‘చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు’ | Chandrababu Lies On polavaram project, says ysrcp mla peddireddy ramachandra reddy | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు’

Published Fri, Sep 16 2016 2:38 PM | Last Updated on Sat, Aug 18 2018 5:48 PM

‘చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు’ - Sakshi

‘చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు’

తిరుపతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుపై తప్పుదోవ పట్టిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ 2018కి పోలవరం ప్రాజెక్ట్ను పూర్తి చేస్తామని బాబు చెప్పడం దగాకోరుతనమే అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రభుత్వ నిర్మాణంలో జవాబుతనం లేకుండా ఉందన్నారు.

కేవలం డబ్బు దండుకోవటానికే టీడీపీ యోచిస్తోందని పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. రాజధాని నిర్మాణానికి వైఎస్ జగన్ అడ్డుకుంటున్నారని చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాజధాని నిర్మాణం తప్పనిసరిగా పూర్తి చేస్తోందని పెద్దిరెడ్డి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement