హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక రుణప్రణాళికను విడుదల చేశారు. సోమవారం హైదరాబాద్లో జరిగిన ఎస్ఎల్బీసీ సమావేశంలో చంద్రబాబు నాయుడు, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, బ్యాంకర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా 2015-16 సంవత్సరానికి గానూ 1,25,748 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేయాలని బ్యాంకులకు లక్ష్యం నిర్దేశించారు.
వ్యవసాయ రుణాలు రూ. 65,272 కోట్లు, స్వల్పకాల రుణాలు రూ.48, 067 కోట్లు మంజూరు చేయాలని ఆయన సూచించారు. అలాగే టర్మ్లోన్లు రూ. 7,813 కోట్లు, వ్యవసాయ అనుబంధ రుణాలు రూ. 9,392 కోట్లు మంజూరు చేయడమే లక్ష్యంగా పెట్టుకోవాలని చంద్రబాబు పేర్కొన్నారు. రుణాల రీషెడ్యూల్లో జాప్యం జరుగుతుందని, దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని చంద్రబాబు తెలిపారు.
వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేసిన చంద్రబాబు
Published Mon, Jun 29 2015 5:27 PM | Last Updated on Tue, Jun 4 2019 6:37 PM
Advertisement