మరోసారి దగా! | Chandrababu Naidu cheating people over crop loan waiver | Sakshi
Sakshi News home page

మరోసారి దగా!

Published Sun, May 31 2015 2:01 AM | Last Updated on Tue, Aug 14 2018 3:47 PM

Chandrababu Naidu cheating people over crop loan waiver

  ‘డ్వాక్రా రుణాల మాఫీ’లో మతలబు
  మాఫీ కావాల్సిన సొమ్ము రూ.450 కోట్లు
  వడ్డీ భారం రూ.30 కోట్లు
  మాట మార్చిన చంద్రబాబు
  ‘పెట్టుబడి నిధి’కి మొదటి విడత రూ.119 కోట్లు
  చంద్రబాబు తీరుపై మండిపడుతున్న డ్వాక్రా మహిళలు
 
 విజయనగరం అర్బన్: స్వయం సహాయక సంఘాల రుణాలను మాఫీ చేస్తానని ఎన్నికల కు ముందు హామీనివ్వడమే కాకుండా, ఎవ రూ రుణం చెల్లించొద్దంటూ మహిళలకు పిలు పు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక మాఫీ సంగతి మరి చిపోవడంతో మరోసారి దగాకు గురయ్యామని మహిళలు వాపోతున్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చి ఏడాది కావస్తున్నా రైతు రుణమాఫీయే సరిగా చేయలేదని, దీన్నిబట్టి డ్వాక్రా రుణాలను అరకొరగా మాఫీ చేస్తుందనే మహిళల అనుమానం నిజమయ్యే పరిస్థితి స్పష్టం గా కనిపిస్తోంది. డ్వాక్రా మహిళల రుణాలను పూర్తిస్థాయిలో మాఫీ చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా నేతలందరూ ఎన్నికల ప్రచారంలో పదేపదే చెప్పటంతో డ్వాక్రాగ్రూపుల్లోని సభ్యులు రుణాలు చెల్లించలేదు.
 
 సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన రోజున చంద్రబాబు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని పేర్కొన్నప్పటికీ తర్వాత మాట మార్చారు. మొత్తం కాదు.. కేవలం గ్రూపునకు లక్ష రూపాయల చొప్పున మాఫీ చేస్తానని చెప్పారు. తీరా చూస్తే ఇప్పుడు రూటు మార్చారు. మాఫీ మాట మరిచి లక్ష రూపాయల్లో ఒక్కో సభ్యుని కి రూ.10 వేల వంతున హామీ లేని రుణంగా ఇస్తామంటున్నారు. దాన్ని కూడా ఒకేసారి ఇవ్వకుండా విడతల వారీగా ఇస్తారు. ప్రసు ్తతం డ్వాక్రా సంఘాలకు పెట్టుబడి నిధి పేరు తో ఇస్తున్న సొమ్మును కూడా పొదుపు మొత్తంలాగే వాడుకోవాలని ఆదేశాలు ఇవ్వ డం మహిళల కు ఆగ్రహం కలిగిస్తోంది.
 
  ఒకేసారి రూ.10 వేలు ఇస్తానంటూ బహిరంగ సభల్లో ప్రకటించిన చంద్రబాబు, లోటు బడ్జె ట్ పేరుతో ఈ సారికి రూ.3 వేలు మాత్రమే ఇచ్చారు. మిగతా సొమ్ము విడతలవారీగా ఇస్తామని పేర్కొనడం మహిళలకు ఆందోళన కలిగిస్తోంది. అంతేకాకుండా ప్రస్తుతం జమ చేసే రూ.3 వేలను కూడా వాడుకోకుండా గ్రూపు మొత్తంమీద వచ్చే సొమ్మును పొదుపులాగే అకౌంట్లల్లో ఉంచుకొని వడ్డీ మాత్రమే తీసుకోవాలని మెలిక పెట్టడంపై మహిళలు మండిపదుతున్నారు. రుణమాఫీ ప్రకటించడమెందుకు.. ఇప్పుడు జారుకోవడమెందుకంటూ శాపనార్ధాలు పెడుతున్నారు.
 
 ‘ఆధార్’లేదని 11 వేల మంది సభ్యులకు ఎగనామం
 జిల్లాలోని డ్వాక్రా మహిళా సంఘాలు పట్టణ ఇందిర క్రాంతి పథం, గ్రామీణాభివృద్ధి శాఖ ల పరిధిలో ఉన్నాయి. పట్టణ ఇందిర క్రాంతి పథం కింద సుమారు 6,368 గ్రూప్‌లుండగా వీటిలో 67,693 మంది సభ్యులున్నారు. ప్రస్తుతం సభ్యుల ఆధార్ సీడింగ్ సుమారు 90 శాతం అయినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 7 వేల మంది సభ్యుల ఆధార్ అనుసంధానం కావాల్సి ఉంది. గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని గ్రూపులలో 4,01,925 మం ది సభ్యులున్నారు. వీరిలో 4 వేల మంది సభ్యుల ఆధార్ అనుసంధానం కాలేదు. ఆధా ర్ అనుసంధానం కాలేదన్న నెపంతో మొత్తం 11 వేల మందికి రుణమాఫీ వర్తింపజేయకుండా ఎగనామం పెడుతున్నారు. అందించే అరకొర సాయాన్ని కూడా కత్తిరించడానికి ప్రభుత్వం ప్రయత్నించడాన్ని మహిళలు జీర్ణించుకోలేకపోతున్నారు.
 
  జిల్లాకు చెందిన 33,926 డ్వాక్రా సంఘాల ‘పెట్టుబడి నిధి’కి తొలి విడత రూ.119.38 కోట్లు రానుంది. ఒక్కో సభ్యురాలికి రూ.3 వేలు చెప్పున అందించడానికి ఈ సొమ్మును వినియోగించనున్నారు. ఈ మేరకు తొలి విడత నిధులను వచ్చే నెల 3వ తేదీ నుంచి పొదుపు నిధి ఖాతాల్లో వేయనున్నారు.  ఎన్నికల హామీ మేరకు జిల్లాలోని మహిళా పొదుపు సంఘాలకు రూ.450 కోట్ల మేర రుణమాఫీ చేయాల్సి ఉంది. ఇప్పటివరకు మాఫీ చేయకపోవడం వల్ల ఈ మొత్తంపై రూ.30 కోట్ల వరకు వడ్డీ పడింది. గతంలో గ్రేడ్-ఏలో ఉన్న 20 వేల మహిళా పొదుపు సంఘాలు ప్రస్తుతం ఆర్థికభారంతో ఇబ్బంది పడుతున్నాయి.
 
  ప్రస్తుతం రుణమాఫీ ఊసు ఎత్తకుండా వడ్డీ మాత్రం మాఫీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. తాజాగా ఫిబ్రవరి 2014 నుంచి ఏప్రిల్ 2015 వరకు 15 నెలల వడ్డీ మొత్తం రూ.24.05 కోట్లను రాయితీగా చెల్లిస్తామని ప్రకటించింది. అయితే ఇందుకు సంబంధించిన విధివిధానాలు, చెల్లింపు షెడ్యూల్‌ను ప్రకటించలేదు.
  జిల్లాలో 35,734 సంఘాలకుగాను వెబ్‌సైట్‌లో సమగ్ర సమాచారంలేని 1,356 సంఘాలు ఉన్నాయి. 4,01,265 సభ్యులకుగాను, 3,97,945 మంది సభ్యుల ఆధార్ సీడింగ్ జరిగింది.
 
 అప్పులే మిగిలాయి
 పొదుపు సంఘంలో చేరిన తర్వాత అప్పులే మిగిలాయి. చంద్రబాబు నాయుడు మాట నమ్మి రుణాలు చెల్లించలేదు. దీంతో మా ఖాతాల్లోంచి దాదాపు 35 వేల రూపాయలు బ్యాంకు అధికారులు  తీసుకున్నారు. దీంతో అప్పులు చేసి మళ్లీ డబ్బులు జమ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు పది వేల రూపాయలు వేస్తారనుకుంటే కేవలం రూ. 3 వేలతో సరిపెట్టేస్తునానరు.  
               - ఎ రమణమ్మ, గొల్లపల్లి    
 
 చంద్రబాబునాయుడు మాటలు నమ్మి మోసపోయాం
 ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడు ఇచ్చి న వాగ్దానాలను నమ్మి మోసపోయాం. మేము రుణం రూ.2లక్షల 24వేలు తీసుకున్నాం. గ్రూపు సభ్యులు 12 మందిమిఉన్నాం. నెలకు రూ.9,600 చెల్లించాం. గత ఆరు నెలలుగా వడ్డీ చెల్లించడం మానేశాం. బ్యాంకర్లు ఒత్తిడి తేవడంతో మరలా చెల్లిస్తున్నాం. గతంలో నెలకు రూ.1232 వడ్డీ ఇచ్చేవారు. బాబు అధికారంలోకి వచ్చాక వడ్డీ ఇవ్వలేదు.
 -పొలమరశెట్టి నారాయణమ్మ, మహిళాపొదుపుసంఘం సభ్యురాలు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement