'చంద్రబాబు టెర్రరిస్టులా వ్యవహరిస్తున్నారు' | chandrababu naidu behaves like a terrorist: t.congress mlc's | Sakshi

'చంద్రబాబు టెర్రరిస్టులా వ్యవహరిస్తున్నారు'

Oct 25 2013 3:58 PM | Updated on Oct 22 2018 9:16 PM

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు టెర్రరిస్టులావ్యవహరిస్తున్నారని టీ.కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు.

హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు టెర్రరిస్టులావ్యవహరిస్తున్నారని టీ.కాంగ్రెస్ ఎమ్మెల్సీలు మండిపడ్డారు. పంజాబ్, శ్రీలంక సమస్యలను అప్పటి ఇందిరా గాంధీ, ఆమె తనయుడు రాజీవ్ గాంధీలు సరిగా డీల్ చేయకనే ఉగ్రవాదానికి బలయ్యారన్న చంద్రబాబు వ్యాఖ్యలపై యాదవ్ రెడ్డి, భూపాల్ రెడ్డిలు మండిపడ్డారు. అధ్యక్ష స్థానంలో ఉండి బాబు ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం తగదన్నారు.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను పంజాబ్, శ్రీలంక సమస్యలతో పోల్చుతూ ఏఐసీసీ అధ్యక్షుడు సోనియాగాంధీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలను కించపరిచేలా మాట్లాడిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఒకవేళ అలాకాకుంటే తామే బాబుపై కేసు పెడతామని హెచ్చరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement