సీఎం చంద్రబాబు రాక రేపు
విజయనగరం క్రైం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో రూరల్ యూత్ సెల్ఫ్‌హెల్ప్ గ్రూపులకు స్కిల్ డెవలప్‌మెంట్ పోగ్రాంపై డెంకాడ మండలం చింతలవలస ఎంవీజీఆర్. ఇంజినీరింగ్ కళాశాలలో ప్రజలతో మాట్లాడతారు. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు శ్రీకాకుళం జిల్లా రాజాం నుంచి హెలికాప్టర్‌లో బయుల్దేరి 10.45 నిమిషాలకు చీపురుపల్లి జీవీఆర్ ప్రభుత్వజూనియర్ కళాశాలకు చేరుకుంటారు. 10.50 నిమిషాలకు చీపురుపల్లి కనకమహాలక్ష్మి అమ్మవారి కుంభాభిషేకం కార్యక్రమంలో పాల్గొంటారు. 11.05 నిమిషాలకు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మీటింగ్, 11.10 నిమిషాలకు పార్వతీపురంలో రూ.పదికోట్ల వ్యయంతో నిర్మించిన వందబెడ్‌ల ఆస్పత్రి పైలాన్‌ను చీపురుపల్లిలో ప్రారంభిస్తారు.
11.15 నిమిషాలకు చీపురుపల్లి30 బెడ్‌ల ఆస్పత్రిప్రారంభోత్సవంచేస్తారు. 11.20 నిమి షాలకు స్వచ్ఛ జిల్లా స్థూపం ఆవిష్కరణ, 11.25నుంచి11.35 మధ్య స్వచ్ఛ ఆంధ్రా జెండా ఆవిష్కరణ చేసి, 11.35నుంచి 11.45 అతిథులతో మాట్లాడతారు. 11.45నుంచి 12.15 నిమిషాల వరకు ముఖ్యమంత్రి సందేశం ఉంటుంది. 12.15నిమిషాలకు చీపురుపల్లి ప్రభుత్వ హైస్కూల్‌నుంచి హెలిపాడ్‌కు చేరుకుంటారు.12.20 నిమిషాలకు బయలుదేరి 12.37 నిమిషాలకు జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయ పరేడ్ మైదానానికి చేరుకుంటారు. భోజన విరామ అనంతరం ముఖ్య ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చలు జరుపుతారు. 1.45 నిమిషాలకు హెలికాప్టర్‌ద్వారా డెంకాడ మండలం చింతలవలసలో ఏపీఎస్పీ 5వ బెటాలియన్ పరేడ్ మైదానానికి చేరుకుంటారు. 2గంటలకు అధికారులు, అనధికారులతో సమావేశం జరుగుతుంది.
2.05 నిమిషాలకు డెంకాడలోని ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాలకు చేరుకుని ట్రైబల్ యూత్ ట్రైనింగ్ సెంటర్ పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించడంతో పాటు జాబ్ మేళాను ప్రారంభిస్తారు. 2.55 నిమిషాలకు గ్రామీణ ప్రాంత మహిళలతో స్కిల్ డెవలప్‌మెంట్‌పై ముఖాముఖి సంభాషణ ఉంటుంది. 3.30నుంచి 4.00వరకు ముఖ్యమంత్రి సందేశం. అనంతరం 4.05 చింతవలస 5వ బెటాలియన్ హెలిపాడ్‌కు చేరుకుంటారు. ఈ మేరకు కలెక్టరు ఎం.ఎం.నాయక్, డ్యూమా పీడీ ప్రశాంతి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్, ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణి తదితరులు ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలోని సభాస్థలాన్ని సోమవారం పరిశీలించారు.