ఎర్ర చందనం మనజాతి సంపద
జిల్లాలో 41 మంది స్మగ్లర్లపై పీడీయాక్టు
3,200 మంది ఎర్రకూలీల అరెస్ట్
జిల్లా వ్యాప్తంగా కళాజాతాలతో ప్రదర్శనలు
డీఐజీ బాలకృష్ణ
చేయీచేయి కలుపుదాం.. మనజాతి సంపద ఎర్రచందనాన్ని కాపాడుకుందాం.. అంటూ ప్రభుత్వ అధికారులు, విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులు, డ్వాక్రా మహిళలు ప్రతిజ్ఞ చేశారు. ‘కదులుదాం - ఎర్రచందనం కాపాడుదాం’ పేరుతో పీలేరులో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ..
పీలేరు: ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపి స్మగ్లింగ్‌ను సమూలంగా అణచివేయడమే తమ ప్రధాన లక్ష్యమని అనంతపురం డీఐజీ బాలకృష్ణ అన్నారు. మంగళవారం ఆయన పీలేరులో విలేకరులతో మాట్లాడుతూ స్మగ్లర్లు ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. జిల్లా నుంచి ఒక్క ఎర్రచందనం దుంగను కూడా అక్రమంగా తరలించకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 41 మంది ఎర్ర స్మగ్లర్లపై పీడీయాక్టు నమోదు చేసి, రాజ మండ్రి సెంట్రల్ జైలుకు తరలించామ ని చెప్పారు. ఎర్రచందనంను తరలిం చడానికి సహకరిస్తున్న 3,200 మంది కూలీలను అరెస్ట్ చేసినట్లు వెల్లడించా రు. అత్యంత ఖరీదైన ఎర్రచందనాన్ని పరిరక్షించుకోవడంలో పోలీసులతో యువత, విద్యార్థులు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఎర్రచందనం ఆవశ్యకతను తెలియజేయడం కోసం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో కళాజాత నిర్వహిస్తామన్నారు. కర్ణాటక, తమిళనాడు పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. స్మగ్లర్ల మాయ మాటలకు మోసపోయి యువత ఆ ఉచ్చులో ఇరుక్కోరాదని పిలుపునిచ్చారు.
చేయి చేయి కలుపుదాం : ఎస్పీ
అత్యంత ఖరీదైన ఎర్రచందనం స్మగ్లిం గ్‌ను చేయి చేయి కలిపి అడ్డుకుందామ ని చిత్తూరు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివా స్ అన్నారు. మంగళవారం పీలేరు ఆర్టీసీ బస్టేషన్ ఎదురుగా వేర్‌హౌస్ గోడౌన్ ప్రాంగణంలో జిల్లా పోలీస్ శా ఖ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘కదులుదాం - ఎర్రచందనం కాపాడుదాం’ బహిరంగ సభలో ఆయ న మాట్లాడారు. ప్రపంచ స్థాయిలో ఎర్రచందనానికి ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. మన జాతి సంపదను కొందరు అక్రమ మార్గంలో సొమ్ము చేసుకోవడం తగదని పేర్కొన్నారు. స్మగ్లింగ్‌ను అడ్డుకోవడానికి విద్యార్థు లు ముందుకు రావాలన్నారు ఇప్పటికే ఆ రొచ్చు లో ఉన్న వారిలో మార్పు వచ్చినా రాకపోయినా కొత్తవారు అందులోకి దిగకుండా చూడాలన్నారు.
స్మగ్లింగ్‌ను అరికట్టడంలో విద్యార్థులంతా గైడ్‌గా వ్యవహరించాలని కోరారు. ఈ సమావేశంలో డీఐజీలు బాలకృష్ణ, ఇక్బాల్, చిత్తూరు కలెక్టర్ సిద్ధార్థ జైన్, తిరుపతి ఎస్పీ గోపీనాథ్‌జెట్టి, మదనపల్లె సబ్ కలెక్టర్ కణ్ణన్, టాస్క్‌ఫోర్స్ ఓఎస్‌డీ రత్న, మదనపల్లె డీఎస్పీ రాజేంద్రప్రసాద్, పలువురు పోలీస్ ఉన్నతాధికారులు, విద్యార్థులు, డ్వాక్రా మహిళలు, వివిధ కార్మిక సంఘాల నాయకులు, ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు భారీర్యాలీ నిర్వహించారు.