాతి సంపద
జిల్లాలో 41 మంది స్మగ్లర్లపై పీడీయాక్టు 3,200 మంది ఎర్రకూలీల అరెస్ట్ జిల్లా వ్యాప్తంగా కళాజాతాలతో ప్రదర్శనలు డీఐజీ బాలకృష్ణ చేయీచేయి కలుపుదాం.. మనజాతి సంపద ఎర్రచందనాన్ని కాపాడుకుందాం.. అంటూ ప్రభుత్వ అధికారులు, విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులు, డ్వాక్రా మహిళలు ప్రతిజ్ఞ చేశారు. ‘కదులుదాం - ఎర్రచందనం కాపాడుదాం’ పేరుతో పీలేరులో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. .. పీలేరు: ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపి స్మగ్లింగ్‌ను సమూలంగా అణచివేయడమే తమ ప్రధాన లక్ష్యమని అనంతపురం డీఐజీ బాలకృష్ణ అన్నారు. మంగళవారం ఆయన పీలేరులో విలేకరులతో మాట్లాడుతూ స్మగ్లర్లు ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. జిల్లా నుంచి ఒక్క ఎర్రచందనం దుంగను కూడా అక్రమంగా తరలించకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 41 మంది ఎర్ర స్మగ్లర్లపై పీడీయాక్టు నమోదు చేసి, రాజ మండ్రి సెంట్రల్ జైలుకు తరలించామ ని చెప్పారు. ఎర్రచందనంను తరలిం చడానికి సహకరిస్తున్న 3,200 మంది కూలీలను అరెస్ట్ చేసినట్లు వెల్లడించా రు. అత్యంత ఖరీదైన ఎర్రచందనాన్ని పరిరక్షించుకోవడంలో పోలీసులతో యువత, విద్యార్థులు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఎర్రచందనం ఆవశ్యకతను తెలియజేయడం కోసం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో కళాజాత నిర్వహిస్తామన్నారు. కర్ణాటక, తమిళనాడు పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. స్మగ్లర్ల మాయ మాటలకు మోసపోయి యువత ఆ ఉచ్చులో ఇరుక్కోరాదని పిలుపునిచ్చారు. చేయి చేయి కలుపుదాం : ఎస్పీ అత్యంత ఖరీదైన ఎర్రచందనం స్మగ్లిం గ్ను చేయి చేయి కలిపి అడ్డుకుందామ ని చిత్తూరు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివా స్ అన్నారు. మంగళవారం పీలేరు ఆర్టీసీ బస్టేషన్ ఎదురుగా వేర్‌హౌస్ గోడౌన్ ప్రాంగణంలో జిల్లా పోలీస్ శా ఖ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘కదులుదాం - ఎర్రచందనం కాపాడుదాం’ బహిరంగ సభలో ఆయ న మాట్లాడారు. ప్రపంచ స్థాయిలో ఎర్రచందనానికి ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. మన జాతి సంపదను కొందరు అక్రమ మార్గంలో సొమ్ము చేసుకోవడం తగదని పేర్కొన్నారు. స్మగ్లింగ్‌ను అడ్డుకోవడానికి విద్యార్థు లు ముందుకు రావాలన్నారు ఇప్పటికే ఆ రొచ్చు లో ఉన్న వారిలో మార్పు వచ్చినా రాకపోయినా కొత్తవారు అందులోకి దిగకుండా చూడాలన్నారు. స్మగ్లింగ్‌ను అరికట్టడంలో విద్యార్థులంతా గైడ్‌గా వ్యవహరించాలని కోరారు. ఈ సమావేశంలో డీఐజీలు బాలకృష్ణ, ఇక్బాల్, చిత్తూరు కలెక్టర్ సిద్ధార్థ జైన్, తిరుపతి ఎస్పీ గోపీనాథ్‌జెట్టి, మదనపల్లె సబ్ కలెక్టర్ కణ్ణన్, టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీ రత్న, మదనపల్లె డీఎస్పీ రాజేంద్రప్రసాద్, పలువురు పోలీస్ ఉన్నతాధికారులు, విద్యార్థులు, డ్వాక్రా మహిళలు, వివిధ కార్మిక సంఘాల నాయకులు, ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు భారీర్యాలీ నిర్వహించారు. -
పోలీస్ అధికారులకు బదిలీ ఫీవర్
వరంగల్‌క్రైం : జిల్లా పోలీసు శాఖకు బదిలీ ఫీవర్ పట్టుకుంది. మితిమీరిన రాజకీయ జోక్యంతో తప్పుదోవపడుతోంది. పోలీస్ ఉన్నతాధికారులు బదిలీల జాబితా సిద్ధం చేయడం.. ఆ వెంటనే అధికార పార్టీ నేతలు కలుగజేసుకుని రద్దు చే రుుంచడం ఇటీవల మామూలైపోరుుంది. లక్షలు పోసి.. పోస్టింగ్ కొనుక్కుంటున్నప్పటికీ పోటీ తీవ్రస్థాయిలో ఉండడంతో సీటులో కూర్చున్నాక కూడా గ్యారంటీ లేకుండాపోతోంది. ప్రస్తుతం జరుగుతున్న పోలీసు శాఖలో పోస్టింగ్‌లు ప్రమాదకర హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. లక్షల్లో డబ్బులు ముట్టజెప్పి పోస్టింగ్ తెచ్చుకోవడం.. ఆ తర్వాత జనాలను పీడించడం గత కొన్నేళ్లుగా జిల్లాలో జరుగుతూనే ఉంది. పోస్టింగ్‌లు.. వెనువెంటనే రద్దు.. ఇటీవల చేపట్టిన పోలీసు అధికారుల బదిలీల్లో ప్రతిష్టంభన నెలకొంది. అక్టోబర్ 17న వరంగల్ జిల్లాలో 14 మంది సీఐల బదిలీలు జరిగాయి. ఇందులో కొందరు లైఫ్‌లైన్ సర్వీస్‌లో ఉన్నవారికి పోస్టింగ్‌లు ఇచ్చారు. ఇది ప్రజాప్రతినిధులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో వారు రాజధానికి చేరుకుని ఏకంగా పోస్టింగ్‌లనే నిలిపి వేయించారు. కొందరు ప్రజాప్రతినిధులు మంచి స్థానాల్లో పోస్టింగ్‌లు ఇప్పిస్తామని పోలీసుల వద్ద లక్ష లాది రూపాయలు దండుకోవడమే ఇందుకు ఉదాహణ. ఆ తర్వాత నవంబర్ 17న జిల్లాలో 9 మంది డిఎస్పీలను బదిలీ చేశారు. ఒక్క జనగామ డీఎస్పీని మాత్రమే ముట్టుకోలేదు. ఎందుకంటే సదరు డీఎస్పీ రాష్ట్రంలోని కీలకమైన మంత్రికి క్లాస్మేట్ కావడమేనని పోలీసు వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. మొదట 9 మంది డీఎస్పీలను బదిలీ చేసి ఆ తర్వాత పరకాల పోస్టింగ్‌ను నిలిపివేశారు. వెనువెంటనే గతంలో ఉన్న సంజీవరావునే కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అనేక మంది అధికారులు లక్షలాది రూపాయలు పోసి పోస్టింగ్‌లు కొనుక్కున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. పోలీస్‌శాఖలో డబ్బులు పెట్టుబడిగా పెట్టి పోస్టింగ్‌లు తెచ్చుకుని ఆ తర్వాత జనాలను పీడించి సంపాదించేకు సంస్కృతికి ఉద్యోగులు స్వస్తి పలుకాలని ప్రజలు కోరుతున్నారు. బ్యాంకు సొత్తు రికవరీతో ప్రతిష్ట పదిలం.. పోలీసింగ్‌లో దేశంలోనే ప్రత్యేకత కలిగిన వరంగల్ పోలీసులు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్ భూపాలపల్లి, ఆజంనగర్ శాఖల్లో నవంబర్ 15న జరిగిన భారీ దోపిడీ మిస్టరీని త్వరగానే ఛేదిం చారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితుడైన ఏపీజీవీబీ మెస్సేంజర్ వెలమ రాజేంద్రప్రసాద్ అలియూస్ రమేష్ కోసం వరంగల్ పోలీసులు ఆరు బృందాలుగా ఏర్పడి దేశ వ్యాప్తంగా నిందితుల కోసం గాలించారు. ఎట్టకేలకు నిందితుడి కదలికలు గుర్తించి ఎనిమిది రోజుల్లో పట్టుకుని రూ.9.60 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అంతకు ముందే అతడి భార్యను అదుపులోకి తీసుకుని దోపిడీ సొత్తులో 34 కిలోల బంగారం, రూ.2 లక్షలు రికవరీ చేశారు. బ్యాంకు దోపిడీ సొత్తును త్వరగా రికవరీ చేసి వరంగల్ పోలీసులు తమ సత్తాను మరోసారి చాటారు. -
పోలీసుశాఖలో బదిలీల గోల
ఆదిలాబాద్ క్రైం : జిల్లా పోలీసు శాఖలో బదిలీలు గోల.. గోలగా మారాయి. జిల్లా ఎస్పీ పోస్టు భర్తీలో సైతం ఉత్కంఠ ఏర్పడింది. అక్టోబర్ 26న జిల్లా ఎస్పీగా సెంట్రల్‌జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాకు వచ్చేందుకు ఆయన విముఖత చూపడంతో 20 రోజులు ఎస్పీ భూపాల్‌రెడ్డినే కొనసాగించారు. జిల్లాకు వచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో చివరికి నవంబర్ 13న తరుణ్జోషిని ఎస్పీగా ప్ర భుత్వం నియమించింది. ఇలా.. ఎస్పీ క్యాడర్ నుంచి ఎస్సై స్థాయి వరకు జిల్లాలో జరిగే పోలీసు శాఖ బదిలీలన్నీ గందరగోళంగానే కొనసాగుతున్నాయి. పోలీసు ఉన్నతాధికారుల కంటే ప్రజాప్రతినిధుల జోక్యం ఎక్కువ కావడంతో బదిలీలు వాయిదా పడుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కో అధికారి కోసం ఇద్దరు ప్రతిపాదనలు జిల్లాలో ఎప్పుడెప్పుడా అని ఊరిస్తున్న పోలీసు శాఖ బది లీలు ఎమ్మెల్యేల మధ్య చిచ్చురేపుతున్నాయి. ఒక్కో స్థానం లో ఒక పోలీసు అధికారి కోసం ఇద్దరేసి ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు పంపడం వివాదానికి కారణమవుతోంది. జిల్లాలోని మంచిర్యాల, చెన్నూర్, ఖానాపూర్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముథోల్ నియోజకవర్గాలకు సంబంధించి ఒక ఇన్స్పెక్టర్ సర్కిల్లో రెండు నియోజకవర్గాల మండలాలు ఉన్నాయి. సాధారణంగా ఒక పోలీసు సర్కిల్లో నాలుగు పోలీసుస్టేషన్ల వరకు ఉంటాయి. ప్రస్తుతం ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఒక ఇన్స్పెక్టర్ సర్కిల్లో ఒక నియోజకవర్గం నుంచి రెండు పోలీసుస్టేషన్లో, మరో నియోజకవర్గం నుంచి రెండు పోలీసుస్టేషన్లు ఉన్నాయి. ఇది పోలీసు శాఖ డివిజన్ల ప్రకారం వస్తాయి. దీంతో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఆ స్టేషన్ల ఎస్సైలతోపాటు, సీఐ స్థానం స్థానాలు తాము సూచించిన వారికి అంటే తాము సూచించిన వారికంటూ పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సైతం ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం. ఈ కారణంగానే జిల్లా పోలీసు శాఖలో గత నెల రోజులుగా బదిలీలు నిలిచిపోయినట్లు సమాచారం. దీంతో ఎస్సైల బదిలీలతోపాటు, సీఐల బదిలీలు ఎప్పుడు జరుగుతాయా.. అని ఎదురుచూస్తున్న ఆశవాహుల్లో నిరాశ మొదలవుతుంది. ప్రజాప్రతినిధుల సమన్వయలోపంతో బదిలీలు తరచూ నిలిచిపోతున్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. పోటాపోటీగా.. జిల్లాలోని ఏడుగురు డీఎస్పీలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న ఉత్వర్వులు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఆదిలాబాద్ ఏఎస్పీ, ఉట్నూర్, బెల్లంపెల్లి, భైంసా, కాగజ్‌నగర్, నిర్మల్ డీఎస్పీలందరనీ బదిలీ చేసి వారి స్థానంలో కొత్తవారిని నియమించింది. వీరితోపాటు మంచిర్యాల డీఎస్పీ రమణకుమార్‌ను సైబరాబాద్‌కు బదిలీ చేసినప్పటికీ ఆయన స్థానంలో కొత్తవారిని నియమించలేదు. ఈ స్థానం కోసం ఓ ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే పోటాపోటీగా ప్రతిపాదనలు పంపారు. మూడు రోజులపాటు ఉత్కంఠ గా నువ్వా నేనా.. అన్నట్లుగా లాబీయింగ్ చేశారు. చివరకు ఈ నెల 21న హైదరాబాద్‌లో సీబీసీఐడీ డీఎస్పీగా పనిచేస్తున్న కరుణాకర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సదరు ఎంపీ, ఎమ్మెల్యేల వివాదం ఓ కొలిక్కి రావడంతో డీఎస్పీ పోస్టును ఖరారు చేశారు. ఇలా డీఎస్పీ స్థాయిలో ఇంత పెద్ద మొత్తంలో పోటీ జరిగిందంటే పోలీసు శాఖలో ఏ స్థాయిలో ప్రజాప్రతినిధుల ముద్ర పడుతుందో తెలుస్తోంది. ఇక సీఐ, ఎస్సైల విషయంలోనూ ఇదే రకమైన వివాదం సాగుతుండడంతో ఈ బదిలీలపై ఉత్కంఠ నెలకొంది. బదిలీలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ప్రజాప్రతినిధుల నుంచి ప్రతిపాదనలు తీసుకోగా.. పోటీ ఉన్న ప్రాంతంలో వారిని ఒప్పించడమే తరువాయి అన్నట్లుగా ఉంది. లోపిస్తున్న పారదర్శకత.. రోజురోజుకు పోలీసుశాఖలో పారదర్శకత లోపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ శాఖలో అనిశ్చితి ఏర్పడుతోంది. ఏ పని చేసిన రాజకీయ జోక్యం పెరిగిపోవడం, ఏ అధికారి ఎప్పటి వరకు ఉంటాడో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. పోలీసు శాఖలో సీఐలు, ఎసై ్సల బదిలీలు జరగాలంటే ఐజీ, డీఐజీ, ఎస్పీల పర్యవేక్షణలో జరుగుతుంది. ఎలాంటి ఆరోపణలు లేకుండా.. శాంతిభద్రతల్లో రాజీపడని.. బాగా పనిచేసే వాళ్లకు ప్రాధాన్యం ఇచ్చి బదిలీలు చేసేవారు. కానీ ఇప్పుడు దీనికి విరుద్ధంగా నడుస్తోంది. పోలీసు శాఖ బదిలీలు పూర్తి స్థాయిలో ప్రజాప్రతినిధుల చేతుల్లోకి వెళ్లిపోయాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. -
గౌస్ వెనుక ఆ ఇద్దరు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లా పోలీస్ శాఖను కుది పేస్తూ.. రాష్ర్టంలోని కొంతమంది ఐపీఎస్ అధికారులకు వణుకు పుట్టిస్తున్న లెక్చరర్ గౌస్ మొహియిద్దీన్ అరెస్ట్ వ్యవహారంలో మరో కోణం వెలుగుచూస్తోంది. అటు డీఐజీ, ఇటు జిల్లా పోలీస్ కార్యాల యాల్లో పనిచేసే ఉద్యోగులే ఇంటిదొంగలుగా మారి కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు గౌస్‌కు అందజేశారని తెలుస్తోంది. ఆ సమాచారంతోనే అంతా తానే అన్నట్టు చక్రం తిప్పాడని అంటున్నారు. సీఐ, ఎస్సై, కానిస్టేబుళ్ల బదిలీలకు సంబంధించిన నోట్లు, పదోన్నతులు, పనిష్మెంట్ల నోట్లు, అవార్డులు, రివార్డులు, సేవా, ప్రోత్సాహక పత్రాలకు సంబంధించిన జాబితాలను పోలీస్ కార్యాలయాల్లోని ఇద్దరు ఉద్యోగులు ముందుగానే గౌస్‌కు చేరవేసేవారని తెలుస్తోంది. ఉన్నతాధికారుల దృష్టికి తప్ప బయటకు రాకూడని ఈ జాబితా గౌస్ వద్ద ఉండటంతో ముందుగానే ఆయన ఆ జాబితాలో పేర్లున్న అధికారులకు, సిబ్బందికి ఫోన్లు చేసేవారని అంటున్నారు. ‘ఇదిగో నీకు ఈ పతకం వస్తోంది.. నేనే సిఫార్సు చేశా.. నీకు ప్రమోషన్ గ్యారంటీ.. నేనే మాట్లాడా.. ఫలానా చోటకు బదిలీ అవుతుంది.. నీపై ఉన్న పనిష్మెంట్ నోట్ ఎత్తివేయించా.. మీ పై అధికారులతో నేను మాట్లాడితేనే ఇవన్నీ జరుగుతున్నారుు’ అంటూ పోలీసులకు ముందుగానే సమాచారం చెప్పేవాడని తెలుస్తోంది. గౌస్ చెప్పినట్టే జరుగుతోందన్న అభిప్రాయానికి వచ్చిన సదరు అధికారులు ఆయనకు సలామ్ కొట్టేవారని అంటున్నారు. చివరకు గౌస్‌ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలోనూ బదిలీ వ్యవహారానికి సంబంధించి ఇద్దరు పోలీస్ అధికారులు భీమవరంలో గల గౌస్ ఇంట్లోనే ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతం అనంతపురంలో పనిచేస్తూ నరసాపురం డీఎస్పీగా వచ్చేందుకు యత్నిస్తున్న ఓ అధికారి, గతంలో ఏలూరులో సీఐగా పనిచేసి ఇప్పుడు కృష్ణాజిల్లా దివిసీమలో పనిచేస్తున్న ఓ సీఐ గౌస్ అరెస్ట్ సమయంలో ఆయన ఇంట్లోనే ఉన్నారని చెబుతున్నారు. అరెస్ట్ విషయం ముందే తెలుసా తనపై పోలీసులు వల పన్నుతున్నారని గౌస్‌కు ముందే సమాచారం ఉందని అంటున్నారు. ఒంగోలుకు చెందిన కె.సూర్యప్రకాష్‌రెడ్డి ఫిర్యాదు చేసిన వెంటనే ఆ విషయాన్ని కొంతమంది ఇంటిదొంగలు ఆయనకు చేరవేశారని తెలిసింది. ఫిర్యాదుపై ఎంతో కొంత పోలీస్ యాక్షన్ ఉంటుందని భావిం చారే కానీ.. తనను అరెస్ట్ చేసి రోడ్డుకీడుస్తారని మాత్రం గౌస్ ఊహించలేదని అంటున్నారు. ఊహిస్తే జాగ్రత్త పడేవాడని పోలీస్ వర్గాలంటున్నారుు. ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ప్రత్యేక బృందాలు గౌస్ మేనేజింగ్ పార్టనర్‌గా వ్యవహరిస్తున్న సిరిసంపద రియల్ ఎస్టేట్ వ్యవహారానికి సంబంధించి పూర్తిస్థాయి సమాచారం పొందేందుకు పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. నెల్లూరులోని సంగం ప్రాంతంలో కూడా రియల్ వెంచర్ పేరి ట గౌస్ అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. ఈ మేరకు జిల్లా పోలీస్ అధికారులు ఆయా జిల్లాల ఎస్పీలకు సమాచారం ఇచ్చారు. అక్రమార్జనతో ఆస్తులు సంపాదించుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన ఆస్తి వివరాలపై ఆదాయ పన్ను శాఖ అధికారులను కూడా సంప్రదించాలని పోలీసులు భావిస్తున్నారు. గుంటూరు జీజీహెచ్‌లో చేరిక గౌస్ మొహియిద్దీన్ ప్రస్తుతం గుంటూ రు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతనికి గొంతు క్యాన్సర్ ఉండటం, అనారోగ్యం బారిన పడ టంతో ఏలూరు సబ్‌జైల్ నుంచి ముందుగా ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వాసుపత్రికి, మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. కస్టడీ, బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొం దుతున్న గౌస్ బెయిల్ పిటిషన్‌పై సోమవారం ఏలూరు కోర్టులో విచారణ జరగనుంది. అదేవిధంగా మరిన్ని కేసుల సమాచారం కోసం నిందితుడు గౌస్‌ను విచారించేందుకు పోలీస్ అధికారులు కస్టడీ కోరుతూ కోర్టులో వేసిన పిటిషన్‌పైనా అదేరోజు విచారణ జరగనుంది. ఆ డైరీలో ఏముంది గౌస్‌మొహియిద్దీన్ ఇంటినుంచి పోలీస్‌లు స్వాధీనం చేసుకున్న డైరీ కలకలం రేపుతోంది. ఆయన రాసుకున్న డైరీలో చాలామంది ఐపీఎస్‌ల తలరాతలు ఉన్నట్టు సమాచారం. తాను ఎవరెవరికి పనిచేసి పెట్టింది, తనతో ఎవరు సన్నిహితంగా ఉంటారు, ఎవరు దూరంగా ఉంటారు వంటి వివరాలు అందు లో పొందుపరిచినట్టు భోగట్టా. ఈ నేపథ్యంలో గౌస్‌కు ఏయే పోలీస్ అధికారులతో సంబంధాలు ఉన్నాయనే దానిపై డైరీలోని వివరాలు ఉపయోగపడతాయని పోలీస్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. సెల్ ఫోన్ కాల్ డేటాతోపాటు ఆయన ఏయే పోలీస్ అధికారులకు మెసేజ్ లు ఇచ్చారు, ఎవరు రిప్లై ఇచ్చారనే అంశాలపైనా విచారణ చేస్తున్నారు. -
పోలీసుశాఖలో.. 610 కిరికిరి
జిల్లా పోలీసుశాఖలో పనిచేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు మెదక్ జిల్లాలో చదివారు.. స్టడీ సర్టిఫికెట్ ప్రకారం చూస్తే ఆమె మెదక్ జిల్లావాసురాలు అవుతుంది. కానీ, పుట్టి పెరిగింది, తల్లిదండ్రులు నివాసం, ఉద్యోగ రిక్రూట్మెంట్ అన్నీ నల్లగొండలోనే. మరి ఆమెను స్థానికురాలు అనాలా..? స్థానికేతరరాలు అనాలా..? ఇప్పుడు జిల్లా పోలీసుశాఖలో ఇదే అయోమయం నెలకొంది.. !! పోలీసుశాఖలో 610 జీఓ సాక్షిగా కిరికిరి నడుస్తోంది. జిల్లాకు చెందినవారే అయినా, రిక్రూట్మెంట్ ఇక్కడే జరిగినా ‘స్థానికత’ విషయంలో సాంకేతికంగా ఇతర జిల్లాకు చెందిన వారవుతున్నారు. మొత్తంగా జిల్లాలో 610 జీఓ నిబంధనల మేరకు గుర్తించిన వారిలో 46మంది స్థానికేతరులుగా తేలారు. కాగా, వీరిలో 15మంది నిజంగానే ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు కావడంతో, వీరి విషయంలో ఎలాంటి వివాదమూ లేదు. కానీ, మిగిలిన 31మందిది సొంత జిల్లా నల్లగొండ. కానీ, స్థానికత మాత్రం ఇతర జిల్లాకు చెందినవారిగా చూపెడుతోంది. దీనికి కారణం లేకపోలేదు. పదో తరగతి పూర్తయ్యేలోపు వరుసగా నాలుగేళ్లు ఎక్కడ చదివితే అదే స్థానిక ప్రాంతం అవుతుందన్న నిబంధన ఇప్పుడు సమస్యగా మారింది. స్టడీ సర్టిఫికెట్ ప్రకారం 31మంది పోలీసు ఉద్యోగులు నాన్ లోకల్ అవుతున్నారు. కాబట్టి, 610 జీఓ నిబంధనల మేరకు వారు ఇక్కడినుంచి బయటకు వెళ్లిపోవాల్సి వస్తోంది. దీంతో సొంత జిల్లాను వదిలి, వేరే జిల్లాకు ఎలా వెళతాం అంటూ ఆవేదన చెందుతున్నారు. కేవలం స్టడీ సర్టిఫికెట్‌ను మాత్రమే పరిగణలోకి తీసుకుంటే ఎలా..? ‘పేరెంట్ రెసిడెన్షియల్ అడ్రస్’ను పరిగణనలోకి తీసుకుని తమకు న్యాయం చేయాలన్నది వీరి డిమాండ్. ప్రభుత్వం దృష్టికి సమస్య.. ఇప్పటికే ఈ అయోమయం గురించి ప్రభుత్వం దృష్టికి కొందరు తీసుకెళ్లారు. రాష్ట్ర మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్‌లకు వినతిపత్రాలు కూడా ఇచ్చారు. ఈ సమస్య దాదాపు అన్ని జిల్లాల్లో ఉన్నందున ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందన్న ఆశాభావంతో ఉన్నా, 610 జీఓను తక్షణం అమలు చేయడానికి అధికారులు నడుంబిగించడంతో ఈ 31మంది సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. తాము నల్లగొండ జిల్లాలో రిక్రూట్ అయినా, నాన్‌లోకల్ అన్న పేరున ఇతర జిల్లాకు పంపిస్తే, అక్కడి అధికారులు తమకు విధుల్లో చేర్చుకోకుంటే పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు. ‘610 జీఓ ఉద్దేశం తెలంగాణ ప్రాంతానికి చెందని వారిని బయటకు పంపడం. కానీ, తెలంగాణ రాష్ట్రం వారిని, తెలంగాణలోని మరో జిల్లాకు పంపడం ఏమిటి..? ఇదంతా కొందరు తమ పదోన్నతులు తేలిక కావడానికి, లిస్టులో పైకి ఎగబాకడానికి సృష్టిస్తున్న వివాదం. ప్రభుత్వం ఏదో ఒక క్లారిటీ ఇచ్చేదాకా మరో 2 నెలలు ఆగితే సరిపోతుంది కదా..’ అని ఓ ఉద్యోగి వ్యాఖ్యానించారు. కాగా, ఇబ్బందికరంగా ఉన్న లోకల్, నాన్-లోకల్ వివాదం గురించి ఇప్పటికే ప్రభుత్వానికి వినతులు వెళ్లాయని చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి ‘పోలీసు శాఖ ఉన్నతాధికారులు ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి గైడ్‌లైన్స్ రాలేదు. ఆందోళన చెందాల్సిన పనిలేదు. సమస్య పరిష్కారమవుతుంది..’ అని పోలీసు అధికారుల సంఘం నాయకులు పేర్కొన్నారు. ఈ వివాదానికి ఎప్పుడు తెరపడుతుందా అని సిబ్బంది ఆశగా ఎదురుచూస్తున్నారు. కాగా, జిల్లా పోలీసుశాఖకు చెందిన ఆంధ్రా ప్రాంత అధికారి కావాలనే ఈ విషయాన్ని వివాదాస్పదం చేస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. -
బదిలీలకు రంగం సిద్ధం!
జిల్లా పోలీస్‌శాఖలో కొంతకాలంగా ఎదురుచూస్తున్న బదిలీలకు రంగం సిద్ధమైంది. దీంతో పోస్టింగ్‌ల కోసం అధికారులు నేతల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. తమకు నచ్చిన స్టేషన్లో అవకాశం కోరుతూ పైరవీలు మొదలుపెట్టారు. రాజధాని స్థారుులో తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జిల్లాలో వివిధ పోలీస్స్టేషన్లలో పనిచేస్తున్న 180 మందికిపైగా కానిస్టేబుళ్ల ఉద్యోగకాలం పూర్తకావడంతో వారికి బదిలీలు తప్పనిసరైంది. ఇప్పటికే బదిలీలకు అవకాశమున్న వారు తమకు నచ్చిన మూడు పోలీస్స్టేషన్లు ఎంపిక చేసుకుని దరఖాస్తు చేసుకోవాలని ఉన్నతాధికారులు సూచించినట్లు సమాచారం. నిబంధనల ప్రకారం కానిస్టేబుళ్లు ర్యాండమ్‌గా గ్రామీణ పోలీస్స్టేషన్లు, నగర పోలీస్స్టేషన్లలో పనిచేయాలి. ఎక్కువగా రూరల్ ప్రాంతాలు, నక్సల్స్ ప్రభావితప్రాంతాల్లో పనిచేసిన వారికి నగరాల్లో పనిచేసే అవకాశముంది. అయితే కొన్నేళ్లుగా జరుగుతున్న బదిలీల్లో రూరల్‌లో పని చేసేవారు మరో రూరల్ ప్రాంతానికి బదిలీలు జరుగుతుండగా.. నగరాల్లో పనిచేస్తున్న వారు ఇక్కడే పాతుకుపోతున్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న వారు ఇక్కడే కానిస్టేబుల్‌గా చేరి ఇక్కడే ఏఎస్సైలుగా పదోన్నతి పొందిన వారూ ఉన్నారు. సుమారు 15 ఏళ్లుగా ఒక పోలీస్‌స్టేషన్ నుంచి మరో స్టేషన్‌కు మారుతూ జిల్లా కేంద్రంలోనే పాతుకుపోతున్నారు. వీరు స్టేషన్లలో కీలకంగా మారి నాయకులు, అధికారులకు అన్ని పనులు చక్కబెడుతున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో వారిపై ఎన్ని ఆరోపణలు వచ్చినా బదిలీలు చేయకుండా అక్కడే ఉంచడం.. బదిలీ చేసినా అటాచ్డ్ పేరుతో మళ్లీ నగరానికి చేరడం పరిపాటిగా మారింది. తీరు మారని అధికారులు.. ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా అధికారుల బదిలీలు జరిగాయి. అయితే గతంలో మాదిరిగా మార్పిడి విధానంలో కాకుండా జంబ్లింగ్ పద్ధతిలో బదిలీలు చేశారు. జిల్లా నుంచి ఇతర జిల్లాలకు బదిలీ అయిన పలువురు అధికారులు మళ్లీ జిల్లాకు రావడానికి వారికి ఉన్న పరిచయాలతో నేతల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. గతంలో పలువురు నాయకులు, అధికారులు పైరవీలకు పెద్దపీట వేసి సమర్థులైన పలువురు అధికారులను లూప్‌లైన్ పోస్టింగ్‌లకు పంపించారనే ఆరోపణలున్నాయి. ఏడాది క్రితం పలువురు ఎస్సైల బదిలీలు జరిగాయి. వీరిలో చాలామంది వీఆర్, అప్రాధాన్యత పోస్టులు, వెయిటింగ్లో ఉన్నారు. ఇక ప్రస్తుతం బదిలీలకు రంగం సిద్ధం చేశారని తెలుసుకున్న పలువురు అధికారులు నాయకులతో అనుకున్న స్థానానికి బదిలీ చేయించుకునేందుకు యత్నిస్తున ్నట్లు తెలిసింది. తాజాగా కొత్తగా ప్రభుత్వం ఏర్పాటుచేయడంతో గతంలో పని చేసినట్లుగా పైరవీలకు పలువురు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పలువురు అధికారులు పనితీరు కంటే నాయకుల ప్రసన్నం చేసుకోవడానికే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పోస్టు కోసం పోటాపోటీ.. కరీంనగర్ సబ్‌డివిజన్‌లో ఉన్న ఓ పోలీస్‌స్టేషన్ పోస్టింగ్ కోసం 8మంది ప్రయత్నాలు చేస్తుండగా.. ఇదే డివిజన్లోని మరో పోలీస్‌స్టేషన్‌కు 12మంది వరకు పోటీ పడుతున్నారని ప్రచారం జరుగుతోంది. సీఐల పోస్టింగ్ కోసమైతే ఇతర జిల్లాలో పనిచేస్తున్న వారితోపాటు జిల్లాలోని పలువురు సీఐలు రాజధాని స్థాయిలో పైరవీలు ప్రారంభించారు. గతంలోనూ ఇదే విధంగా పైరవీలకు పెద్దపీట వేయడంతో పలువురు సమర్థవంతమైన అధికారులు విధిలేని పరిస్థితుల్లో నేతల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పైరవీలకు పెద్దపీట వేయకుండా పనితీరుకు పెద్దపీట వేయాలని ప్రజలు కోరుతున్నారు. నివేదికలు సిద్ధం పలువురు నాయకులు కొత్తగా ఎన్నిక కావడం.. కొత్తరాష్ట్రం కావడంతో ఆయా నియోజకవర్గాల్లో ప్రజలు సేవచేయాలంటే పలువురు సమర్థులైన అధికారులు అవసరం. దీంతో పలువురు నాయకులు అధికారులకు సంబంధించి సమాచారంతో నివేదికలు సిద్ధం చేస్తున్నారని సమాచారం. దీని ఆధారంగా బదిలీలు చేయాలని కోరుతున్నారని తెలిసింది. ఉన్నతాధికారులు కూడా... ప్రస్తుతం జిల్లాలో పని చేస్తున్న పలువురు ఉన్నతాధికారుల బదిలీలు కూడా జరగవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఓఎస్డీ సుబ్బారాయుడు ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు వెళ్లిపోతుండగా.. మరో ఇద్దరు ఉన్నతాధికారులతోపాటు ముగ్గురు డీఎస్పీలు ఆంధ్రప్రదేశ్ క్యాడర్ వెళ్లే అవకాశాలున్నాయని సమాచారం. అయితే వీటికి సంబంధించి స్పష్టత మరో పదిరోజుల్లో వెలువడే అవకాశాలున్నాయని తెలిసింది. దీంతో కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకూ పెద్ద ఎత్తు బదిలీలు జరుగుతాయనే ప్రచారం ఉంది. -
సీసీ కెమెరాల ఏర్పాటు కలేనా?
విజయనగరం క్రైం, న్యూస్‌లైన్ : జిల్లా కేంద్రంలో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్న పాలకులు, అధికారుల హామీ కాగితా లకే పరిమితమైంది. పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆరు నెలల క్రితం జిల్లా పోలీసు శాఖ నిర్ణరుుంచింది. అందుకు తగ్గ పరిశీలన, ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ముందుగా ట్రైయల్ రన్ గా ఆర్టీసీ కాంప్లెక్స్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశా రు. కాంప్లెక్స్‌లో ఎనిమిది సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడమే కాకుండా హెల్ప్ డెస్క్‌లో సర్వర్ ఏర్పాటు చేవారు. దీన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా హెడ్ కానిస్టేబుల్ స్థాయి అధికారిని కూడా నియమించారు. కంప్యూటర్లో సీసీ కెమెరాలను పరిశీలించి కాంప్లెక్స్‌లోకి వెళ్లే ప్రతి ఒక్కరిని గమనించేవారు. దీంతో కొంతవరకూ నేరాలు తగ్గుముఖం పట్టడంతో పట్టణంలోని ప్రధాన కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసు శాఖ భావించింది. ఈ మేరకు 20 ప్రాం తాల్లో సుమారు 100 వైర్లెస్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణరుుంచారు. ముఖ్యంగా నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలైన కోట, మూడు లాంతర్లు, గంట స్తంభం, దాసన్నపేట, రింగ్ రోడ్డు, మయూరి జంక్షన్, ఎత్తుబ్రిడ్జి, ఆర్అండ్బీ, కలెక్టరేట్,బాలాజీ, సిటీస్టాండ్, రైల్వేస్టేషన్ రోడ్డు, కొత్తపేట, అంబటిసత్రం,ఐష్ఫ్యాక్టరీ జంక్షన్, తదితర ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలని ప్రణాళికలు తయారు చేశారు. అరుుతే ఇది జరిగి ఐదు నెలలు కావస్తున్నా... ఇప్పటివరకూ ఎలాంటి పురోగతి లేదు. దీనికితోడు 20 ప్రాంతాల్లోనూ వైర్లెస్ సీసీ కెమెరాల ఏర్పాటుకు అప్పటి విజయనగరం ఎం పీ, మంత్రిని నిధులు కేటాయించాలని పోలీసు అధికారులు కోరారు. ప్రస్తుతం ప్రభుత్వం మారడం తో సీసీ కెమెరాలు ఏర్పాటుపై నీలినీడలు అలముకున్నాయి. -
దూకుడుకు కళ్లెం
‘ఏం బావా.. ఏంటి కథ! పెళ్లి కొడుకులా తయారయ్యావ్’ అంటూ మంత్రి జుట్టును సరిచేస్తూ పలకరించారు ఓ సీఐ. ‘అదేం లేదులేరా..’ అంటూ స్పందించాడు మంత్రి. ఇంతలోనే ఆ సీఐ అందుకుంటూ ‘బావా మొన్న ఒకటి అడిగా.. గుర్తుందా’ అన్నారు. ‘ఆ.. ఎందుకు గుర్తులేదురా! పోస్టింగే కదా?! నీకుగాకపోతే ఎవరికి ఇప్పిస్తారా’ అంటూ హామీ ఇచ్చేశారు ఆ మంత్రి. ఇదంతా ఓ పోలీసు ఉన్నతాధికారి సమక్షంలోనే జరిగింది. మంత్రి సిఫారసుతో ఓ కీలక ప్రాంతంలో సీఐ పోస్టింగ్‌ను దక్కించుకున్నారు. ఆ మంత్రి పేరు చెప్పుకొని సెటిల్మెంట్లు చేయడంలో ఆరితేరిపోయారు. మట్కా బీటర్లు మొదలుకుని వైన్ షాపుల యజమానుల దాకా అందరి నుంచి మామూళ్లు గుంజడంలో మేటిగా నిలిచారు. దారితప్పిన ఆ సీఐకి ఎస్పీ సెంథిల్‌కుమార్ నాలుగు మెమోలు ఇచ్చారు. అయినా తీరు మారలేదు. చివరకు ఎస్పీ నిలదీశారు. తన వెనుక మంత్రి ఉన్నారన్న ధైర్యంతో ఏకంగా డీఐజీ, ఎస్పీపైనే ఆ సీఐ ఎదురుతిరిగారు. ఇలాంటి పోలీస్ అధికారులకు ‘గుణపాఠం’ నేర్పడానికి డీఐజీ, ఎస్పీ కసరత్తు ప్రారంభించారు. అందుకోసం వారు ఏమి చేస్తున్నారన్నది తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే! ఖద్దరు దన్నుతో ఖాకీవనంలో వేళ్లూనుకుపోయిన గంజాయి మొక్కలను ఏరిపారేయడానికి డీఐజీ బాలకృష్ణ, ఎస్పీ సెంథిల్‌కుమార్ నడుం బిగించారు. దీంతో జిల్లా పోలీసు శాఖలో ప్రకంపనలు మొదలయ్యాయి. నలుగురు సీఐలు సినీఫక్కీలో సెటిల్మెంట్లు చేస్తుండగా.. ఐదుగురు సీఐలు ఇసుక స్మగ్లర్లకు దన్నుగా నిలుస్తున్నారు. ఒక సీఐ నకిలీ కరెన్సీ చలామణి ముఠాతో చేతులు కలిపారు. వారిని చూసుకుని కొందరు ఎస్‌ఐలూ అదే బాట పట్టారు. ఇద్దరు ఎస్ఐలు ఎర్రచందనం స్మగ్లర్లుగా రూపాంతరం చెందగా.. ఎనిమిది మంది ఇసుక స్మగ్లర్లుగా మారారు. మరో నలుగురు సెటిల్మెంట్లలో మునిగి తేలుతున్నారు. వీరంతా ఖద్దరు దన్నుతో పోస్టింగ్‌లు పొందిన వారే. మంత్రులు, అధికార, విపక్ష ఎమ్మెల్యేల సిఫారసులతో అత్యంత ప్రధానమైన కేంద్రాల్లో పోస్టింగ్‌లు దక్కించుకున్నారు. ఫలితంగా నిజాయతీతో పనిచేసే పోలీసు అధికారులకు సరైన ప్రాంతాల్లో పోస్టింగ్‌లు దక్కలేదనే భావన ఆ శాఖలోనే బలంగా వ్యక్తమవుతోంది. కొందరు సీఐలు, ఎస్ఐలే దారి తప్పడంతో పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సడలే దుస్థితి దాపురించింది. ఎన్నికలు ముంచుకొస్తోన్న నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు డీఐజీ బాలకృష్ణ, ఎస్పీ సెంథిల్‌కుమార్ కొరడా ఝళిపిస్తున్నారు. దారితప్పిన 14 మంది సీఐలు, 24 మంది ఎస్ఐలకు మెమోలు ఇచ్చారు. ఇందులో ఏడెనిమిది మెమోలు తీసుకున్న సీఐలు, ఎస్ఐలు కూడా ఉండటం గమనార్హం. ఖద్దరు దన్నుతో ఆ సీఐలు, ఎస్ఐలు లెక్క చేయకపోవడం వల్లే ఉన్నతాధికారులు పదే పదే మెమోలు జారీ చేసినట్లు పోలీసుశాఖ వర్గాలు వెల్లడించాయి. మెమోలను తేలిగ్గా తీసుకుంటుండటాన్ని డీఐజీ, ఎస్పీలు తీవ్రంగా పరిగణించారు. క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేయడం ద్వారా ఆ సీఐలు, ఎస్ఐల్లో మార్పుతేవాలని భావించారు. అందులో భాగంగా విస్తృతంగా పోలీసుస్టేషన్లలో తనిఖీలు చేపడుతున్నారు. దారితప్పిన వారు తీరుమార్చుకోవాలని కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఎస్పీ సెంథిల్‌కుమార్ ‘ప్రజల చెంతకు పోలీసు’ కార్యక్రమంలో భాగంగా వారంలో ఒక పోలీసుస్టేషన్‌కు వెళ్లి ‘ప్రజాదర్బార్’ నిర్వహిస్తున్నారు. ఇది కొంత సానుకూల ఫలితాలను ఇస్తోంది. కొందరు సీఐలు, ఎస్ఐలు తీరుమార్చుకున్నారు. కానీ.. మరి కొందరు మాత్రం ఖాతరు చేయడం లేదు. జిల్లాలో వెకెన్సీ రిజర్వు(వీఆర్)లో ఉన్న 19 మంది సీఐలు పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. 16 మంది ఎస్ఐలు వీఆర్‌లో ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మూడేళ్లకు మించి జిల్లాలో పనిచేసిన సీఐలను సరిహద్దులు దాటించాల్సి ఉంది. ఒకే నియోజకవర్గంలో పాతుకుపోయిన ఎస్ఐలకు కూడా స్థానచలనం కల్పించాల్సి వుంది. ఇదంతా ఎన్నికల సంఘం కనుసన్నల్లో జరుగుతుంది. దీన్ని అవకాశంగా తీసుకుని మాట వినని కొందరు సీఐలు, ఎస్ఐల పని పట్టాలని డీఐజీ, ఎస్పీ నిర్ణయించారు. అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన వారికి బదిలీలతో గుణపాఠం చెప్పి.. వీఆర్‌లో ఉన్న వారందరికీ పోస్టింగ్‌లు ఇవ్వాలని భావిస్తున్నారు. ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. సీఐలకు స్థానచలనం కల్పిస్తూ.. ఆరోపణలున్న కొందరు సీఐలపై వేటువేస్తూ డీఐజీ బాలకృష్ణ రాయలసీమ ఐజీ రాజీవ్త్రన్కు నివేదిక పంపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. 55 మంది ఎస్ఐలకు కూడా స్థానచలనం కల్పించేందుకు ఎస్పీ సెంథిల్‌కుమార్‌తో కలిసి డీఐజీ కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో తీవ్ర ఆరోపణలున్న ఎస్ఐలపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. నిజాయతీపరులైన అధికారులకు అత్యంత కీలక ప్రాంతాల్లో పోస్టింగ్‌లు ఇవ్వాలని నిశ్చయించారు. డీఐజీ, ఎస్పీ దూకుడుగా ముందుకెళ్తోండటంతో పోలీసు శాఖలో కలకలం రేగుతోంది.