ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం మంత్రులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం మంత్రులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. రాజధానిపై చర్చ జరగాల్సిందేనని అసెంబ్లీలో ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టడంతో ప్రభుత్వం డిఫెన్స్లో పడిపోయింది. దాంతో రాజధాని అంశంపై చర్చించేందుకు చంద్రబాబు అసెంబ్లీ వాయిదా అనంతరం మంత్రులతో భేటీ అయ్యారు. కాగా రాజధానిపై గురువారం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఎట్టిపరిస్థితుల్లో అయినా ప్రకటన చేయాలని నిర్ణయించారు. దాంతో బాబు ప్రకటన తర్వాతే రాజధానిపై చర్చ జరగనుంది.
ఈమేరకు మంత్రులకు ఆయన సూచనలు ఇచ్చారు. రాజధాని విషయంలో మంత్రులంతా ఏకతాటిపై ఉండాలని ఆయన ఆదేశించారు. ప్రతిపక్షం చర్చకు పట్టుబడితే ఎదురుదాడికి సిద్ధంగా ఉండాలని బాబు తన మంత్రులకు సూచనలు ఇచ్చారు. రాజధాని అంశంపై చర్చకు ప్రతిపక్షం పట్టుబడితే ఏకపక్షంగా అయినా ఆమోదింపచేసుకోవాలని ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.