పుష్కర పనుల తీరుపై సీఎం అసంతృప్తి
రాజమండ్రి: గోదావరి పుష్కర పనుల తీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం ఆయన రాజమండ్రిలో పనుల తీరును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రాజమండ్రి మునిసిపల్ కమిషనర్, ఇతర అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమన్వయంతో పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఈ సందర్భంగా సీఎం అధికారులను ఆదేశించారు. పుష్కరాల పనులపై మంత్రుల కమిటీ, సమన్వయ కమిటీ, కార్యాచరణ కమిటీలు ఏర్పాటు చేయించారు. నాలుగో బ్రిడ్జి రోడ్డు కూలిపోవడంపై కాంట్రాక్టర్లను సీఎం చంద్రబాబు హెచ్చరించారు.