ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు: చంద్రబాబు | chandrababu naidu order to comments against governor narasimhan | Sakshi
Sakshi News home page

ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు: చంద్రబాబు

Published Fri, Jun 19 2015 12:14 PM | Last Updated on Sat, Mar 23 2019 9:03 PM

ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు: చంద్రబాబు - Sakshi

ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు: చంద్రబాబు

హైదరాబాద్ : గవర్నర్ నరసింహన్పై వ్యాఖ్యల విషయంలో  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. గవర్నర్పై ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దంటూ మంత్రులు, పార్టీ నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చారు. ఎవరూ ...గవర్నర్ను విమర్శించవద్దని, కించపరిచేలా వ్యాఖ్యలు చేయరాదని సూచించారు. కాగా గవర్నర్పై మంత్రులు అచ్చెన్నాయుడు, పల్లె రఘునాథరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వారిద్దరూ తమ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు.

కాగా  గవర్నర్‌ను కించపరిచే విధంగా మంత్రులు, పార్టీ నేతల ద్వారా అడ్డగోలుగా మాట్లాడిస్తున్న తీరుపై ఓ వైపు నరసింహన్తో పాటు, మరోవైపు కేంద్రం కూడా మండిపడింది. ఇలాగే కొనసాగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే హెచ్చరికలు జారీ అయిన విషయం తెలిసిందే. రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్న గవర్నర్ విషయంలో రాజకీయం చేయాలన్న చంద్రబాబు ప్రయత్నం బెడిసికొట్టింది. దాంతో రంగంలోకి దిగిన బాబు ... మంత్రులు, టీడీపీ నేతలు...గవర్నర్పై వ్యాఖ్యలు చేయరాదని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement