ప్రవల్లికకు చంద్రబాబు ప్రశంసలు
విజయనగరం అర్బన్: లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సులో స్థానం సాధించుకున్న పట్టణ చిత్రకాళాకారిణి ఎస్.ప్రవల్లికనారాయణ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశంసించారు. జిల్లా పర్యటనలో భాగంగా చింతలవలస ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాలకు వచ్చిన ఆయనను ప్రవల్లిక కలిసి తన లిమ్కా రికార్డును, స్వచ్ఛభారత్ కార్యక్రమంపై గీసిన ప్రత్యేక చిత్రలేఖనాన్ని చూపించింది. వాటిని పరిశీలించిన చంద్రబాబునాయుడు అభినందించారని ప్రవల్లిక తండ్రి గౌరీశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు.