శ్రీకాకుళం అర్బన్: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గొప్పగా చెప్పు కుంటున్న రైతుల రుణమాఫీపై స్పష్టత లేదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం ఒకటైతే ఇపుడు ఆయన ప్రక టించిన రుణమాఫీ వేరొకటని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళంలోని వైఎస్‌ఆర్ కూడలి వద్ద గురు వారం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు, డ్వాక్రా మహిళలకు పూర్తిగా రుణాలు మాఫీ చేస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవా లన్నారు. కండిషనల్‌గా రుణమాఫీ చేస్తామని చెబుతుండడంపై మం డిపడ్డారు. ప్రభుత్వం రైతులకు ఆదుకోవా లని వెఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటినుంచి ఒకటే చెబుతుందన్నారు.
దీన్ని ఆచరణలో చేయాలన్నారు. షరతులతో కూడిన రుణ మాఫీ వల్ల రైతులకు, డ్వాక్రా మహిళలకు ఒరిగిందేమీ ఉండదన్నారు. సంపూర్ణ రుణ మాఫీ చేసి రైతులను, డ్వాక్రా మహిళలను ఆదు కోవాలన్నారు. డ్వాక్రా మహిళలు, రైతుల తరఫున జిల్లా వ్యాప్తంగా మూడు రోజులపాటు వివిధ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ ఎం.వి. పద్మావతి మాట్లాడుతూ మహిళలకు రుణమాఫీ చేశామని చెబుతు న్నారని, ఇది సంపూర్ణంగా అమలు చేయా లన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమానికి ముందుగా సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మను వైఎస్‌ఆర్ కూడలి వద్ద దహనం చేసి నిరసన తెలిపారు. కార్య క్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు అంధ వరపు సూరిబాబు, చల్లా అలివేలు మంగ, జె.ఎం.శ్రీని వాస్, అబ్దుల్ రెహమాన్, శిమ్మ వెంకట్రావు, శిమ్మ రాజశేఖర్, మండవిల్లి రవి, కోరాడ రమేష్, గుడ్ల మల్లేశ్వరరావు, గుడ్ల దామోదరరావు పాల్గొన్నారు.
‘రుణమాఫీ మాట నిలబెట్టుకోవాలి’
Published Fri, Jul 25 2014 2:32 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement