
బాబుపై ప్రజలకు నమ్మకం లేదు
గరివిడి : అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజా విశ్వాసాన్ని కోల్పోయారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం పార్లమెంట్ పరిశీలకుడు బెల్లాన చంద్రశేఖర్ అన్నా రు. ఆదివారం ఆయన ఇక్కడి విలేకరులతో మాట్లాడారు. తుపాను వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఇప్పటివరకు నష్టపరిహారం చెల్లిం పుపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వలేదన్నారు. టేకు, బొప్పాయి చెట్లు నేలకొరిగినా.. వాటికి ఎంత చెల్లిస్తారన్నది కూడా వెల్లడించలేదని చెప్పారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై టీడీపీ నాయకులు దౌర్జన్యానికి దిగడమే కాకుండా ఆయనపై తప్పుడు కేసులు నమోదు చేశారని ఆరోపించారు. టీడీపీ నాయకు లు, కార్యకర్తల దౌర్జన్యాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. తుపాను బాధితులకు అన్యాయం జరిగే వారి తరఫున పోరాడేందుకు త మ పార్టీ సిద్ధంగా ఉందన్నారు.
5న తహశీల్దార్ కార్యాలయాల ముట్టడి
రుణమాఫీ అమలులో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. ఈనెల 5వ తేదీన తహశీల్దార్ కార్యాలయాలను ముట్టడించనున్నట్టు బెల్లాన తెలిపారు. ఆదివారం ఆయన గరివిడిలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుం డా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. బాబు ఆరు నెల ల పాలనకే ప్రజలు విసుగుచెందారన్నారు. ప్రభుత్వం తక్షణమే గరివిడి ఫేకర్‌ను తెరిపించాలని డిమాండ్ చేశారు. ఫేకర్ కార్మికులకు తమ పార్టీ పూర్తిస్థాయిలో మద్దత ఇస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో ఆ పార్టీ నాయకులు వలిరెడ్డి శ్రీను, తుమ్మగంటి సూరినాయుడు, పిన్నింటి శ్రీను, సివుకు కాంతారావు , జమ్ము బంగారి, బొంపల్లి వెంకటరావు, జగదీష్, ఉత్తరావల్లి ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.