తెలంగాణను అడ్డుకునేందుకే బాబు ఢిల్లీకి : కడియం శ్రీహరి | Chandrababu goes delhi to stop telangana division, says Kadiyam srihari | Sakshi
Sakshi News home page

తెలంగాణను అడ్డుకునేందుకే బాబు ఢిల్లీకి : కడియం శ్రీహరి

Published Tue, Sep 17 2013 1:05 AM | Last Updated on Fri, Jul 12 2019 3:10 PM

Chandrababu goes delhi to stop telangana division, says Kadiyam srihari

వరంగల్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అడ్డుకోవడానికే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కడియం శ్రీహరి ఆరోపించారు. సోమవారం హన్మకొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ తమ్ముళ్లకు చిత్తశుద్ధి, దమ్ముంటే చంద్రబాబుతో హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుచేయాలని ప్రధాని, రాష్ట్రపతికి లేఖ ఇప్పించాలని ఆయన కోరారు. ఏనాడూ ఉద్యమం చేయని కాంగ్రెస్ ప్రతినిధులు సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. తెలంగాణను అడ్డుకోవడానికి సీఎం కిరణ్ , పీసీసీ అధ్యక్షుడు బొత్స, చంద్రబాబు చేస్తున్న కుట్రలను అడ్డుకుని, కేంద్రంపై ఒత్తిడి చేయాలని కడియం డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement