బాబువి మాయ మాటలు | Chandrababu Naidu Cheating on Hudood Storm Victims | Sakshi
Sakshi News home page

బాబువి మాయ మాటలు

Published Sat, Oct 25 2014 2:47 AM | Last Updated on Tue, May 29 2018 11:47 AM

బాబువి మాయ మాటలు - Sakshi

బాబువి మాయ మాటలు

 విజయనగరం మున్సిపాలిటీ : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాయ మాటలతో ప్రజలను మోసగిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. తుపాను బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వ తీరు ను నిరసిస్తూ.. ఈ నెల 5వ తేదీన అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు చేపట్టనున్న ట్టు తెలిపారు. శుక్రవారం కోలగట్ల నివాసంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకుడు పీరుబండి జైహింద్‌కుమార్ కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్సార్ సీపీలో చే రారు. ఆయనతో పాటు గంట్యాడ మండ లం రామవరం, మురపాక, సిరిపురం, కరకవలస గ్రామాలకు చెందిన సుమారు 500 కుటుంబాలు కూడా పార్టీలో చేరా యి. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడు తూ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా తాను బాధ్యతలు నిర్వహిస్తున్నా.. పార్టీని పటిష్ట పరచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. కార్యకర్తలను ప్రోత్సహించే విధం గా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తామని, ప్రతి ఒక్కరూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. జైహింద్‌కుమార్ తన మాటకు గౌరవించి పార్టీలో చేరడం ద్వారా తనలో ఆత్మస్థైర్యం పుంజుకుందన్నారు.
 
 చంద్రబాబు మాయ మాటలు నమ్మి రైతులు, డ్వాక్రా మహిళలు మోసపోయారన్నారు. టీడీపీ మాటలు నమ్మి రైతులు   రుణాలు తీర్చుకోలేక, ప్రభుత్వం తీర్చక పంట భీమాను కోల్పోయిన పరిస్థితి వచ్చిందన్నారు. డ్వాక్రా రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం ఇప్పటికీ మాయమాటలతో కాలం వెల్లదీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తుపాను ధాటికి జిల్లా ప్రజలు ఆర్థికం గా,మానసికంగా కుదేలైతే తక్షణ సాయం అందించడంలోనీచరాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. పంటను సా  గు చేస్తున్న కౌలురైతులకు కాకుండా య జమానుల పేరిట నష్ట పరిహారం రాయ డం ఎంతవరకు సమంజమని ప్రశ్నించా రు. రుణమాఫీ, తుపాను బాధితులకు న్యాయమైన పరిహారం అందించాలన్న డిమాండ్‌తో వచ్చేనెల 5న అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రభుత్వం తీరు ను ఎండగట్టాలని సూచించారు.
 
 పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు పెనుమ త్స సాంబశివారజు మాట్లాడుతూ జైహిం ద్‌కుమార్ పార్టీలో చేరడం  శుభపరిణామమన్నారు. నిస్వార్థంగా పని చేసే స్వభావం కల  జైహింద్ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ముంద డుగు వేయాలన్నారు. జైహింద్‌కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని వీడి వైఎ స్సార్ సీపీలో చేరిన తాను అందరితో కలి సికట్టుగా పని చేస్తానన్నారు.   ఈ కార్యక్రమంలో నెలిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు, ఎస్. కోట నియోజకవర్గ ఇన్‌చార్జి నెక్కల నా యుడుబాబు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అవనాపు విజయ్, పార్టీ ఎస్సీ సెల్ నాయకుడు ఆదాడ మోహనరావు,  కెవి.సూర్యనారాయణరాజు,అంబళ్ల శ్రీరాములనాయుడు, చనుమళ్ల వెంకటరమణ, కాళ్ల గౌరీశంకర్, గొర్లె వెంకటరమణ, వర్రి నర్సింహమూర్తి, మామిడి అప్పల నాయుడు, ఎస్‌ఎం సన్యాసినాయుడు, ఎస్‌వీవీ రాజేష్, ఆశపు వేణు, శ్రీను, బంగారునాయుడు, పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement